Second wife: భార్య చెల్లితో రెండో పెళ్లి, భర్తను వదిలేసి వెళ్లిపోయింది, కూతుర్ని చంపేసి?

చెన్నై/శివకాశి: కుటుంబ సభ్యులు సెట్ చేసిన పెళ్లి చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఓ కూతురు, కుమారుడు ఉన్నారు. దంపతులు వారి పిల్లలతో కలిసి హ్యాపీగా జీవితం గడిపారు. సంవత్సరం క్రితం భర్త అతని భార్య చెల్లెలిని వివాహం చేసుకున్నాడు. రెండో భార్య దెబ్బతో అతను కూతురికి విషం పెట్టి హత్య చేసి అతను ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి ఆత్మహత్య చేసుకునే సమయంలో అతని కుమారుడు ఇంటి బయట ఆడుకోవడానికి వెళ్లి ప్రాణాలతో బయటపడ్డాడు.

హ్యాపీగా పెళ్లి చేసుకున్నారు

హ్యాపీగా పెళ్లి చేసుకున్నారు

తమిళనాడులోని శివకాశి సమీపంలోని పెర్నాయకన్ పట్టి ప్రాంతంలో గణేషన్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 12 ఏళ్ల క్రితం కుటుంబ సభ్యులు ఉమాలక్ష్మి అనే మహిళను చూసి పెళ్లి చేసుకోవాలని గణేషన్ కు చెప్పారు. పెళ్లి చేసుకోవడానికి గణేషన్, ఉమాలక్ష్మీ అంగీకరించడంతో ఇద్దరికి పెళ్లి చేశారు.

చనిపోయిన భార్య

చనిపోయిన భార్య

కుటుంబ సభ్యులు సెట్ చేసిన పెళ్లి చేసుకున్న ఉమాలక్ష్మి, గణేషన్ దంపతులు సంతోషంగా కాపురం చేశారు. ఉమాలక్ష్మి, గణేషన్ దంపతులకు అభినయా (9) అనే కూతురు, ఓ కుమారుడు ఉన్నారు. గణేషన్, ఉమాలక్ష్మి దంపతులు వారి పిల్లలతో కలిసి హ్యాపీగా జీవితం గడిపారు. అయితే ఐదు సంవత్సరాల క్రితం అనారోగ్యంతో గణేషన్ భార్య ఉమాలక్ష్మి చనిపోయింది.

భార్య చెల్లితో రెండో పెళ్లి

భార్య చెల్లితో రెండో పెళ్లి

భార్య చనిపోయిన నాలుగు సంవత్సరాలు గణేషన్ అతని కూతురు, కొడుకును పెంచి పోషిస్తూ వారిని బాగా చూసుకుంటున్నారు. కుటుంబ సభ్యులు ఒత్తిడి చెయ్యడంతో గణేష్ అతని భార్య చెల్లెలు రాధికను సంవత్సరం క్రితం పెళ్లి చేసుకున్నాడు. అక్క పిల్లలు, భర్త గణేషన్ తో కలిసి రాధిక ఒకే ఇంటిలో నివాసం ఉంటున్నది.

కూతురికి విషం పెట్టిన తండ్రి

కూతురికి విషం పెట్టిన తండ్రి

కొంతకాలంగా గణేషన్ కు, అతని రెండో భార్య రాధికకు గొడవలు జరుగుతున్నాయని తెలిసింది. గణేషన్ తో గొడవపడిన అతని రెండో భార్య రాధిక ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. రెండో భార్య రాధిక తీరుతో విసిగిపోయిన గణేషన్ అతని కూతురు అభినయాకు ఆహారంలో విషం పెట్టి అతను విషం సేవించాడు.

ఫ్రెండ్స్ తో వెళ్లి బతికిపోయిన కొడుకు

ఫ్రెండ్స్ తో వెళ్లి బతికిపోయిన కొడుకు

వెంటనే కుటుంబ సభ్యులు తండ్రి, కూతురిని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే గణేషన్, అతని కుమార్తె అభినయా చనిపోయారని చెప్పారు. గణేషన్ ఆత్మహత్య చేసుకునే సమయంలో అతని కుమారుడు ఇంటి బయట ఆడుకోవడానికి వెళ్లి ప్రాణాలతో బయటపడ్డాడని పోలీసులు అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+