Valentines day 2024:ప్రేమికులు అక్కడ ఒకే గదిలో ఉండొచ్చా..conditions apply..!
Valentines day:ఫిబ్రవరి 7వ తేదీ నుంచి వాలెంటైన్స్ వీక్ ప్రారంభం అవుతుంది. ఈ వారమంతా ప్రేమికులు చాలా బిజీగా గడిపేస్తుంటారు. ఒకరికొకరు గిఫ్ట్స్ ఇచ్చిపుచ్చుకోవడాలు, సరదాగా గంటలపాటు కబుర్లు చెప్పుకోవడాలు, ఇలా వారికి తెలియకుండానే సమయం గడిపేస్తుంటారు. వారు ప్రేమలో మునిగాక బయట ప్రపంచంతో సంబంధం లేదన్నట్లుగానే ఉంటారు. ఇక వాలెంటైన్స్ డే రోజు మాత్రమే చాలామంది ప్రేమికులకు చాలా అనుమానాలున్నాయి.
ప్రేమికులు ఒంటరిగా ఒక హోటల్ గదిలో ఉండాలంటే పరిస్థితి ఏంటి.. అసలు అలా ఉండొచ్చా.. చట్టపరమైన చిక్కులు ఏమైనా వస్తాయా అనే అనుమానాలు చాలామంది ప్రేమికుల్లో ఉన్నాయి. అలాంటి వాటికి న్యాయనిపుణులు సమాధానం ఇస్తున్నారు. అబ్బాయి అమ్మాయి 18 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సున్న వారికి స్వేచ్ఛ ఉంటుందని న్యాయనిపుణులు చెబుతున్నారు.వారిద్దరూ కలిసి ఒక హోటల్‌లోని ఒకే గదిలో క్వాలిటీ టైమ్‌ను స్పెండ్ చేయొచ్చని స్షష్టత ఇస్తున్నారు.

సమాజం దృష్టిలో తప్పే కానీ..!: భారతీయ సంస్కృతి ప్రకారం ఇలా పెళ్లి కాకుండానే వయసులో ఉన్న ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఒకే గదిలో ఉండటమనేది సమాజం తప్పుగానే చూస్తుందని అయితే చట్టప్రకారం ఇది నేరమేమీ కాదని న్యాయనిపుణులు చెబుతున్నారు. చట్టం అందరికీ ఒకటే అని నొక్కి చెబుతున్నారు. ఇలా ఇద్దరు ప్రేమ పక్షులు ఒక హోటల్ గదిలో ఏకాంత సమయం గడుపుతున్నప్పుడు పోలీసులు వచ్చి బెదిరిస్తున్నట్లయితే లేదా ఇబ్బంది పెడుతున్నట్లయితే వెంటనే పోలీస్ కంప్లయింట్ అథారిటీలో లేదా 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయొచ్చు. లేదా హోటల్ గదిలోనే ఉండి ఆన్‌లైన్‌లోనే ఫిర్యాదు చేయొచ్చు.

హోటల్స్ సురక్షితమేనా..?: ఇదిలా ఉంటే అన్ని హోటల్స్ మీరనుకున్నంత సేఫ్‌గా అయితే ఉండవు. కొన్ని సార్లు హిడెన్ కెమెరాలు అమర్చి అబ్బాయి అమ్మాయి గదిలోకి వెళ్లగానే రికార్డు చేసి బ్లాక్ మెయిల్ చేసిన సంఘటనలు చాలా వెలుగులోకి వచ్చాయి. అబ్బాయి - అమ్మాయి మీరు కనుక మీ సమయాన్ని హోటల్ గదిలో గడపాలని అనుకుంటే మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని సార్లు హోటల్ యాజమాన్యమే ఫేక్ పోలీసులను సృష్టించి వారిని మీరున్న గదికి పంపి మిమ్మలను బ్లాక్ మెయిల్ చేసే అవకాశం ఉంది.
మొత్తానికి చట్టం అందరికీ ఒకటే అని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు. మీకున్న స్వేచ్ఛను ఎవరూ హరించలేరని చెబుతున్నారు. ముఖ్యంగా ప్రేమికులు పరస్పర అంగీకారం కలిగి జీవితంలో ప్రయాణిస్తే అంతా సవ్యంగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.
Disclaimer: ప్రేమికులకు ఉన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు న్యాయనిపుణుల సూచనలు సలహాలు ఇంటర్నెట్‌లో సేకరించి పైన తెలిపాం. హోటల్ గదిలో ప్రేమికులు ఉండాలని మేము చెప్పడం లేదు ప్రోత్సహించడం లేదు.దయచేసి గమనించగలరు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications