Shock: కాలనీలో శాడిస్టు ఏం చేస్తున్నాడంటే ?, గోడమీద నుంచి బాత్ రూమ్ లో ఫోటోలు, వీడియోలు తీసి, ఫోన్ లో!

చెన్నై/ తిరునల్వేలి: ప్రభుత్వ ఉద్యోగులు, శ్రీమంతులు, పెద్దపెద్ద వ్యాపారాలు చేస్తున్న వారు ఓ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. అన్ని కుటుంబాల్లోని మగాళ్లు ఉదయం ఎవరి పనులకు వాళ్లు వెళ్లిపోతున్నారు. పగటి పూటా చాలా మంది మహిళలు వారి ఇంటి పనులు చేసుకుంటూ బిజీగా గడుపుతున్నారు. ఈ ఏరియాలో కొంతకాలం గుర్తు తెలియని వ్యక్తులు సంచరిస్తున్నారని మహిళలు గమనించారు. ఇదే సమయంలో దొంగలు సంచరిస్తున్నారని ప్రచారం జరిగింది. సాయంత్రం ఓ మహిళ ఇంటి బయట ఉన్న బాత్ రూమ్ లో బట్టలు మార్చుకుంటున్న సమయంలో ఓ నిందితుడు గోడ మీద నుంచి ఫోటోలు, వీడియోలు తీశాడు.

విషయం గమనించిన మహిళ గట్టిగా కేకలు వేసింది. గోడదూకిన నిందితుడు సమీపంలోని పార్క్ లోకి పారిపోయి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో స్థానికులు అతన్ని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. పోలీసులు నిందితుడి మొబైల్ ఫోన్ పరిశీలించగా అందులోని ఫోటోలు, వీడియోలు చూసి షాక్ అయ్యారు.

శ్రీమంతులు, ప్రభుత్వ ఉద్యోగులు

శ్రీమంతులు, ప్రభుత్వ ఉద్యోగులు

తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలోని పెరుమాల్ పురం ఏరియాలో శ్రీమంతులు, పెద్దపెద్ద వ్యాపారాలు చేస్తున్న వారు, ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వాళ్లు వారి కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నారు. ఇక్కడ నివాసం ఉంటున్న మగాళ్లు ఉదయం ఎవరి పనులకు వాళ్లు వెళ్లిపోతున్నారు. పగటి పూటా చాలా మంది మహిళలు వారి ఇంటి పనులు చేసుకుంటూ బిజీగా గడుపుతున్నారు.

కేటుగాడు ఏం చేస్తున్నాడంటే?

కేటుగాడు ఏం చేస్తున్నాడంటే?

తిరునల్వేలి జిల్లాలోని పాలయంకోటైలోని రాజేంద్ర నగర్ ఏరియాలో రాబిన్ సన్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. రాబిన్ సన్ కొంతకాలంగా పెరుమాల్ పురం ఏరియాలో తిరుగుతున్నాడు. ఎవ్వరికి అనుమానం రాకుండా తిరుగుతున్న రాబిన్ సన్ మహిళలు స్నానం చేస్తున్న సమయంలో, వాళ్లు బట్టలు మార్చుకుంటున్న సమయంలో ఫోటోలు, వీడియోలు తీసి ఎవ్వరికి అనుమానం రాకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు.

గోడ మీదకు ఎక్కి ఏం చేశాడంటే?

గోడ మీదకు ఎక్కి ఏం చేశాడంటే?

పెరుమాల్ పురం ఏరియాలో కొంతకాలం గుర్తు తెలియని వ్యక్తులు సంచరిస్తున్నారని స్థానిక మహిళలు గమనించారు. ఇదే సమయంలో దొంగలు సంచరిస్తున్నారని ప్రచారం జరిగింది. సాయంత్రం ఓ మహిళ ఇంటి బయట ఉన్న బాత్ రూమ్ లో బట్టలు మార్చుకుంటున్న సమయంలో రాబిన్ సన్ గోడ మీదకె ఎక్కి అక్కడి నుంచి ఆమె ఫోటోలు, వీడియోలు తీశాడు.

వెంటాడి పట్టుకుని బెండ్ ఎత్తేశారు

వెంటాడి పట్టుకుని బెండ్ ఎత్తేశారు

పై నుంచి రాబిన్ సన్ ఫోటోలు తీస్తున్న విషయం గమనించిన మహిళ గట్టిగా కేకలు వేసింది. గోడదూకిన రాబిన్ సన్ సమీపంలోని పార్క్ లోకి పారిపోయి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో స్థానికంగా నివాసం ఉంటున్న యువకులు రాబిన్ సన్ ను వెంటాడి పట్టుకుని అతన్ని చితకబాదేశారు. తరువాత పెరుమాల్ పురం పోలీసులకు అప్పగించారు.

మొబైల్ లో వీడియోలు, ఫోటోలు చూసి షాక్

మొబైల్ లో వీడియోలు, ఫోటోలు చూసి షాక్

పోలీసులు రాబిన్ సన్ మొబైల్ ఫోన్ పరిశీలించగా అందులోని ఫోటోలు, వీడియోలు చూసి షాక్ అయ్యారు. అనేక మంది మహిళలు స్నానాలు చేస్తున్న సమయంలో, బట్టలు మార్చుకుంటున్న సమయంలో రాబిన్ సన్ ఫోటోలు, వీడియోలు తీశాడని తెలుసుకున్న పోలీసులు హడలిపోయారు.

ఎవరికి షేర్ చేశాడు?

ఎవరికి షేర్ చేశాడు?

రాబిన్ సన్ మొబైల్ ఫోన్ సీజ్ చేసి అతన్ని విచారణ చేస్తున్నామని పోలీసులు అన్నారు. రాబిన్ సన్ దెబ్బతో స్థానికంగా నివాసం ఉంటున్న మహిళలు హడలిపోయారు. రాబిన్ సన్ తీసిన ఫోటోలు, వీడియోలు ఎవరెవరికి షేర్ చేశాడు ?, సోషల్ మీడియాలో ఏమైనా పోస్టు చేశాడా ? అంటూ పెరుమాల్ పురం పోలీసులు ఆరా తీస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+