Khiladi: ఇద్దరు పెళ్లాల ముద్దులమొగుడు, 10వ తరగతి అమ్మాయితో, బోనస్ గా ఆంటీ, అంతే !

చెన్నై/ కుప్పం: టిప్పుటాప్ గా జీన్స్ ప్యాంట్ లు, వెరైటీ వెరైటీ షర్టులు వేసుకుని ఫోజులు కొట్టిన ఓ యువకుడు ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్య బతికుండగానే ఆమెకు తెలీకుండా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని కాపురం పెట్టాడు. ఒకరికి తెలీకుండా ఒకరితో కాపురం చేస్తున్న కేటుగాడు 10వ తరగతి చదువుతున్న అమ్మాయిని లైన్ లో పెట్టాడు. స్కూల్ కు వచ్చి వెళుతున్న అమ్మాయికి మాయమాటలు చెప్పి ఆమెను ఎగరేసుకుని కొండల మీదకు వెళ్లి జల్సా చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో ముగ్గురితో మస్త్ మజా చేస్తున్న స్టీఫెన్ కు చీటి చింపేయడంతో అతని బతకులు బస్ స్టాండ్ అయిపోయింది. మనోడు ఈ ముగ్గురితో కాకుండా ఓ ఆంటీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న విషయం వెలుగు చూసింది.

 కర్రిమేళం కహాని

కర్రిమేళం కహాని

తమిళనాడులోని తిరునల్వేలి (నెలై) జిల్లా పనాకుడి ప్రాంతంలో స్టీఫెన్ రాజ్ అలియాస్ స్టీఫెన్ నివాసం ఉంటున్నాడు. ప్రతిరోజు టిప్పుటాప్ గా జీన్స్ ప్యాంట్ లు, వెరైటీ వెరైటీ షర్టులు వేసుకుని ఫోజులు కొడుతున్నాడు. ఫోజులతో రజనీ (పేరు మార్చడం జరిగింది) అనే యువతిని వలలో వేసుకున్న స్టీఫెన్ ఆమెను పెళ్లి చేసుకుని కాపురం పెట్టాడు.

భార్య బతికుండగానే మరో పెళ్లి

భార్య బతికుండగానే మరో పెళ్లి

స్టీఫెన్ భార్యతో కాపురం చేస్తూనే వరికుప్పం ప్రాంతానికి చెందిన రమ్య (పేరు మార్చడం జరిగింది) అనే యువతిని వలలో వేసుకున్నాడు. రజనీకి తెలీకుండా రమ్యతో తిరిగిన స్టీఫెన్ ఆమెను రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్య రజనీకి తెలీకుండా చాలా దూరంగా మరో అద్దె ఇంటిలో స్టీఫెన్ రెండో భార్య రమ్యతో కాపురం పెట్టాడు.

మస్త్ మజా చేసిన పోటుగాడు

మస్త్ మజా చేసిన పోటుగాడు


మొదటి భార్య రజనీకి, రెండో భార్య రమ్యకు తెలీకుండా రెండు చోట్ల కాపురం చేసిన స్టీఫెన్ చాలా కాలం ఇద్దరితో ఎంజాయ్ చేశాడు. వారంలో మూడు రోజులు మొదటి భార్య రజనీతో మరో మూడు రోజులు రెండో భార్య రమ్యతో కాపురం చేస్తున్న స్టీఫెన్ ఇంటికి వెళ్లని సమయంలో పనిమీద బయట ఉన్నానని వారికి మస్కా కొడుతూ వచ్చాడు.

స్కూల్ అమ్మాయిపై కన్ను

స్కూల్ అమ్మాయిపై కన్ను


స్టీఫెన్ సొంత ఊరిలో నివాసం ఉంటున్న 16 ఏళ్ల అమ్మాయి ఓ స్కూల్ లో 10వ తరగతి చదువుతోంది. స్టీఫెన్ స్టైల్ కు ఆ అమ్మాయి ఆకర్షితురాలైయ్యింది. అంతే తనవైపు చూస్తున్న 10వ తరగతి అమ్మాయిని స్టీఫెన్ లైన్ లో పెట్టాడు. స్కూల్ కు వెళ్లి వస్తున్న అమ్మాయితో మాట్లాడుతున్న స్టీఫెన్ ఆమెకు ఐ లవ్ యూ చెప్పి ఆమెను లొంగదీసుకున్నాడు.

పాపతో స్టీఫెన్ ఎస్కేప్

పాపతో స్టీఫెన్ ఎస్కేప్


స్కూల్ కు నామం పెడుతున్న ఆ అమ్మాయి ప్రియుడు స్టీఫెన్ తో రహస్య ప్రాంతాలకు వెళ్లి ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టింది. స్టీఫెన్ తో ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టిన ఆ అమ్మాయి తనను పెళ్లి చేసుకోవాలని అతనికి చెప్పింది. ఇదే మంచి చాన్స్ అంటూ స్టీఫెన్ ఎగిరిగంతేశాడు. ఇటీవల ఉదయం స్కూల్ కు వెళ్లిన అమ్మాయిని స్టీఫెన్ లేపుకుపోయాడు.

 సార్.... మీరే కాపాడండి

సార్.... మీరే కాపాడండి

స్కూల్ కు వెళ్లిన అమ్మాయి ఇంటికి రాకపోవడంతో ఆమె కోసం కుటుంబ సభ్యులు గాలించారు. రెండుమూడు రోజులు అయినా అమ్మాయి కనపడకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల విచారణలో స్టీఫెన్, 10వ తరగతి అమ్మాయి ప్రేమపురాణం బయటపడింది.

 కొండల్లో మకాం

కొండల్లో మకాం


పోలీసుల విచారణలో స్టీఫెన్ కు ఇంతకు ముందే అమ్మాయి కుటుంబ సభ్యులు వార్నింగ్ ఇచ్చారని, తరువాత ఆ అమ్మాయి అతనితో కలిసిపారిపోయిందని తెలిసింది. స్టీఫెన్ ఇద్దరు భార్యల వ్యవహారం బయటపడింది. మైనర్ అమ్మాయి కోసం పోలీసులు వెతికారు. స్టీఫెన్ మొబైల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు నాగర్ కోవిల్ కొండమీద ఉన్నారని తెలుసుకుని అక్కడికి వెళ్లారు.

 పోటుగాడి దూలతీరిపోయింది

పోటుగాడి దూలతీరిపోయింది


స్టీఫెన్ ను అక్కడే అరెస్టు చేసిన పోలీసులు బాలికను రక్షించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇప్పటికే ఇద్దరు యువతులను పెళ్లి చేసుకున్న స్టీఫెన్ మరో ఆంటీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని పోలీసులు చెప్పారు. ఈ మూడు చాలక ఇప్పుడు మైనర్ అమ్మాయిని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్నాడని కేసు నమోదు చేసి అరెస్టు చేసి జైలుకు పంపించడంతో ఇంతకాలం పాటుబడిన పోటుగాడు స్టీఫెన్ దూల తీరిపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+