Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తట్టుకోలేకపోతున్నారు.. రజనీ ఇంటి ముందు అభిమాని ఆత్మహత్యాయత్నం... తలైవా రాజకీయాల్లోకి రావాలని..

చెన్నైలోని సూపర్ స్టార్ రజనీకాంత్ ఇంటి ముందు ఆయన అభిమాని ఒకరు ఆత్మహత్యాయత్నం చేశారు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. తీవ్ర గాయాలపాలైన అతన్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాల్సిందేనని డిమాండ్ చేస్తూ అతను ఆత్మహత్యకు యత్నించడం గమనార్హం. ఆ వ్యక్తిని మురుగేషన్‌గా పోలీసులు గుర్తించారు. రాజకీయాల్లోకి రావట్లేదని ఇటీవల రజనీకాంత్ చేసిన ప్రకటనతో తీవ్ర మనస్తాపం చెందిన మురుగేషన్ ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు.

దిష్టిబొమ్మలు తగలబెడుతున్న ఫ్యాన్స్..

దిష్టిబొమ్మలు తగలబెడుతున్న ఫ్యాన్స్..

రాజకీయాలకు తాను దూరమని రజనీ చేసిన ప్రకటనతో తమిళనాట ఆయన అభిమానులు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. కొద్దిరోజుల క్రితమే పొలిటికల్ ఎంట్రీ పక్కా అని ప్రకటించి... పార్టీ పేరు,గుర్తు కోసం కసరత్తులు కూడా చేసి ఇలా ఊహించని షాక్ ఇచ్చారేంటని ప్రశ్నిస్తున్నారు. నిన్నటిదాకా ఆయన కటౌట్లకు దండలు వేసి జయహో తలైవా అన్నవారే ఇప్పుడు ఆయన దిష్టిబొమ్మలు తగలబెడుతూ నిరసన తెలియజేస్తున్నారు. గత రెండు రోజులుగా చెన్నైలోని పలుచోట్ల రజనీ అభిమానులు నిరసనలతో హోరెత్తిస్తున్నారు.

ఇంటి వద్ద అభిమానుల నిరసన...

ఇంటి వద్ద అభిమానుల నిరసన...

అభిమానుల నిరసన సెగ రజనీ ఇంటిని కూడా తాకింది. నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ పలువురు అభిమానులు ఆయన ఇంటి ముందు ప్లకార్డులతో నిరసన తెలియజేస్తున్నారు. దీంతో వారిని నియంత్రించడం పోలీసులకు సవాల్‌గా మారింది. రజనీ రాజకీయాల్లోకి వస్తే తమిళ రాజకీయ స్వరూపాన్ని పూర్తిగా మార్చివేయగలరని... ఆయన రాజకీయాల్లోకి రావాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. దయచేసి ఆయన తన నిర్ణయాన్ని పున:సమీక్షించుకోవాలని కోరుతున్నారు.

Recommended Video

    మోడీ పై రజనీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు | Oneindia Telugu
    తట్టుకోలేకపోతున్న అభిమానులు

    తట్టుకోలేకపోతున్న అభిమానులు

    అనారోగ్యంతో ఇటీవల హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరిన రజనీకాంత్... డిశ్చార్జి అనంతరం రాజకీయాల్లోకి రావట్లేదని ప్రకటించిన సంగతి తెలిసిందే. తన ఆరోగ్యం సహకరించట్లేదని.. కాబట్టి రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదని రజనీ తేల్చి చెప్పారు. రజనీ యూటర్న్‌తో అభిమానులు తీవ్రంగా నిరాశ చెందారు. తాము దైవంలా ఆరాధించే వ్యక్తి ఇలా ఊరించి ఉసూరుమనిపించడాన్ని వారు తట్టుకోలేకపోతున్నారు. రజనీ మాత్రం ఇక తన నిర్ణయాన్ని మార్చుకునే యోచనలో లేరని తెలుస్తోంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+