చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Family war: మాజీ సీఎం కొడుకులు, అన్నదమ్ముల సవాల్, కొత్త పార్టీకి సిద్దం, రజనీ కాదు, సీఎం కుర్చీ?

|
Google Oneindia TeluguNews

చెన్నై/ మదురై: తమిళనాడు మాజీ సీఎం ఎం. కరుణానిధి కుమారుల అన్నదమ్ముల సవాల్ తో రాజకీయంగా కలకలం రేపుతోంది. ఇప్పటికే డీఎంకే పార్టీ చీఫ్ గా కొనసాగుతున్న ఎంకే. స్టాలిన్ కు చుక్కలు చూపించడానికి అతని అన్న, మాజీ కేంద్ర మంత్రి ఎంకే. అళగిరి సిద్దం అవుతున్నారు. తనను పార్టీకి దూరం చేసిన తమ్ముడు స్టాలిన్ కు 70 MM సినిమా చూపించాలని అళగిరి సిద్దం అవుతున్నారని సమాచారం.

దక్షిణ తమిళనాడులో తనకంటూ ఎదురులేని వర్గాన్ని ఎర్పాటు చేసుకున్న అళగిరి తన తండ్రి పేరు కలిసివచ్చేలా కొత్త రాజకీయ పార్టీని స్థాపించడానికి సిద్దం అవుతన్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్, బీజేపీకి దగ్గర అయినట్లే అయిన అళగిరి ఇప్పుడు కొత్త పార్టీ పేరు తెర మీదకు తీసుకురావడంతో డీఎంకే పార్టీ రెండుగా చీలిపోయే అవకాశం ఉండటంతో ఆ పార్టీ రాజకీయ నాయకుల్లో కలవరం మొదలైయ్యింది.

Illegal affair: పైకి కోచింగ్ సెంటర్, ప్రియుడికి భార్య రొమాన్స్ పాఠాలు, నగ్న వీడియో షేర్, క్లైమాక్స్Illegal affair: పైకి కోచింగ్ సెంటర్, ప్రియుడికి భార్య రొమాన్స్ పాఠాలు, నగ్న వీడియో షేర్, క్లైమాక్స్

సూపర్ స్టార్ పార్టీ సీఎం అభ్యర్థి అళగిరి?

సూపర్ స్టార్ పార్టీ సీఎం అభ్యర్థి అళగిరి?

సౌత్ ఇండియా సూపర్ స్టార్, తలైవా రజనీకాంత్ గత ఏడాది రాజకీయ పార్టీ స్థాపించిన విషయం తెలిసిందే. సూపర్ స్టార్ రజనీకాంత్ తో తమిళనాడు మాజీ సీఎం ఎం. కరుణానిధి కుమారుడు ఎంకే. అళగిరి అనేకసార్లు కలిశారు. సూపర్ స్టార్ రజనీకాంత్ పార్టీ సీఎం అభ్యర్థి అళగిరి అంటూ కొంతకాలం క్రితం జోరుగా ప్రచారం జరిగింది. అయితే స్నేహపూర్వకంగానే రజనీకాంత్, అళగిరి కలిశారని ఇరు వర్గాల నాయకులు చెబుతూ వచ్చారు. తరువాత ఆ విషయం మరుగునపడిపోయింది.

ఒక్క ప్రెస్ మీట్ తో కలకలం

ఒక్క ప్రెస్ మీట్ తో కలకలం

తాను రజనీకాంత్ పార్టీ సీఎం అభ్యర్థి కాదని చెప్పడానికి అళగిరికి ఎంతోకాలం పట్టలేదు. తనను డీఎంకే పార్టీ నుంచి బహిష్కరించిన తన సోదరుడు ఎంకే. స్టాలిన్ కు చుక్కలు చూపిస్తానని చెప్పడానికి అళగిరి ఒక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. తాను ఏ పార్టీలో (రజనీకాంత్ పార్టీ, బీజేపీలో) చేరడం లేదని, తన వర్గంలోని రాజకీయ నాయకుల కోసం, తన తండ్రి ఎం. కరుణానిధి ఆశయాలు కాపాడటానికి కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చెయ్యాలని ఆలోచిస్తున్నానని అళగిరి ఒక్కసారి బాంబు పేల్చారు.

 డీఎంకేలో చిచ్చురేపిన అళగిరి

డీఎంకేలో చిచ్చురేపిన అళగిరి

మాజీ కేంద్ర మంత్రి అళగిరికి డీఎంకే పార్టీలో మంచి పట్టుఉన్నా తండ్రి ఎం. కరుణానిధి బతుకున్న రోజుల్లో ఆయన కోరిక మేరకు ఆ పార్టీలో జోక్యం చేసుకోకుండా దక్షిణ తమిళనాడకు పరిమితమై సైలెంట్ గా ఉండిపోయారు. కరుణానిధి మరించిన తరువాత అళగిరి డీఎంకే పార్టీలో కీలకంగా వ్యవహరించడానికి అనేక ప్రయత్నాలు చేసి విఫలం అయ్యారు. అయితే డీఎంకే పార్టీలో అసమ్మతివాదుల సంఖ్య ఎక్కువగానే ఉంది. ఇలాంటి సమయంలో తాను కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నానని చెప్పిన అళగిరి డీఎంకే పార్టీలోని అసమ్మతివాదులకు ధైర్యం చెబుతూ ఆ పార్టీ నాయకుల మధ్య చిచ్చురేపారు.

కలైంజర్ డీఎంకే పార్టీ?

కలైంజర్ డీఎంకే పార్టీ?

మాజీ సీఎం కరుణానిధి పేరు, అన్నాదురై పేర్లు కలిసివచ్చేలా అళగిరి కొత్తపార్టీ తెరమీదకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. తన కొత్త పార్టీలో డీఎంకే మాత్రం కచ్చితంగా ఉంటుందని అళగిరి ఇప్పటికే స్పష్టం చేశారని ఆయన వర్గీయులు అంటున్నారు. 1960లో కరుణానిధి ప్రదర్శించిన కలైంజర్ అనే నాటకం ఆయనకు తిరుగులేని రచయితగా, నాయకుడిగా గుర్తింపు తెచ్చింది. కరుణానిధిని కలైంజర్ అని పిలుస్తుంటారు. తన కొత్త పార్టీకి కలైంజర్ డీఎంకే పార్టీ పేరు పెట్టాలని అళగిరి దాదాపుగా డిసైడ్ అయ్యారని సమాచారం.

సోదరుడికి 70 MM సినిమా

సోదరుడికి 70 MM సినిమా

ఇదే జరిగితే డీఎంకే పార్టీని తన చేతుల్లోకి తీసుకుని తమిళనాడు సీఎం కావాలని కలలు కంటున్న తన సోదరుడు ఎంకే, స్టాలిన్ కు అళగిరి సినిమా చూపిస్తాడని డీఎంకే పార్టీలోని కొందరు నేతలు వాపోతున్నారు. దక్షిణ తమిళనాడులో అళగిరి తిరుగులేని నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. దక్షిణ తమిళనాడులో డీఎంకే పార్టీని దెబ్బకొడితే తమిళనాడులో అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్న ఎంకే. స్టాలిన్ ఆశలకు భారీగా గండిపడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Recommended Video

We Will Not Accept Anyone Apart From Gandhi's Family -Telangana Congress Leader Jagga Reddy
 ఎవరికి లాభం?

ఎవరికి లాభం?

తమిళనాడులో ప్రస్తుతం అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీ వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి రావడం కష్టంగా తయారైయ్యింది. జయలలిత లేని లోటు అన్నాడీఎంకే పార్టీలో స్పష్టంగా కనపడుతోంది. ఇలాంటి సమయంలో అధికారంలోకి రావాలని కలలు కంటున్న డీఎంకే పార్టీకి ఇప్పుడు ఎంకే. అళగిరి రూపంలో పెద్ద తలనొప్పి అయ్యింది. బీహార్ లో నితీశ్ కుమార్ ను దెబ్బ తియ్యడానికి ఎల్ జేపీ ఎలా రంగంలోకి దిగిందో ఇప్పుడు తమిళనాడులో సొంత సోదరురుడు ఎంకే. స్టాలిన్ ను, డీఎంకే పార్టీని దెబ్బ కొట్టడానికి ఎంకే. అళగిరి అలాగే ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది. ఆరు నెలల్లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అళగిరి మంత్రం, ఆయన ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో వేచి చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు, తమిళనాడు ప్రజలు.

English summary
Family war: Sources said that Former Union Minsiter MK Azhagiri may launch New Political Party ahead of Tamil Nadu Assembly Election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X