Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Super Star: ఆ రోజు కండెక్టర్ యూనీఫాంలో రజనీకాంత్ ఎలా ఉన్నారో చూడండి, దసరా ఎఫెక్ట్, వైరల్!

బెంగళూరు/ చెన్నై: పాత జ్ఞాపకాలు, చిన్ననాటి స్నేహితులు, అలనాటి చేదు నిజాలు, తీపి జ్ఞాపకాలు ప్రతిఒక్కరికీ జీవితాంతం గుర్తుండిపోతాయి. సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాల్లో రాకముందు బెంగళూరులో బస్సు కండెక్టర్ గా పని చేశారని తెలిసిందే. సినిమా స్క్రీన్ మీద రజనీకాంత్ పేరు పడకముందే ఆయన ఎలా ఉండేవారో అనే విషయం చాలాచాలా తక్కువ మందికి తెలుసు. ఈ రోజు సూపర్ స్టార్ రజనీకాంత్ ఎలాంటి డ్రస్సులు వేసుకుని ఎలాంటి కార్లలో తిరుగుతున్నారో అందరికీ తెలిసిందే. ఆ రోజు బస్సు కండెక్టర్ గా ఆర్ టీసీ యూనీఫాం వేసుకున్న రజనీకాంత్ బస్సు ముందు నిలబడి సాటి ఉద్యోగులతో కలిసి తీసుకున్న ఫోటో నేడు సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తోంది.

పొట్టకూటి కోసం రజనీకాంత్ ఏం చేశారంటే ?

పొట్టకూటి కోసం రజనీకాంత్ ఏం చేశారంటే ?

బెంగళూరులో మరాఠీ కుటుంబంలో జన్మించిన శివాజీ రావ్ గైక్వాడ్ నేడు సూపర్ స్టార్ రజనీకాంత్ అయ్యారు. రజనీకాంత్ కు భారతదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది అభిమానులు ఉన్నారు. ఆనాటి శివాజీ రావ్ గైక్వాడ్ తరువాత సూపర్ స్టార్ రజనీకాంత్ అయ్యారు.
కుటుంబ పోషణ కోసం రజనీకాంత్ బెంగళూరులో కార్పెంటర్ పని, కూలి పని కూడా చేశారు.

సిటీ బస్సు కండెక్టర్

సిటీ బస్సు కండెక్టర్

బెంగళూరులో సంచరించే BTSలో ( ప్రస్తుతం BMTC బస్సులు) రజనీకాంత్ బస్సు కండెక్టర్ గా ఉద్యోగంలో చేరారు. పగలు ఉద్యోగం చేసే రజనీకాంత్ రాత్రిపూట నాటకాలు వేసేవాడు. బీటీఎస్ బస్సు కండెక్టర్ గా ఉద్యోగం చేసే సమయంలో రజనీకాంత్ తో పాటు సాటి ఉద్యోగులు దసరా పండుగ జరుపుకున్నారు.

 బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు వైరల్

బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు వైరల్


దసరా పండుగ సందర్బంగా బీటీఎస్ బస్సును పూలు, మామిడితోరణాలు, అరటి మాండ్లతో సుందరంగా అలంకరించారు. సాటి ఉద్యోగులతో కలిసి రజనీకాంత్ బస్సు కండెక్టర్ యూనీఫాంలో ఫోటోలు తీసుకున్నారు. ఆ రోజు బస్సు కండెక్టర్ యూనీఫాంలో తీసుకున్న రజనీకాంత్ ఫోటో 2020 దసరా పండుగ సమీపిస్తున్న సమయంలో బయటకు వచ్చింది. రజనీకాంత్ కండెక్టర్ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైర్ అవుతూ రచ్చరచ్చ చేస్తోంది.

శివాజీ కాస్త రజనీకాంత్ అయ్యారు

శివాజీ కాస్త రజనీకాంత్ అయ్యారు

సినిమాల మీద పిచ్చితో కండెక్టర్ ఉద్యోగానికి గుడ్ బై చెప్పిన రజనీకాంత్ మద్రాసు (చెన్నై) వెళ్లి సినిమా అవకాశాల కోసం ప్రయత్నించారు. 1975లో కే. బాలచందర్ తమిళంలో నిర్మించిన అపూర్వ రాగంగళ్ సినిమాతో ఆ శివాజీ రావ్ గైక్వాడ్ కాస్తా రాజనీకాంత్ గా మారిపోయారు. తరువాత తమిళ, తెలుగు, కన్నడ, హిందీ సినిమాల్లో నటించిన రజనీకాంత్ వెనుతిరిగి చూసుకోలేదు. సూపర్ స్టార్ రజనీకాంత్ కు నేడు భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది అభిమానులు ఉన్నారు.

 దసరా గిఫ్ట్ ఇచ్చిన పాత ఫ్రెండ్స్

దసరా గిఫ్ట్ ఇచ్చిన పాత ఫ్రెండ్స్

రజనీకాంత్ అలియాస్ శివాజీ రావ్ గైక్వాడ్ బస్సు కండెక్టర్ గా పని చేసే సమయంలో సాటి ఉద్యోగులతో కలిసి దసరా సందర్బంగా ఆయన విధులు నిర్వహిస్తున్న బస్సు ముందు తీసుకున్న ఫోటో బయటకు వచ్చి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ రోజుల్లో రజనీకాంత్ ఎలా దసరా పండుగ చేసుకున్నాడో ఇప్పుడు అదే దసరా పండుగ సమీపిస్తున్న సమయంలో ఫోటోలు బయటకు వచ్చి విపరీతంగా వైరల్ అవుతున్నాయి. రజనీకాంత్ పాత స్నేహితులు ఈ ఫోటో బయట పెట్టారని తెలిసింది. మొత్తం మీద పాత రోజులను రజనీకాంత్ కు గుర్తు చేసినట్లు ఉందని బెంగళూరులోని బీఎంటీసీ బస్సు కండెక్టర్లు, డ్రైవర్లు అంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+