వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Sprouts: మొలకెత్తిన గింజలు తింటే గ్యాస్ సమస్య వస్తుందా..

|
Google Oneindia TeluguNews

చాలా మంది ఆరోగ్య నిపుణులు మొలకెత్తిన విత్తనాలు తినాలని సూచిస్తారు. ఎందుకంటే ఈ మొలకెత్తిన గింజల్లో చాలా పోషకాలు ఉంటాయి. మొలకెత్తిన విత్తనాల్లో ప్రోటీన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, మాంగనీస్, ఫోలేట్, విటమిన్ సి విటమిన్ కె ఉంటాయి. మొలకెత్తిన గింజలను తినడం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరిగి చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందట. గుండె నొప్పిలాంటి సమస్యలు కూడా తగ్గుతాయట.

ఫైటోఎరోజెన్

ఫైటోఎరోజెన్

మొలకెత్తిన విత్తనాల్లో ఉండే ఫైటోఎరోజెన్ నిల్వలు , గుండె ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇవి అధిక మొత్తాలలో సజీవ ఎంజైములను కలిగి ఉంటాయట. కానీ వీటిని జీర్ణం చేయడానికి శరీరానికి ఎక్కువ సమయం పడుతుందట. మొలకెత్తిన గింజలు తింటే కడుపు ఉబ్బరం, ఎసిడిటీ, మలబద్ధకం, హేమోరాయిడ్లు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఆర్థరైటిస్

ఆర్థరైటిస్


రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నవారు వీటిని తినడం అంత మంచిది కాదని చెబుతున్నారు. కఫం సమస్య ఉన్నవారికి మొలకెత్తిన గింజలు త్వరగా జీర్ణం కావట. మొలకెత్తిన విత్తనాలు తినడం వల్ల కడుపు నొప్పి, గ్యాస్ ప్రమాదం ఉందట. ఈ గింజల్లో ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉండడం వల్ల రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే వారికి ఇబ్బంది కలిగిస్తాయట. కిడ్నీల సమస్యలు ఉన్నవారు కూడా మొలకలు తినకపోవడమే మంచిదని సూచిస్తున్నారు.

గ్యాస్

గ్యాస్


అయితే మొలకెత్తిన గింజు అదే పనిగా కాకుండా వారానికి ఒకసారి తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే పరిగడుపున వీటిని తినడం వల్ల మలబద్దకం, గ్యాస్ సమస్యలు వచ్చే అవకాశం ఉందట. ఇప్పటికే గ్యాస్ సమస్య ఉన్నవారు మొలకెత్తిన గింజలు తినకపోవడం మంచిది.

English summary
People with multiple problems should not take sprouted seeds. Experts say to take less if you take it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X