Lady Doctor: డాక్టర్లు లవ్ మ్యారేజ్, ఒకే ఆసుపత్రిలో ఉద్యోగం, భర్త ఊరికి , ఇంట్లో లేడీ డాక్టర్?

చెన్నై/వేలూరు: లేడీ డాక్టర్, మరో డాక్టర్ ఒకే ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తున్నారు. ఇద్దరు డాక్టర్లు కొన్ని సంవత్సరాలు ప్రేమించుకుని హ్యాపీగా తిరిగారు. పెద్దలను ఒప్పించిన ఇద్దరు డాక్టర్లు చాలా సంతోషంగా వివాహం చేసుకుని కాపురం చేస్తున్నారు. పెళ్లి అయిన తరువాత దంపతులు ఎంతో ఫేమస్ అయిన ఒకే ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తున్నారు. భర్త సొంత పనిమీద ఢిల్లీ వెళ్లాడు.

ఇంట్లో లేడీ డాక్టర్ మాత్రమే ఉంది. ఢిల్లీలోని భర్త ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆయన భార్య ఫోన్ రిసీవ్ చెయ్యలేదు. ఢిల్లీలో ఉన్న భర్త ఇంటి యజమానికి ఫోన్ చేసి ఇంటికి వెళ్లి చూడాలని మనవి చేశాడు. ఇంటి ఓనర్ వెళ్లి కిటికీలో నుంచి చూస్తే లేడీ డాక్టర్ ఫ్యాన్ కు వేలాడుతూ శవమై కనిపించడం కలలకం రేపింది.

వేలూరు సీఎంసీ ఆసుపత్రిలో డాక్టర్లు

వేలూరు సీఎంసీ ఆసుపత్రిలో డాక్టర్లు

తమిళనాడులోని తుత్తకూడి జిల్లాకు చెందిన సెల్వకుమార్ (35) వేలూరు చేరుకుని ఎంతో పేరుప్రతిష్టలు ఉన్న సీఎంసీ ఆసుపత్రిలో డాక్టర్ కుగా ఉద్యోగం చేస్తున్నాడు. కేరళకు చెందిన గాయిత్రీ (32) అనే యువతి వేలూరులోని సీఎంసీ ఆసుపత్రిలో డాక్టర్ గా ఉద్యోగం చేస్తున్నది. కొన్ని సంవత్సరాల క్రితం గాయితీ, సెల్వకుమార్ కు పరిచయం అయ్యింది.

పెద్దల అంగీకారంతో పెళ్లి

పెద్దల అంగీకారంతో పెళ్లి

డాక్టర్లు గాయిత్రీ, సెల్వకుమార్ కొన్ని సంవత్సరాలు ప్రేమించుకుని హ్యాపీగా తిరిగారు. పెద్దలను ఒప్పించిన లేడీ డాక్టర్ గాయిత్రీ, ఆమె ప్రియుడు సెల్వకుమార్ ను నాలుగు సంవత్సరాల క్రితం చాలా సంతోషంగా వివాహం చేసుకుని భర్తతో కాపురం చేస్తోంది. పెళ్లి అయిన తరువాత సెల్వకుమార్, గాయిత్రీ దంపతులు వేలూరులో అద్దె ఇంటిలో కాపురం పెట్టారు.

ఢిల్లీ వెళ్లిన భర్త

ఢిల్లీ వెళ్లిన భర్త

వివాహం జరిగిన తరువాత కూడా గాయిత్రీ, సెల్వకుమార్ దంపతులు ఎంతో ఫేమస్ అయిన వేలూరు సీఎంసీ ఆసుపత్రిలోనే ఉద్యోగం చేస్తున్నారు. సెల్వకుమార్ కు ఢిల్లీలో పనిపడింది. వ్యక్తిగత పనిమీద డాక్టర్ సెల్వకుమార్ చెన్నై నుంచి విమానంలో ఢిల్లీ వెళ్లాడు. వేలూరులోని ఇంట్లో లేడీ డాక్టర్ గాయిత్రీ మాత్రమే ఉంది.

 లేడీ డాక్టర్ ఫోన్ రిసీవ్ చెయ్యలేదు

లేడీ డాక్టర్ ఫోన్ రిసీవ్ చెయ్యలేదు

ఢిల్లీలోని సెల్వకుమార్ హోటల్ కు వెళ్లి తరువాత ఆయన భార్య గాయిత్రీకి ఫోన్ చేశాడు. ఫోన్ రిసీవ్ చెయ్యకపోవడంతో నిద్రపోతుంటుందని మద్యాహ్నం ఫోన్ చేశాడు. అయినా గాయిత్రీ ఫోన్ రిసీవ్ చెయ్యలేదు. సాయంత్రం 6 గంటల సమయంలో సెల్వ కుమార్ ఆయన భార్య డాక్టర్ గాయిత్రీకి మళ్లీ ఫోన్ చేశాడు.

ఇంట్లో శవమై కనిపించిన లేడీ డాక్టర్

ఇంట్లో శవమై కనిపించిన లేడీ డాక్టర్

ఎన్నిసార్లు ఫోన్ చేసినా భార్య గాయిత్రీ ఫోన్ రిసీవ్ చెయ్యకపోవడంతో డాక్టర్ సెల్వకుమార్ ఆందోళన చెందాడు.ఢిల్లీలో ఉన్న సెల్వకుమార్ వేలూరులో నివాసం ఉంటున్న ఇంటి యజమానికి ఫోన్ చేసి ఇంటికి వెళ్లి చూడాలని మనవి చేశాడు. ఇంటి ఓనర్ వెళ్లి కిటికీలో నుంచి చూస్తే లేడీ డాక్టర్ గాయిత్రీ ఫ్యాన్ కు వేలాడుతూ శవమై కనిపించడం కలలకం రేపింది. డాక్టర్ సెల్వకుమార్ ఢిల్లీ నుంచి బయలుదేరి చెన్నై చేరుకుని అక్కడి నుంచి వేలూరుకు వచ్చాడు.

రాత్రి ఒకరికి, పగలు ఒకరికి డ్యూటీ

రాత్రి ఒకరికి, పగలు ఒకరికి డ్యూటీ

పోలీసుల విచారణలో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఒకే ఆషుపత్రిలో ఉద్యోగం చేస్తున్న సెల్వకుమార్, గాయిత్రీ దంపతులకు పనివేళలు వేరు అ వెలుగు చూసింది. ఇద్దరికి వేర్వేరు షిఫ్టులు ఉంటున్నారు. సెల్వకుమార్ ఇంట్లెో ఉంటే అతని భార్య డాక్టర్ గాయిత్రీ ఆసుపత్రిలో డ్యూటీలో ఉంటుందని, గాయిత్రీ ఇంట్లో ఉంటే సెల్వకుమార్ ఆసుపత్రిలో డ్యూటీ చేస్తుంటాడని పోలీసుల విచారలో వెలుగు చూసింది.

పిల్లలు పుట్టలేదని ఆవేదన

పిల్లలు పుట్టలేదని ఆవేదన

కనీసం ఏకాంతంగా మాట్లాడుకోవడానికి మనకు సమయం చిక్కడంలలేదని డాక్టర్ గాయిత్రీ ఆమె భర్త సెల్వకుమార్ తో కొంతకాలం అంటోందని పోలీసులు చెప్పారు. ఇద్దరు కలసిసంతోషంగా కాపురం చెయ్యడానికి అవకాశం లేకుండా పోయిందని, అందుకే ఇంతకాలం పిల్లలు పుట్టలేదని డాక్టర్ గాయిత్రీ ఆవేదన వ్యక్తం చేస్తోందని గాయిత్రీ భర్త సెల్వకుమార్ వేలూరు పోలీసులకు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+