Sadist: భార్య విడాకులు, ప్రతీకారంతో కూతురి మీద ఫ్రెండ్స్ తో గ్యాంగ్ రేప్, 60 ఏళ్లు జైల్లో లోఫర్!

చెన్నై/ఈరోడ్: దంపతుల మద్య నిత్యం గొడవలు జరగడంతో ఊరి పెద్దలు రాజీ చేసిచేసి విసిగిపోయి వాళ్లను వదిలేశారు. భర్తకు రామ్ రామ్ చేప్పిన భార్య విడాకులు తీసుకుని వేరుగా ఉంటోంది. భార్య మీద డౌట్ తో పాటు ఆమె మీద కోపంతో భర్త ప్రపంచంలో ఎవ్వరూ చెయ్యని పనికిమాలిన పని చేశాడు. నా భార్య ఎవరితోనే తిరిగి కూతుర్ని కనిందని కసి పెంచుకున్నాడు. ఫ్రెండ్స్ తో కలిసి కన్న తండ్రి అతని కూతురి మీద గ్యాంగ్ రేప్ చేశాడు. పక్కాసాక్షాలు చిక్కడంతో కన్న తండ్రితో పాటు అతని కుమార్తె మీద అత్యాచారం చేసిన కిరాతకుడికి 60 ఏళ్లు జైలు శిక్ష పడింది.

భర్త అనుమానం పిచాచి

భర్త అనుమానం పిచాచి

తమిళనాడులోని ఈరోడ్ సమీపంలోని గోబిశెట్టిపాళ్యంలో అరుణాచలం (35) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అరుణాచలంకు రవళి (పేరు మార్చడం జరిగింది) అనే మహిళతో వివాహం అయ్యింది. అరుణాచలం, రేవళి దంపతులకు 12 ఏళ్ల కుమారుడు, 10 ఏళ్ల కుమార్తె ఉన్నారు. భార్య రేవళి మీద మొదటి నుంచి ఆమె భర్త అరుణాచలం అనుమానం పెంచుకున్నాడు.

జెండా ఎత్తేసిన భార్య

జెండా ఎత్తేసిన భార్య

భర్త అరుణాచలం టార్చర్ తట్టుకోలేని అతని భార్య కొన్ని సంవత్సరాల క్రితం విసిగిపోయి అతనితో విడాకులు తీసుకుని దూరంగా నివాసం ఉంటోంది. రేవళికి పుట్టిన పిల్లలు తనకు పుట్టలేదని, ఆమె ఎవరితోనే తిరగడం వలనే కుమార్తె పుట్టిందని అరుణాచలం అనుమానం పెంచుకున్నాడు.

ఫ్రెండ్స్ తో కలిసి కూతురిపై గ్యాంగ్ రేప్

ఫ్రెండ్స్ తో కలిసి కూతురిపై గ్యాంగ్ రేప్

భార్య రవళి మీద పగతో 10 ఏళ్ల కుమార్తె మీద కసి తీర్చుకోవాలని అరుణాచలం స్కెచ్ వేశాడు. 2019లో తండ్రి అరుణాచలం, అతని స్నేహితుడు మణికందన్ (33) తదితరులతో కలిసి 10 ఏళ్ల కుమార్తె మీద అత్యాచారం చేశాడు. ఆ సమయంలో గోబిశెట్టిపాళ్యంలోని స్థానికులు విషయం గుర్తించి బాలిక మీద గ్యాంగ్ రేప్ చేసిన ఆమె తండ్రి అరుణాచలం, మణిందన్ ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

పక్కా సాక్షాలు

పక్కా సాక్షాలు

రెండు సంవత్సరాల నుంచి ఈరోడ్ మహిళా కోర్టులో కేసు విచారణ జరుగుతోంది. కూతరి పట్ల కన్న తండ్రి అరుణాచలం దారుణంగా ప్రవర్తించాడని, అతను అత్యాచారం చెయ్యడమే కాకుండా స్నేహితులతో కలిసి కన్న కూతురి జీవినం నాశనం చేశాడని కోర్టులో నేరం రుజువు అయ్యింది.

లోఫర్ తండ్రికి 60 ఏళ్లు జైలు శిక్ష

లోఫర్ తండ్రికి 60 ఏళ్లు జైలు శిక్ష

కన్నతండ్రి అయిన అరుణాచలంతో పాటు అతని స్నేహితుడు మణికందన్ కు 60 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి జస్టిస్ మాలతి సంచలన తీర్పు చెప్పారు. కన్న కూతురి జీవితం నాశనం చేసిన అరుణాచలంకు సరైన శిక్ష పడిందని బాలిక బంధువులు అంటున్నారు. కన్న కూతురి మీద అత్యాచారం చేసిన అరుణాచలంను ఉరి తియ్యాలని కొందరు కోర్టుకు మనవి చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+