ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి దుర్మరణం: ఏపీ సిమెంట్ లారీ విధ్వంసం: డ్రైవర్ ఎస్కేప్
చెన్నై: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అదుపు తప్పిన లారీ జాతీయ రహదారిపై విధ్వంసాన్ని సృష్టించింది. ఏకంగా పది వాహనాలను ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్.. సంఘటనా స్థలం నుంచి తప్పించుకుని పారిపోయాడు. అతని కోసం పోలీసులు పెద్ద ఎత్తున గాలిస్తున్నారు. తమిళనాడులోని ధర్మపురం జిల్లా తొప్పూర్ జాతీయ రహదారిపై ఈ ఘటన సంభవించింది.
ధర్మపురి-సేలం జిల్లాల సరిహద్దుల్లోని ఘాట్ రోడ్డు మీదుగా వెళ్తోన్న ఓ లారీ అదుపు తప్పింది. ఆంధ్రప్రదేశ్ నుంచి సిమెంట్ లోడ్‌తో బయలుదేరిన ఈ లారీ తొప్పూర్ జాతీయ రహదారి మీదుగా వెళ్తోన్న సమయంలో పాళయం ఘాట్ వద్ద ప్రమాదానికి గురైంది. ఓ కంటైనర్‌ను తొలుత ఢీ కొట్టింది. దీనితో ఈ రెండు వాహనాలు రోడ్డుకు అడ్డంగా నిలిచిపోయాయి. దీన్ని గమనించని ఇతర వాహనాలు వేగంగా వచ్చి లారీ, కంటైనర్లను ఢీ కొట్టాయి. ఇలా ఏకంగా 10కి పైగా వాహనాలు ఒకదాని వెంట ఒకటి ఢీ కొట్టాయి. వాటిల్లో ప్రయాణిస్తోన్న నలుగురు మరణించారు.

ఈ ఘటనతో సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరం పాటు వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. అనేక వాహనాలు ధ్వంసం అయ్యాయి. వాటిని తొలగించడానికి క్రేన్లను తెప్పించాల్సి వచ్చింది. ఈ ప్రమాదానికి కారణమైన సిమెంట్ లారీ డ్రైవర్ తప్పించుకుని పారిపోయాడు. పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే ధర్మపురి జిల్లా కలెక్టర్ కార్తీక, ఎస్పీ ప్రవేశ్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ వారిని ధర్మపురిలోని మోహన్ కుమారమంగళం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
60 ఏళ్ల క్రితమే రాసిపెట్టిన 'మరణ శాసనం'! ప్రపంచానికి ఆఖరి రోజు? -
Amaravati: అమరావతి పేరు మార్పు..! సర్కార్ ఉత్తర్వులు జారీ..! -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
ప్రధాని మోదీకి అనూహ్య మద్దతు- లిఖితపూర్వకం -
బిగ్ షాక్: దేశవ్యాప్తంగా ప్రతిరోజూ సాయంత్రం 2 గంటలు కరెంట్ కట్..! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
H-1B Visa జారీ ఇకపై మరింత.. !!












Click it and Unblock the Notifications