Cheating: మొగ్గురు మొగుళ్లు, పార్ట్ టైమ్ మాజీ మంత్రి, లెక్కలేనంత మందితో డీల్ ? కిలాడీ లేడి !
చెన్నై/ కరూర్: యవ్వనంలో అందంగా ఉన్న యువతి ఇప్పటికే ఒకరికి తెలీకుండా ఒకరిని వరుసగా ముగ్గురిని పెళ్లి చేసుకుంది. మాజీ మంత్రి ఒకరు ఈ కిలాడీతో సన్నిహితంగా ఉంటూ ఆ విషయంలో ఆమెతో ఎంజాయ్ చేస్తున్నాడని తెలిసింది. కిలాడీ లేడి పెళ్లి చేసుకున్న ముగ్గురిలో ఒక పోలీసు ఉన్నాడు. మాజీ మంత్రితో సన్నిహితంగా ఉంటున్న కిలాడీ లేడీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని బంధువులు, తెలిసిన వాళ్ల దగ్గర లక్షల రూపాయలు వసూలు చేసింది. అప్పట్లో కిలాడీ లేడితో జల్సా చేస్తున్న నాయకుడు మంత్రి పదవిలో ఉండటంతో ఈమె ఆడిందే ఆటగా పాడిందే పాటగా తయారైయ్యింది. ఇప్పుడు వయ్యారాల కిలాడి మరికొందరితో ఎంజాయ్ చేస్తూ జల్సా చేస్తోంది. బాధితులతో పాటు ఆమె ఇద్దరు మొగుళ్లు వరుసగా పోలీసులను ఆశ్రయించడంతో మూడో భర్తతో కులుకుతున్న కిలాడీ లేడీ భాగోతం బయటకు వచ్చింది.

వయ్యారాల సుందరి
తమిళనాడులోని కరూర్ కు చెందిన సౌమ్య చూడటానికి అందంగానే ఉంటోంది. మంచి వయసులో ఉన్న సౌమ్య ఆమె అందచందాలతో వలవేసి కొందరిని వలలో వేసుకుని ఎంజాయ్ చేసింది. వయ్యారంగం ఉంటూ సింగారంగా అలంకరించుకుని అనేక చోట్ల ఫోజులు ఇచ్చి ఫోటోలు తీసుకుంది. మంచి మంచి ప్రాంతాల్లో సెల్ఫీలు తీసుకుని ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ వచ్చింది.

ఒక భర్త వ్యాపారి..... మరో భర్త పోలీసు
సోషల్ మీడియాలో సౌమ్య ఫోటోలు చూసి కరూర్ కు చెందిన వ్యాపారి సురేష్ ఆమె వలలో పడిపోయాడు. సురేష్ ను వివాహం చేసుకున్న సౌమ్య అతనితో కాపురం చేసింది. మొదటి భర్త సురేష్ తో కాపురం చేస్తున్న సమయంలోనే మణిముత్తూర్ ప్రాంతంలో నివాసం ఉంటూ పోలీసు ఉద్యోగం చేస్తున్న సతీష్ అనే వ్యక్తిని వలలో వేసుకున్న సౌమ్య అతనిని ప్రేమ వివాహం చేసుకుంది.

మాజీ మంత్రితో రొమాన్స్
తమిళనాడులో కొన్ని నెలల క్రితం వరకు అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీ నాయకుడు, అప్పట్లో మంత్రిగా పని చేసిన వ్యక్తితో సౌమ్య రాసుకుని పూసుకుని తిరిగిందని సమాచారం. అన్నాడీఎంకే మంత్రి, సౌమ్య సీక్రెట్ గా జల్సా చేస్తున్నారని చాలా మందికి తెలుసని ఆరోపణలు ఉన్నాయి. మంత్రి పదవిలో ఉన్నన వ్యక్తితో ఎంజాయ్ చేస్తున్న సౌమ్యకు అనేక మందితో పరిచయాలు పెరిగిపోయాయి.

ఉద్యోగం ఇప్పిస్తామని రూ. లక్షలు లూటీ
అప్పటి తమిళనాడు మంత్రితో సౌమ్యకు మంచి సంబంధాలు ఉండటంతో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించాలని చాలా మంది సౌమ్యను సంప్రధించారు. సౌమ్యకు సమీప బంధువైన విజయ్ అనే వ్యక్తి కూడా ఆమెకు లక్షల రూపాయలు, 15 పౌండ్ల బంగారు నగలు ఇచ్చి తనకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని మనవి చేశాడు.

మాయం అయిన కిలాడీ లేడి
విజయ్ తో పాటు అతని స్నేహితుల దగ్గర రూ. లక్షల రూపాయలు వసూలు చేసుకున్న సౌమ్య వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించకుండా తప్పించుకుని తిరగడం మొదలు పెట్టింది. సౌమ్య ఒక్కసారిగా ఎవ్వరికి కనపడకుండా మాయం అయిపోయింది. సౌమ్యకు లక్షల రూపాయల డబ్బులు ఇచ్చి మోసపోయామని గుర్తించిన విజయ్ అతని స్నేహితులు ఆమె రెండో భర్త సతీష్ ను కలిశారు. రెండో భర్త సతీష్ బ్యాంకు అకౌంట్ లు ఇచ్చిన సౌమ్య బాధితుల నుంచి అదే బ్యాంకు అకౌంట్ కు డబ్బులు టాన్స్ ఫర్ చేయించుకుంది.

ఇద్దరు మొగుళ్లు సేమ్ డైలాగ్
తనతో చాలా కాలం క్రితమే సౌమ్య విడిపోయి ఆమె వేరుగా జీవిస్తోందని రెండో భర్త సతీష్ బాధితులకు చెప్పాడు. తరువాత విజయ్ అతని స్నేహితులు సౌమ్య మొదటి భర్త సురేష్ దగ్గరకు వెళ్లారు. సురేష్ కూడా తనతో ఆమె విడిపోయిందని చెప్పడంతో విజయ్ తదితరులు షాక్ అయ్యారు. సౌమ్య కోసం గాలించి విసిగిపోయిన విజయ్ తదితరులు కరూర్ పోలీసులను ఆశ్రయించారు. ఇదే సమయంలో సౌమ్య మీద ఆమె భర్తలు సురేష్, సతీష్ వేర్వేరుగా రామనాథపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మూడో మొగుడితో జల్సాలు
మొదటి మొగుడు సురేష్, రెండో భర్త సతీష్ కు హ్యాండ్ ఇచ్చిన సౌమ్య శ్రీనివాసన్ అనే వ్యక్తిని మూడో పెళ్లి చేసుకుని సేలంలో కాపురం పెట్టింది. కరూర్ పోలీసులు తమిళనాడు మొత్తం సౌమ్య కోసం గాలించారు. సౌమ్య ఫోటోలు అన్ని పోలీస్ స్టేషన్లకు పంపించారు. చివరికి సౌమ్య సేలంలో పోలీసులకు పట్టుబడింది.

వామ్మో సౌమ్య...... అందరిని నాకించేసింది
తమిళనాడు మాజీ మంత్రితో చనువుగా ఉంటూ అందరిని పరిచయం చేసుకుని ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని సౌమ్య అనేక మందిని మోసం చేసి లక్షల రూపాయలు వసూలు చేసిందని బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. సౌమ్య డీలింగ్స్ విచారణలో వెలుగు చూస్తున్నాయని పోలీసులు అంటున్నారు. అనేక చోట్ల సౌమ్య ఎంజాయ్ చేసే ముసుగులో వారి ఇళ్లలోకి వెళ్లి బంగారు నగలు, నగదు లూటీ చేసిందని ఆరోపణలు ఉన్నాయని పోలీసు అధికారులు అంటున్నారు. మొత్తం మీద కిలాడీ లేడి సౌమ్య పోలీసులకు చిక్కడంతో ఆమెను విచారణ చేసి వివరాలు బయటకు లాగుతున్నారు. ముగ్గురిని కాకుండా కిలాడీ లేడీ సౌమ్య ఇంకా ఎవరినైనా పెళ్లి చేసుకుందా ? అని పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications