Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Video call: విదేశాల్లో భర్త, భార్యతో ఆ విషయంలో గొడవ, వీడియో కాల్, గుడ్ బై చెప్పి లైవ్ లో ఆత్మహత్య!

చెన్నై/ కన్యాకుమారి/ మదురై: విదేశాల్లో ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్న భర్త బాగా డబ్బులు సంపాధిస్తూ భార్యకు పంపిస్తున్నాడు. అయితే విదేశాల్లో భర్త, ఇక్కడ ఒంటరిగా భార్య ఉంటున్నారు. అయితే మూడు రోజుల పాటు ఓ విషయంలో దంపతుల మద్య వీడియో కాల్ లో తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. ఆ సమయంలో ఏదో జరిగింది జరిగిపోయింది, ఇక వదిలేద్దాం అంటూ ఇద్దరూ ఒకరికి ఒకరు సర్దుకుని నచ్చచెప్పకున్నారు. అయితే మరుసటి రోజు భర్తకు వీడియో కాల్ చేసిన భార్య గుడ్ బై, హ్యాపీగా ఉండూ అంటూ లైవ్ లో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

ఐదేళ్ల క్రితం పెళ్లి

ఐదేళ్ల క్రితం పెళ్లి

తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలోని అమరావతి విలే ప్రాంతంలోని అంజూ గ్రామానికి చెందిన సెల్వరాజ్ (38), ఒమన్ లో ఆయిల్ కంపెనీలో కెమికల్ ఇంజనీరుగా మంచి ఉద్యోగం చేస్తున్నాడు. ఐదు సంవత్సరాల క్రితం సెల్వరాజ్ అగ్నెస్ నందా (31) అనే యువతిని వివాహం చేసుకున్నాడు. సెల్వరాజ్ అగ్నెస్ నందా దంపతులకు కుమార్తె (4), రెండున్న సంవత్సరాల వయసు ఉన్న కుమారుడు ఉన్నారు.

 విదేశాల్లో ఉద్యోగం

విదేశాల్లో ఉద్యోగం

సెల్వరాజ్ రెండో కుమారుడు పుట్టిన తరువాత ఒమన్ వెళ్లి ఆయిల్ కంపెనీలో కెమికల్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తూ భారీగా జీతం తీసుకుంటున్నాడు. సొంత ఊర్లో ఉంటున్న భార్య ఆగ్నెస్ నందా, ఇద్దరు పిల్లలు సంతోషంగా ఉండాలని ప్రతినెల డబ్బులు పంపిస్తున్నాడు. గత ఏడాదిలో సెల్వరాజ్ సొంత ఊరికి వచ్చి రెండు నెలల పాటు భార్య, పిల్లలతో సంతోషంగా గడిపి మళ్లీ ఉద్యోగం చెయ్యడానికి ఒమన్ వెళ్లిపోయాడు.

 నాలుగు రోజుల క్రితం !

నాలుగు రోజుల క్రితం !


ప్రతిరోజు సెల్వరాజ్ ఒమన్ నుంచి వీడియో కాల్ చేస్తూ భార్య అగ్నెస్ నందా, ఇద్దరు పిల్లలతో మాట్లాడుతున్నాడు. ఎప్పటిలాగే నాలుగు రోజుల క్రితం సెల్వరాజ్ భార్య అగ్నెస్ నందాకు ఫోన్ చేశాడు. ఆ సమయంలో ఓ విషయంలో ఇద్దరి మధ్య గొడవ మొదలైయ్యింది. ఆ రోజు ఇద్దరూ వీడియో కాల్ లోనే వాగ్వివాదానికి దిగారు. తరువాత సెల్వరాజ్ ఫోన్ కట్ చేశాడు.

ఏదో జరిగిపోయింది.... వదిలేద్దాం

ఏదో జరిగిపోయింది.... వదిలేద్దాం


మూడు రోజులు ప్రతిరోజు వీడియో కాల్ లో సెల్వరాజ్, అతని భార్య అగ్నెస్ నందా గొడవపడ్డారు. ఎవరో ఒకరు ఫోన్ కట్ చెయ్యడంతో వివాదం అక్కడికి సమిసిపోయింది. రెండు రోజుల క్రితం ఇద్దరూ తీవ్రస్థాయిలో గొడవపడ్డారు. తరువాత ఏదో జరిగింది జరిగిపోయింది, ఇక ఆ విషయం వదిలేద్దాం, ఇక ముందు హ్యాపీగా ఉందాం అంటూ సెల్వరాజ్ భార్య అగ్నెస్ నందాకు నచ్చ చెప్పాడు. అక్కడితో దంపతుల మద్య ఆరోజు వివాదం సమిసిపోయింది.

 లైవ్ లో విషం తాగిన భార్య

లైవ్ లో విషం తాగిన భార్య

గొడవ జరిగిన మరసటి రోజు అగ్నెస్ నందానే భర్త సెల్వరాజ్ కు వీడియో కాల్ చేసింది. మూడు నిమిషాల పాటు భర్త సెల్వరాజ్ తో మాట్లాడిన అగ్నెస్ నందా గుడ్ బై సెల్వ, హ్యాపీగా ఉండూ అంటూ విషం బాటిల్ తీసుకుని వీడియో కాల్ లోనే విషం తాగేసింది. వీడియో కాల్ లోనే భార్య ఆత్మహత్య చేసుకోవడానికి అగ్నెస్ నందా విషం తాగడంతో సెల్వరాజ్ హడలిపోయాడు.

 ఒంటరి తనంతో విరక్తి ?

ఒంటరి తనంతో విరక్తి ?

సెల్వరాజ్ వెంటనే బంధువులకు సమాచారం ఇచ్చారు. బంధువులు అగ్నెస్ నందాను ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. అయితే చికిత్స విఫలమై అగ్నెస్ నందా మరణించిందని పోలీసులు అన్నారు. పెళ్లి జరిగినప్పటి నుంచి ఎక్కవగా విదేశాల్లోనే ఉంటున్నాడని, తాను సంతోషంగా జీవించలేకపోతున్నానని, తనకు శారరీక సుఖం దూరం అవుతోందని భార్య అగ్నెస్ నందా ఆమె సమీప బంధువు అయిన ఓ మహిళతో చెప్పిందని తెలిసింది. కేసు విచారణలో ఉందని పోలీసులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+