Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Illegal affair: ఉద్యోగం లేని భర్త, సివిల్స్ రాసి చింపేస్తానని భార్య, పెళ్లాం, అత్తను అడ్డంగా నరికేశాడు!

చెన్నై/ తిరుచ్చి: ఉద్యోగం లేని భర్త భార్యకు చులకన అయ్యాడు. సివిల్ పరీక్షలు రాసి చింపేస్తాని భార్య రెచ్చిపోయింది. సివిల్స్ పరీక్షలు రాసి ఉద్యోగం సంపాదిస్తానని భర్తకు చెబుతున్న భార్య రోజు సింగారించుకుని కోచింగ్ సెంటర్, ఆమె బావ చుట్టూ తిరిగి జల్సా చేసింది. నువ్వు నీ పద్దతి మార్చుకోవాలని భర్త భార్యకు చెప్పాడు. అంతలోనే అడ్డం దూరుతున్న అత్త అల్లుడిని లెక్కచెయ్యకుండా నోటికి వచ్చినట్లు బూతులు మాట్లాడింది.

రోజు ఇదే పంచాయితీనా, నువ్వు నీ కూతురికి నాతో పాటు మరో వ్యక్తిని రంకు మొగుడిగా తెస్తావా ? అంటూ సహనం కోల్పోయిన భర్త అర్దరాత్రి భార్య, అత్త తలలు అడ్డంగా నరికేశాడు. నా భార్యకు ఆమె బంధువుతో అక్రమ సంబంధం ఉందని తెలిసినా ఆమె తల్లి వత్తాసు పలికిందని, కూతురిని ఎంజాయ్ చెయ్యమని మా అత్త అతని దగ్గరకు పంపించిందని, అందుకే ఇంత కథ జరిగిందని భర్త చెప్పాడు.

 డబ్బు సంపాధించలేని భర్త చులకన?

డబ్బు సంపాధించలేని భర్త చులకన?

తమిళనాడులోని తిరుచ్చి నగరంలోని నాయక్ స్ట్రీట్ లో ఉలగనాధన్ (35), పవిత్ర (30) దంపతులు నివాసం ఉంటున్నారు. ఉలగనాథన్, పవిత్ర దంపతులకు 3 ఏళ్ల కనిష్కా అనే కుమార్తె ఉంది. తిరుచ్చిలోని ఓ టైర్ కంపెనీలో ఉలగనాథన్ ఇంతకాలం ఉద్యోగం చూసేవాడు. కరోనా దెబ్బతో ఉద్యోగం మానేసిన ఉలగనాథన్ ఇంట్లోనే ఖాళీగా ఉంటున్నాడు. ఉద్యోగం మానేసిన ఉలగనాథన్ ను అతని భార్య పవిత్రకు, ఆమె కుటుంబ సభ్యులకు చులకన అయ్యాడు.

 సివిల్స్ పరీక్షలు రాసి చింపేస్తా

సివిల్స్ పరీక్షలు రాసి చింపేస్తా

టీఎన్ పీఎస్ సీ (గ్రూప్ పరీక్షలు) రాయడానికి పవిత్ర తిరుచ్చిలోని ఓ కోచింగ్ సెంటర్ లో శిక్షణ తీసుకుంటున్నది. ప్రతిరోజూ ఉదయం ఇంట్లో స్నానం చేసి మేకప్ వేసుకుని నీట్ గా రెఢీ అయ్యి కోచింగ్ సెంటర్ కు వెలుతున్న భార్య పవిత్ర సాయంత్రం ఇంటికి తిరిగి వస్తోంది. పవిత్ర తీరుపై భర్త ఉలగనాథన్ ఏదో జరుగుతోంది అంటూ భర్త భార్య పవిత్ర మీద అనుమానం పెంచుకున్నాడు.

ఈ విషయం పవిత్ర కుటుంబ సభ్యులకు చెప్పినా వారు ఏ మాత్రం పట్టించుకోలేదని, కనీసం పవిత్రను మందలించలేదు. గ్రూప్ పరీక్షలు రాయడం కోసం శిక్షణ తీసుకోవడానికి కోచింగ్ సెంటర్ కు వెలుతున్న తన భార్య పవిత్ర మీద తనకు అనుమానం వచ్చిందని, తాను కొన్ని రోజులు ఆమెను ఉలగనాథన్ రహస్యంగా ఫాలో అయ్యాడు.

బావతో జల్సా చేస్తున్న భార్య

బావతో జల్సా చేస్తున్న భార్య

కోచింగ్ సెంటర్ నుంచి మద్యలోనే బయటకు వస్తున్న పవిత్ర అతని సమీప బంధువుతో కలిసి అతని రూమ్ కు వెళ్లి ఎంజాయ్ చేస్తోందని ఉలగనాథన్ గుర్తించాడు. తన భార్య పవిత్ర గూడుపుటాని గురించి ఆమె తల్లిదండ్రులకు తెలిసినా వారు ఏమాత్రం పట్టించుకోలేదని, కనీసం మందలించలేదని ఉలగనాథన్ రగిలిపోయాడు. ఈ విషయంపై కొన్ని రోజులు పవిత్రతో ఉలగనాథన్ కు గొడవలు జరిగాయి.

 వాడు నా రెండో అల్లుడురా, ఏం చేస్తావ్?

వాడు నా రెండో అల్లుడురా, ఏం చేస్తావ్?

కుమార్తె పవిత్ర, మనుమరాలు కినిష్కాని చూడటానికి ఉలగనాథన్ అత్త కలైసెల్వి తిరుచ్చిలోని కూతురు పవిత్ర ఇంటికి వెళ్లింది. రోజు కోచింగ్ సెంటర్ కు వెళ్లి వస్తున్న భార్య పవిత్రతో నువ్వు ఎవడితో తిరుగుతున్నావ్ ? వాడు ఎవడు అంటూ భర్త ఉలగనాథన్ గొడవ పెట్టుకున్నాడు. అల్లుడిపై అతని అత్త కలైసెల్వి మండిపడింది. ఏం నాకూతురి మీద నీకు నమ్మకం లేదా, ఎందుకు పదేపదే గొడవ పడుతున్నావ్, అవునురా వాడు నా కూతురికి రెండో మొగుడు, నువ్వు ఏం చేస్తావ్ ? అంటూ ఉలగనాథన్ పై అత్త కలైసెల్వి రెచ్చిపోయింది.

 ఫస్ట్ అత్త, తరువాత భార్య

ఫస్ట్ అత్త, తరువాత భార్య

అర్దరాత్రి వరకు ఉలగనాథన్, అతని భార్య పవిత్ర, అత్త కలైసెల్విల మద్య తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. తరువాత పవిత్ర, ఆమె తల్లి కలైసెల్వి ఒక గదిలో నిద్రపోయారు. అర్దరాత్రి దాటిన తరువాత పదునైన కొడవలి తీసుకున్న ఉలగనాథన్ నిద్రపోతున్న భార్య పవిత్ర, అత్త కలైసెల్విల తలలు కసితీరా నరికేయడంతో వారి ప్రాణాలు అక్కడే పోయాయి. భార్య, అత్తను హత్య చేసిన ఉలగనాథన్ కుమార్తె కనిష్కాను ఎత్తుకుని ఇంటి బయట కారులో సిద్దంగా ఉన్న స్నేహితులు కారులో అక్కడి నుంచి పరారైనాడు. పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్న ఉలగనాథన్ కుమార్తె కనిష్కా కోసం చివరికి కోర్టు ముందు లొంగిపోయాడు.

Recommended Video

    Odisha Artist Carves Portrait Of PM Modi On tree To Send An 'Important' Message | Oneindia Telugu
    అత్త చేసిన పనికే ఇంత కథ జరిగింది

    అత్త చేసిన పనికే ఇంత కథ జరిగింది

    పవిత్ర తీరుపై అసహనంతో ఆమెను తాను నిలదీశానని, తన కాపురంలో చిచ్చు రేపుతున్న అత్త కలైసెల్విలను చంపేశానని ఉలగనాథన్ పోలీసుల విచారణలో అంగీకరించాడు. అందుకే పక్కింటి వాళ్లకు కూడా సౌండ్ రాకుండా భార్య పవిత్ర, అత్త కలైసెల్విలను హత్య చేశానని ఉలగనాథన్ పోలీసుల విచారణలో అంగీకరించాడు. అసలు తాను కొడవలి తీసుకుంది తన భార్య పవిత్ర ప్రియుడిని చంపడానికి అని, రెండుమూడు సార్లు అతన్ని చంపడానికి ప్రయత్నించి విఫలం అయ్యానని ఉలగనాథన్ పోలీసులకు చెప్పాడు. కేవలం తన అత్త కలైసెల్వి తన భార్య పవిత్ర చెడిపోవడానికి కారణం అయ్యిందని ఉలగనాథన్ ఆరోజు చెప్పడం కలకలం రేపింది. అక్రమ సంబంధం విషయంలో భార్య, అత్తను ఒకే సారి నరికిచంపడంతో 2020లో తమిళనాడులో కలకలం రేపింది. ప్రస్తుతం ఉలగనాథన్ కేసు కోర్టులో విచారణలో ఉంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+