facebook friend: ఆంటీ ఒకేఒక్క చాన్స్, మీరు ఫోన్ చేస్తున్న నెంబర్ తాత్కాలికంగా.... దయచేసి !

చెన్నై7 మదురై: ఫేస్ బుక్ లో అమ్మాయిలు, ఆంటీలతో పరిచయం పెంచుకుంటున్న ఓ యువకుడు వారికి మాయమాటలు చెప్పి దగ్గర అవుతున్నాడు. అమ్మాయిలు, మహిళలతో స్నేహం ముదిరిపోయిన తరువాత ఆదేశముదురు వారికి తాను కొత్తగా వ్యాపారం చేస్తున్నానని, వచ్చిన లాభంలో మీకు భాగం ఇస్తానని మాయమాటలు చెప్పి రూ. లక్షలు వసూలు చేసుకుని తరువాత మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేస్తున్నాడు. బాధితులు ఫోన్ చేస్తే మీరు ఫోన్ చేస్తున్న నెంబర్ స్వీచ్ ఆఫ్ వస్తోంది... దయచేసి కొంత సేపటి తరువాత ఫోన్ చెయ్యండి అంటూ సమాధానం వస్తోంది. దేశముదురు దెబ్బతో బలి అయిన ఆంటీ మొగుడు ఫిర్యాదు చెయ్యడంతో ఫేస్ బుక్ కాలాంతకుడు కటకటాలపాలైనాడు. ఇప్పటికే లెక్కలేనంత మంది మహిళలను ఆ యువకుడు మోసం చేశాడని పోలీసులు అంటున్నారు.

సీతాకోకచిలుకల కోసం ఫేస్ బుక్ లో వేట

సీతాకోకచిలుకల కోసం ఫేస్ బుక్ లో వేట


చెన్నై సిటీలోని చూలై హంటర్స్ రోడ్డులో దిలీప్ (28) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. సోషల్ మీడియాలో దిలీప్ చాలా చురుకుగా ఉంటాడు. ఫేస్ బుక్, వాట్సాప్ తో సహ సోషల్ మీడియాలో ప్రతిరోజు ఎక్కువ సమయం గడపడం దిలీప్ కు అలవాటుగా మారిపోయింది. ఇదే సమయంలో దిలీప్ ఫేస్ బుక్ లో అనేక మంది అమ్మాయిలు, వివాహిత మహిళలు, ఆంటీలతో చాటింగ్ చేస్తున్నాడు.

పక్కా స్కెచ్ తో వల

పక్కా స్కెచ్ తో వల


ఫేస్ బుక్ లో పరిచయం అయిన అమ్మాయిలు, ఆంటీలతో అమాయకుడిలా నటిస్తు దిలీప్ వారికి దగ్గర అవుతున్నాడు. తరువాత ఫేస్ బుక్ ఫ్రెండ్స్ ను నేరుగా కలుసుకునే దిలీప్ వారితో మరింత పరిచయం పెంచుకుని వారి ఇళ్లుకు వెళ్లి వస్తున్నాడు. అమాయకులే దిలీప్ కు టార్గెట్ గా మారిపోయారు.

 రాఖీ ఆంటీకి మాయమాటలు

రాఖీ ఆంటీకి మాయమాటలు


చెన్నైలోని వేపరి పోలీస్ స్టేషన్ పరిధిలోని బర్నాబీ రోడ్డులో ప్రవీణ్ కడలోయ (49), రాఖీ కడలోయ దంపతులు నివాసం ఉంటున్నారు. కొన్ని నెలల క్రితం ఆంటీ రాఖీతో దిలీప్ కు ఫేస్ బుక్ లో పరిచయం అయ్యింది. తరువాత రాఖీ, దిలీప్ ఫేస్ బుక్ లో చాటింగ్ చేసుకుంటున్నారు. రెండు నెలల క్రితం రాఖీ ఆంటీ ఇంటి అడ్రస్ తెలుసుకున్న దిలీప్ నేరుగా వారి ఇంటికి వెళ్లాడు. రాఖీ ఆంటీ భర్త ప్రవీణ్ ను పరిచయం చేసుకున్న దిలీప్ వారికి మాయమాటలు చెప్పాడు.

ఫ్లీజ్ ఆంటీ ఒక్కసారి చెయ్యండి

ఫ్లీజ్ ఆంటీ ఒక్కసారి చెయ్యండి

తాను కొత్తగా వ్యాపారం చెయ్యాలని అనుకుంటున్నానని, మీరు సహాయం చేస్తే జీవితాంతం మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటానని రాఖీ ఆంటీకి దిలీప్ మాయమాటలు చెప్పాడు. తరువాత అనేక రకాలుగా రాఖీ, దిలీప్ దగ్గర అయ్యారు. ఆ చనువుతో తనకు రూ. 5 లక్షలు అప్పు ఇస్తే తిరిగి చెల్లిస్తానని, వ్యాపారంలో లాభాలు వస్తే మీకు భాగం ఇస్తానని దిలీప్ ఆంటీ రాఖీని నమ్మించాడు. చనువు ఎక్కువగా ఉండటంతో రాఖీ ఆంటీ మొహమాటంతో సరే డబ్బులు ఇస్తానని దిలీప్ కు మాట ఇచ్చింది.

 మీరు ఫోన్ చేస్తున్న నెంబర్ తాత్కాలికంగా !

మీరు ఫోన్ చేస్తున్న నెంబర్ తాత్కాలికంగా !

గత నెల 20వ తేదీన రాఖీ ఆంటీ దగ్గర రూ. 2. 75 లక్షలు అప్పు తీసుకున్న దిలీప్ తరువాత మాయం అయిపోయాడు. దిలీప్ కనపడకపోవడంతో రాఖీ ఆంటీకి అనుమానం వచ్చి అతని ఫోన్ నెబర్ కు ఫోనేసింది. ఆ రోజు నుంచి రాఖీ ఆంటీకి దిమ్మతిరిగిపోయింది. మీరు ఫోన్ చేస్తున్న నంబర్ తాత్కాలికంగా పని చెయ్యడం లేదని, దయచేసి తరువాత ప్రయత్నించండి అంటూ రాఖీ ఆంటీకి సమాధానం వస్తూనే ఉంది.

 స్టోరీ చెప్పకుండా కేసు పెట్టిన భర్త

స్టోరీ చెప్పకుండా కేసు పెట్టిన భర్త

దిలీప్ మోసగాడు అని గుర్తించిన రాఖీ ఆంటీ వారి అసలు విషయం చెప్పకుండా డబ్బులు తీసుకుని దిలీప్ మోసం చేశాడని మాత్రమే భర్త ప్రవీణ్ కు చెప్పింది. ప్రవీణ్ తన భార్య రాఖీ అసలు కథ పూర్తిగా పక్కన పెట్టి ఆ విషయం పోలీసులకు చెప్పకుండా తమ దగ్గర దిలీప్ రూ. 2. 75 లక్షలు తీసుకుని మోసం చేశాడని వేపరి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాడు.

కాలాంతకుడు కాదు కేటుగాడు

కాలాంతకుడు కాదు కేటుగాడు


రాఖీ ఆంటీ కేసు పెట్టినప్పటి నుంచి దిలీప్ కోసం గాలిస్తున్న పోలీసులు చివరికి గతరాత్రి దిలీప్ ను పట్టుకుని బెండ్ తీశారు. రాఖీ ఆంటీనే కాకుండా అనేక మంది అమ్మాయిలు, వివాహిత మహిళలకు దిలీప్ కుచ్చుటోపీ పెట్టాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. దిలీప్ ను విచారణ చేసి మరింత వివరాలు బయటకు లాగుతున్నామని చెన్నై పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+