Viral:60 ఏళ్లు దాటినా-20 ఏళ్ల తరహాలో : స్టాలిన్ తగ్గేదే లే- పొలిటికల్ "ఎక్సర్ సైజ్" మొదలెట్టేశారు..!!

చెన్నై: నిత్యం ప్రజల సమస్యలు ప్రజాసేవతో బిజీగా ఉండే ముఖ్యమంత్రులు వారి ఆరోగ్యం పట్ల కూడా చాలా శ్రద్ధ వహిస్తుంటారు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ తాము ఆరోగ్యవంతంగా ఉండకపోతే రాష్ట్రాన్ని ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దలేమన్నది చాలామంది సీఎంల పర్సనల్ ఫీలింగ్. అందుకే తమ పనులతో తీరిక లేకపోయినప్పటికీ... పర్సనల్ స్పేస్‌ను క్రియేట్ చేసుకుని జిమ్‌లో వర్కౌట్స్ చేయడం, ఉదయాన్నే యోగా చేయడం, పలు వ్యాయామాలు చేయడం చేస్తుంటారు.

ఏపీ సీఎం జగన్ ఉదయాన్నే జిమ్‌లో వర్కౌట్స్ చేస్తుంటారని తన సన్నిహితులు చెబుతుంటారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు కూడా యోగా చేస్తారు. తాను ఆరోగ్యంగా ఉండేందుకు చాలా మితంగా తింటారని కూడా పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు చంద్రబాబు. తాజాగా తమిళనాడు సీఎం స్టాలిన్ జిమ్‌లో వర్కౌట్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది. ఇంతకీ ఆ కథేంటో చూద్దామా..

 ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యత

ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యత

తమిళనాడు సీఎం స్టాలిన్ తన ఫిట్‌నెస్‌కు అత్యంత ప్రాధాన్యత ఇస్తారట. తన శరీరంను ఎప్పుడూ ఫిట్‌గా ఉంచుకునే ప్రయత్నం చేస్తారని తన సన్నిహితులు తరుచూ చెబుతుంటారు. ఇందులో భాగంగా స్టాలిన్‌కు సైక్లింగ్ చేయడమంటే మహా సరదా. కొన్ని రోజుల క్రితం కూడా ఉదయాన్నే బయట సైక్లింగ్ చేస్తూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్న వీడియో కూడా ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యింది. స్టాలిన్ సైక్లింగ్ చేస్తున్నప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరిస్తారు. సైక్లింగ్‌కు ప్రత్యేకమైన డ్రెస్ ధరిస్తారు.కొన్ని రోజుల క్రితం స్టాలిన్ సైక్లింగ్ చేస్తున్న వీడియో ఫోటోలు హల్చల్ చేశాయి.

ఇంట్లో జిమ్ ఏర్పాటు

ఇక రాష్ట్రాన్ని ఆరోగ్యవంతంగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా తనపై ఉందని భావించిన స్టాలిన్... అతని ఆరోగ్యంపై మరింత ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం ఇంటిలోనే తనకంటూ ఒక సొంత జిమ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఈ జిమ్‌ అత్యంత మోడర్న్‌గా ఉంది. ఇందులో సకల సదుపాయాలు ఉన్నాయి.

ఇందులో ఎక్విప్‌మెంట్ అంతా వరల్డ్ క్లాస్ ఎక్విప్‌మెంటే అట. లోపల టీవీ సెట్‌ కూడా ఉంది. ఓ వైపు జిమ్‌లో వర్కౌట్ చేస్తూనే తన రాష్ట్రంతో పాటు దేశంలో జరుగుతున్న వార్తలపై స్టాలిన్ దృష్టి పెడతారు. అంటే అక్కడ కూడా పరోక్షంగా పనిచేస్తున్నట్లే అని చెప్పొచ్చు. ఇక రిఫ్రిజిరేటర్‌తో పాటు సీఎంకు కావాల్సిన సకల సదుపాయాలు ఈ జిమ్‌లో ఏర్పాటు చేశారు.

 జిమ్‌లో వర్కౌట్ చేస్తూనే...

జిమ్‌లో వర్కౌట్ చేస్తూనే...

ఇక తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టాక స్టాలిన్ మరింత అలర్ట్‌గా ఉన్నారు. ప్రతిపక్షాలకు ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఏమైనా లోపాలు ఉంటే ఎప్పటికప్పుడు కరెక్ట్ చేసుకునే పనిలో ఉంటారు. ఇందులో భాగంగా జిమ్‌లో వర్కౌట్ చేస్తున్న సమయంలో వార్తలు చూస్తూ ఎక్కడైనా సమస్య ఉన్నట్లు తన దృష్టికి వస్తే వెంటనే స్పందించి ఆ సమస్య పరిష్కారానికి కృషి చేస్తారని అతని సన్నిహితులు చెబుతున్నారు. జిమ్‌లో వాకింగ్ చేస్తూనే వార్తలు చూస్తూ ఉంటారు స్టాలిన్.

ఆరుపదుల వయస్సులో...

ఆరుపదుల వయస్సులో...

ఇక వ్యాయామంలో భాగంగా సీఎం స్టాలిన్ వెయిట్ లిఫ్టింగ్‌ చేస్తున్నట్లు కనిపిస్తోంది. కొన్ని బరువులను ఎత్తి తిరిగి నిలబడటం ద్వారా ఫిట్‌నెస్ పెంచుకోవచ్చని చెప్పకనే చెబుతున్నారు. కొన్ని వ్యాయామాలను చూస్తే భుజాలను బలపరిచేలా ఉన్నాయి. ఇలా శరీరంలో అన్ని భాగాలు బలపడే వ్యాయామాలు చేస్తున్నారు స్టాలిన్. స్టాలిన్ చేస్తున్న ఈ వర్కౌట్లను చూసి యువత చాలా నేర్చుకోవాలని పలువురు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. స్టాలిన్ వయస్సు 68 ఏళ్లు.. అయినప్పటికీ కుర్రాడిలా ఎంచక్కా వర్కౌట్లు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.

స్లీవ్‌లెస్ షర్టు షార్ట్ ధరించి..

స్లీవ్‌లెస్ షర్టు షార్ట్ ధరించి..

తమిళనాడు సీఎం స్టాలిన్ జిమ్‌లో వర్కౌట్లు చేస్తున్న సమయంలో కుర్రాడిలా మంచి స్లీవ్‌లెస్ టీషర్టు, షార్ట్ ధరించారు. స్టాలిన్ ఈ గెటప్‌లో కుర్రాళ్లను మించిపోయారంటూ నెటిజెన్లు పోస్టులు పెడుతున్నారు. ఇక ఎప్పుడూ తెల్ల పంచ తెల్ల షర్టులో కనిపించే స్టాలిన్.. ఒక్కసారిగా ఈ స్టైలిష్ గెటప్‌లో కనిపించేసరికి అంతా ఆశ్చర్యపోతున్నారు. స్టాలిన్ స్పోర్ట్స్ షూస్ ధరించారు. ఇక ఓవరాల్‌గా స్టాలిన్ గెటప్ చూస్తే పక్కా ప్రొఫెషనల్‌గా కనిపిస్తున్నారు. ఇలా ఒక రాష్ట్ర సీఎం తన ఆరోగ్యం పట్ల ఎంత శ్రద్ధ వహిస్తున్నారో చూస్తే ఈ వీడియోలు యువతకు స్ఫూర్తిగా నిలుస్తాయని కొందరు జిమ్ ప్రొఫెషనల్స్ చెబుతున్నారు. తన రాష్ట్రం ఆరోగ్య తమిళనాడుగా కావాలనేదే తన లక్ష్యం అని స్టాలిన్ చెబుతున్నారు. ఇక స్టాలిన్ చేస్తున్న వర్కౌట్లు ఉన్న వీడియో అప్‌లోడ్ అయిన కొన్ని గంటల్లోనే కొన్ని లక్షల్లో వ్యూస్ వచ్చాయి.. అదే సమయంలో షేర్ కూడా చేశారు.

Recommended Video

    MK Stalin Takes Oath As Tamil Nadu CM సంచలనాలకు తెర తీసిన స్టాలిన్
     ఫిట్‌నెస్‌కు మోదీ ప్రాధాన్యత

    ఫిట్‌నెస్‌కు మోదీ ప్రాధాన్యత

    ఇక దేశం ఆరోగ్యవంతంగా ఉండాలనేది ప్రధాని మోదీ కల. ఇందులో భాగంగానే ఆయన కూడా ఫిట్‌నెస్‌కు చాలా ప్రాధాన్యత ఇస్తారు. మోదీ ఫిట్‌నెస్ చూసిన ప్రత్యర్థులు ఇంత ఫిట్‌గా మోదీ ఎలా ఉంటారని ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటారు. మోదీ ప్రతిరోజు ఉదయాన్నే 4 గంటలకు నిద్రలేస్తారు. క్రమం తప్పకుండా ఒక గంటపాటు యోగా చేస్తారు.

    కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ఫిట్‌నెస్ మంత్రాను పాటిస్తారు. ఎక్కువగా మజ్జిగా, జ్యూస్‌లు తీసుకుంటారు. ప్రధాని ఎక్కువగా పండ్లు సలాడ్స్ తీసుకుంటారని బీజేపీ వర్గాలు చెబుతుంటాయి. అన్నం, పప్పు, ఇతర కర్రీస్‌ కూడా చాలావరకు తగ్గించినట్లు తెలుస్తోంది. ప్రధాని ఎక్కువగా పెరుగన్నంను ఇష్టపడతారని టాక్. ఇక ఏపీ సీఎం జగన్ కూడా ఫిట్‌నెస్‌పై ఎంతో శ్రద్ధ వహిస్తారు. జ్యూస్‌లు ఎక్కువగా తీసుకుంటారు. సీఎం జగన్‌కు చాక్లెట్స్ అంటే ఇష్టమని చెబుతుంటారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+