Marriage: ఐదు మంది భర్తలు, ఆరో పెళ్లి చేసుకుంటున్న భార్యను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త, క్లైమాక్స్!
సేలం/విరూద్ నగర్/ చెన్నై: యువకుడికి వివాహం చెయ్యాలని అతని కుటుంబ సభ్యులు డిసైడ్ అయ్యారు. ఓ మహిళ చూపించిన అమ్మాయితో ఆ యువకుడి పెళ్లి జరిగింది. వివాహం జరిపించిన మహిళకు లక్ష రూపాయలకు పైగా కమీషన్ ఇచ్చారు. వారం రోజులు భర్తతో కాపురం చేసిన యువతి అతని దగ్గర డబ్బులు లేవని, సమీపంలో నివాసం ఉంటున్న వ్యక్తితో తన వివాహం జరిపించాలని మహిళా బ్రోకర్ కు వాయిస్ మెసేజ్ పంపించింది. ఈ విషయం భర్తకు తెలిసిపోయింది.
మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి గుడిలోకి వెళ్లిన భార్యను, ఆమె బంధువులను భర్త రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని పోలీసులకు పట్టించాడు. పోలీసుల విచారణలో కిలాడీ లేడీ ఎంత మందిని పెళ్లి చేసుకుని వాళ్లను ఏమి చేసింది అని తెలుసుకున్న నాలుగో భర్త, అతని బంధువులు బిత్తరపోయారు.

పెళ్లి కూతురు రెఢీ
తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలోని గోపిచెట్టిపాళ్యం సమీపంలోని డీజీ బుదూరులో శరవణన్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. శరవణన్ కు వివాహం చెయ్యాలని అతని కుటుంబ సభ్యులు డిసైడ్ అయ్యారు. విరూద్ నగర్ కు చెందిన విజయలక్ష్మి అనే వివాహాలు జరిపించే బ్రోకర్ చూపించిన విరూద్ నగర్ లో నివాసం ఉంటున్న సరితో శరవణన్ పెళ్లి జరిపించాలని నిర్ణయించారు.

వారం రోజులు కాపురం
విజయలక్ష్మి చూపించిన సరిత అనే యువతి శరవణన్ కు అతని ఇంటిలో ఆగస్టు 29వ తేదీన పెళ్లి జరిగింది. సరిత వెంట 10 మంది మాత్రమే బంధువులు పెళ్లికి హాజరైనారు. వివాహం జరిపించిన విజయలక్ష్మికి శరవణన్ రూ. లక్ష 20 వేల రూపాయలకు పైగా కమీషన్ ఇచ్చారు. వారం రోజులు భర్త శరవణన్ తో కాపురం చేసిన సరిత పవర్ ఫుల్ స్కెచ్ వేసింది.

పక్కింటోడి దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంది
శరవణన్ దగ్గర డబ్బులు లేవని సరితకు తెలిసిపోయింది. తాను తన భర్తను వదిలేస్తానని, శరవణన్ ఇంటి సమీపంలో నివాసం ఉంటున్న వయసులో పెద్దవాడైన వ్యక్తితో తన వివాహం జరిపించాలని సరిత ఆమె భర్త శరవణన్ మొబైల్ ఫోన్ నుంచి వాట్సాప్ వాయిస్ మెసేజ్ వివాహాలు జరిపించే బ్రోకర్ విజయలక్ష్మికి పంపించింది.

మెసేజ్ డిలీట్ చెయ్యకుండా వదిలేసింది
శరవణన్ మొబైల్ ఫోన్ నుంచి వాయిస్ మెసేజ్ చేసిన సరిత ఆ మెసేజ్ డెలీట్ చెయ్యకుండా వదిలేసింది. మరుసటి రోజు మొబైల్ ఫోన్ లో వాయిస్ మెసేజ్ చూసిన శరవణన్ బిత్తరపోయాడు. ఇదే సమయంలో బ్రోకర్ విజయలక్ష్మి శరవణన్ ఇంటి పక్కన నివాసం ఉంటున్న వ్యక్తితో పెళ్లి సంబంధం మాట్లాడింది.

భర్త స్కెచ్ తో చిక్కిపోయిన భార్య
శరవణన్ అతని బంధువులతో కలిసి భార్య సరిత, బ్రోకర్ విజయలక్ష్మి అంతు చూడాలని డిసైడ్ అయ్యాడు, బంధువుతో విజయలక్ష్మికి ఫోన్ చేపించి తనకు మంచి అమ్మాయితో పెళ్లి జరిపించాలని చెప్పించాడు. విజయలక్ష్మి అతనికి సరిత ఫోటో పంపించింది. సరితతో పెళ్లి జరిపిస్తే తనకు రూ. 1.50 లక్ష కమీషన్ ఇవ్వాలని విజయలక్ష్మి శరవణన్ బంధువుతో డీల్ మాట్లాడింది.

పెళ్లి పీటల మీద రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త
సరిత మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి సిద్దం అయ్యింది. ఇంటి నుంచి వెళ్లిపోయిన సరిత బంగ్లపుత్తూరులో మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి గుడిలోకి వెళ్లింది. పెళ్లి బట్టలతో వేరే వ్యక్తిని పెళ్లి చేసుకున్న భార్య సరితను, ఆమె బంధువులను శరవణన్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని బంగ్ల పుత్తూరు పోలీసులకు పట్టించాడు.

ఐదు మంది భర్తలు
పోలీసుల విచారణలో కిలాడీ లేడీ సరిత ఇప్పటి వరకు శరవణన్ ను కాకుండా మరో నలుగురిని వివాహం చేసుకుని వాళ్ల దగ్గర డబ్బులు లాక్కొని మోసం చేసిందని వెలుగు చూసింది. ఇప్పటికే నలుగురిని పెళ్లి చేసుకున్న సరిత వాళ్లను ముంచేసిందని తెలుసుకున్న ఐదో భర్త శరవణన్ , అతని బంధువులు బిత్తరపోయారు. సరిత, విజయలక్ష్మి, విజయ అనే మహిళను అరెస్టు చేసిన పోలీసులు వీళ్లు ఇంకా ఎంతమందిని పెళ్లి పేరుతో మోసం చేశారు అని విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.
-
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications