Lady police: లేడీ పోలీసు మీద లైంగిక దాడి చేసిన హెడ్ కానిస్టేబుల్, భర్తకు దూరంగా ఉందని తెలిసి!

చెన్నై/ఈరోడ్: పోలీసు కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తున్న మహిళకు వివాహం అయ్యింది. వివాహం చేసుకున్న లేడీ పోలీసు కొంతకాలం భర్తతో కాపురం చేసింది. భర్తతో విభేదాలు రావడంతో ఆమె పోలీసు క్వాటర్స్ లో ఒంటరిగా నివాసం ఉంటున్నది. డిప్యూటీ సూపరెండెంట్ ఆఫ్ పోలీసు జీపు డ్రైవర్ గా పని చేస్తున్న హెడ్ కానిస్టేబుల్ అదే పోలీసు క్వాటర్స్ లో నివాసం ఉంటున్నాడు. పోలీసు శాఖలోనే ఉద్యోగం చేస్తున్న హెడ్ కానిస్టేబుల్, లేడీ కానిస్టేబుల్ కు పరిచయం అయ్యింది. ఒకేచోట పోలీసు క్వాటర్స్ లో నివాసం ఉంటున్న హెడ్ కానిస్టేబుల్, లేడీ పోలీసు ప్రతిరోజూ మాట్లాడుకుంటున్నారు.

ఈ సమయంలో డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్లిన లేడీ పోలీసు మీద హెడ్ కానిస్టేబుల్ లైంగిక దాడి చెయ్యడం కలకలం రేపింది. బాధితురాలు కేసు పెట్టడంతో నిందితుడు కూడా పోలీసు శాఖకు చెందిన వాడే కావడంతో పోలీసు అధికారులు తలలు పట్టుకున్నారు.

హెడ్ కానిస్టేబుల్

హెడ్ కానిస్టేబుల్

తమిళనాడులోని ఈరోడ్ లో నివాసం ఉంటున్న ఈదు సెల్వన్ (32) పోలీసు శాఖలో హెడ్ కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తున్నాడు. ఈరోడ్ డిప్యూటీ సూపరెండెంట్ ఆఫ్ పోలీసు జీపు డ్రైవర్ గా పని చేస్తున్న హెడ్ కానిస్టేబుల్ సెల్వన్ ఈ రోడ్ లోని పోలీసు క్వాటర్స్ లో చాలా కాలం నుంచి నివాసం ఉంటున్నాడు.

భర్తకు దూరంగా ఉంటున్న లేడీ పోలీసు

భర్తకు దూరంగా ఉంటున్న లేడీ పోలీసు

ఈ రోడ్ పోలీస్ స్టేషన్ లో ఓ మహిళ కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తున్నది. పోలీసు కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తున్న మహిళకు వివాహం అయ్యింది. వివాహం చేసుకున్న లేడీ పోలీసు కొంతకాలం భర్తతో కాపురం చేసింది. భర్తతో విభేదాలు రావడంతో ఆమె ఈ రోడ్ లోని పోలీసు క్వాటర్స్ లో ఒంటరిగా నివాసం ఉంటున్నది.

రోజూ మాట్లాడుతున్న సెల్వన్

రోజూ మాట్లాడుతున్న సెల్వన్

పోలీసు శాఖలోనే ఉద్యోగం చేస్తున్న హెడ్ కానిస్టేబుల్ సెల్వన్, లేడీ కానిస్టేబుల్ కు పరిచయం అయ్యింది. ఒకేచోట ఉన్న పోలీసు క్వాటర్స్ లో నివాసం ఉంటున్న హెడ్ కానిస్టేబుల్ సెల్వన్, ఆ లేడీ పోలీసు ప్రతిరోజూ మాట్లాడుకుంటున్నారు. లేడీ కానిస్టేబుల్ కు ఏదైనా అవసరం అయితే హెడ్ కానిస్టేబుల్ సెల్వన్ తెచ్చి ఇస్తున్నాడు.

ఒంటరిగా ఉన్న లేడీ పోలీసు మీద లైంగికదాడి?

ఒంటరిగా ఉన్న లేడీ పోలీసు మీద లైంగికదాడి?

రాత్రి లేడీ కానిస్టేబుల్ పోలీసు క్వారట్స్ లో ఒంటరిగా ఉంది. ఆ సమయంలో లేడీ పోలీసు ఇంటి దగ్గరకు వెళ్లిన హెడ్ కానిస్టేబుల్ సెల్వన్ ఆమె మీద లైంగిక దాడి చెయ్యడానికి ప్రయత్నించాడని తెలిసింది. ఆ సమయంలో సెల్వన్, లేడీ పోలీసు మధ్య ఆమె ఇంటిలోనే కొంత సేపు తోపులాట జరిగిందని తెలిసింది.

హెడ్ కానిస్టేబుల్ అరెస్టు

హెడ్ కానిస్టేబుల్ అరెస్టు

హెడ్ కానిస్టేబుల్ సెల్వన్ బారినుంచి తప్పించుకున్న లేడీ పోలీసు ఇంటి నుంచి బయటకు పరుగు తీసి పోలీసు క్వాటర్స్ లోనే నివాసం ఉంటున్న ఇరుగు పొరుగు వారికి విషయం చెప్పింది. విషయం తెలుసుకున్న ఈరోడ్ పోలీసులు హెడ్ కానిస్టేబుల్ సెల్వన్ ను అదుపులోకి తీసుకున్నారు.

బాధితురాలు కేసు పెట్టడంతో నిందితుడు కూడా పోలీసు శాఖకు చెందిన వాడే కావడంతో పోలీసు అధికారులు తలలు పట్టుకున్నారు. లేడీ పోలీసు ఫిర్యాదు మేరకు విచారణ కోసం ప్రత్యేకంగా ఓ పోలీసు అధికారిని నియమించామని, పోలీసు క్వాటర్స్ లో నివాసం ఉంటున్న వారి నుంచి వివరాలు సేకరిస్తున్నామని ఓ సీనియర్ పోలీసు అధికారి మీడియాకు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+