CSK vs MI : ముంబైతో పోరుకు ముందు చెన్నైకు షాక్- ఆ రూ.16.25 కోట్ల ఆల్ రౌండర్ డౌటే...

ముంబై ఇండియన్స్, చెన్నె సూపర్ కింగ్స్ మధ్య ఇవాళ ముంబై వాంఖడే స్టేడియంలో రాత్రి ఏడున్నర గంటలకు కీలక పోరు జరగబోతోంది. ఈ పోరు కోసం ఇరుజట్లూ సన్నద్ధమవుతున్నాయి. అయితే ఈ టోర్నీలో తొలి మ్యాచ్ లోనే ఓడినా ఆ తర్వాత కుదురుకుంటున్న చెన్నై జట్టుకు ఆటగాళ్ల గాయాలు వేధిస్తున్నాయి. ఇవాళ జరిగే కీలక మ్యాచ్ లో చెన్నై జట్టులో కీలకమైన ఓ ఆల్ రౌండర్ ఆడటం అనుమానంగానే కనిపిస్తోంది.

చెన్నైసూపర్ కింగ్స్ జట్టులో కీలక ఆల్ రౌండర్ గా ఉన్న ఇంగ్లండ్ క్రికెటర్ బెన్ స్టోక్స్ ఐపీఎల్ టోర్నీకి ముందే మోకాలి గాయం నుంచి కోలుకున్నాడు. ఇప్పుడు మరోసారి గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. అయితే ఈసారి మరో గాయం వేధిస్తోంది. దీంతో ముంబైతో కీలక మ్యాచ్ లో బెన్ స్టోక్స్ ఆడటం అనుమానమే అని తెలుస్తోంది. నిన్న ప్రాక్టీస్ సందర్భంగా గాయంతో ఇబ్బంది పడుతున్న స్టోక్స్ ను డాక్టర్లు పరీక్షించి విశ్రాంతి అవసరమని సూచించారు.

 micsk

నిన్న చెన్నె సూపర్ కింగ్స్ ప్రాక్టీస్ సందర్భంగా కాలి మడమ నొప్పితో బాధపడ్డాడు. దీంతో పరీక్షించిన డాక్టర్లు.. పది రోజుల విశ్రాంతి అవసరమని తేల్చారు. అయితే ఇవాళ మ్యాచ్ లో స్టోక్స్ ను ఆడించాలా వద్దా అన్న దానిపై మ్యాచ్ కు ముందు మెడికల్ టీమ్ ఓ నిర్ణయం తీసుకుంటుందని చెప్తున్నారు. అయితే స్టోక్స్ గాయం గురించి తెలిసిన వారు మాత్రం అతను ఈ మ్యాచ్ లో ఆడే రిస్క్ తీసుకోకపోవచ్చని అంటున్నారు. స్టోక్స్ దూరమైతే ఆ మేరకు చెన్నైకు ఎదురుదెబ్బ తగిలినట్లే.

చెన్నె సూపర్ కింగ్స్ జట్టు ఈ ఇంగ్లండ్ ఆల్ రౌండర్ ను రూ.16.25 కోట్ల మొత్తానికి కొనుగోలు చేసింది. అయితే ఈ సీజన్ లో ఇంకా తన సత్తా చాటుకోని స్టోక్స్.. అప్పుడే గాయాలతో బాధపడుతున్నాడు. ఇప్పటికే ఆడిన మ్యాచ్ ల్లో పేలవ ప్రదర్శన చేసిన స్టోక్స్ ఫామ్ లోకి వస్తే తప్ప చెన్నై కష్టాలు తీరేలా లేవు. అదే సమయంలో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనతో ప్రయోజనాలు అందుకుంటున్న చెన్నై సూపర్ కింగ్స్.. స్టోక్స్ విషయంలో రిస్క్ తీసుకునేందుకు కూడా సిద్ధంగా లేనట్లు కనిపిస్తోంది. స్టోక్స్ దూరమైతే అతని స్ధానంలో దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ డ్వేన్ ప్రిటోరియస్ ను చెన్నై జట్టులోకి తీసుకునే అవకాశముంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+