walking with barefoot: చెప్పులు లేకుండా నడిస్తే లాభమా? నష్టమా?
చెప్పులు లేకుండా నడవడం మంచిదేనా? లేదా ఏదైనా నష్టం చేస్తుందా? ఇది చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. నడవడానికి శుభ్రమైన స్థలాన్ని ఎంచుకుని చెప్పులు లేకుండా నడిస్తే ఆరోగ్యానికి మంచిది అని చెబుతున్నారు . నేలకు పాదాలు నేరుగా స్పృశించడం వల్ల పాదాలకు విశ్రాంతి కలుగుతుందని గుండె ఆరోగ్యానికి, రక్తపోటుకు ఇది మేలు చేస్తుందని చెబుతున్నారు.
మడమ నొప్పి , అరికాలి ఫాసిటిస్ వంటి వాటిని నివారించడంలో చెప్పులు లేకుండా నడవడం సహాయపడుతుందని దీనిని గ్రౌండింగ్ అని పిలుస్తారు అని చెబుతున్నారు.శరీరంలోని సహజమైన విద్యుత్ సమతుల్యతను పునరుద్ధరించడానికి ఇది ఎంతో సహాయ పడుతుందని, భూమి యొక్క ఉపరితలంతో శరీరాన్ని అనుసంధానం చేయడం వల్ల నొప్పులు వాపులు తగ్గుతాయి అని చెబుతున్నారు.

దీనితో నిరోధక శక్తి పెరుగుతుందని, మెరుగైన నిద్ర వస్తుందని, ఒత్తిడి స్థాయిలు తగ్గడంతో పాటు మొత్తం శరీర ఆరోగ్యం మెరుగుపడుతుందని చెబుతున్నారు.చెప్పులు లేకుండా నడవడం వల్ల పాదాలలో ఉండే నరాలు యాక్టివ్ గా మారతాయని అంటున్నారు. చెప్పులు లేకుండా నడవడం వల్ల చీలమండ, మోకాలు, తుంటి పై ఒత్తిడిని తగ్గించవచ్చని చెబుతున్నారు. చెప్పులు లేకుండా నడవడం కండరాల బలాన్ని మెరుగుపరుస్తుందని, పాదాలు వంకర్లు పోకుండా కాపాడుతుందని అంటున్నారు.
శారీరక, మానసిక ప్రవర్తన మార్పులను, నిద్ర, హార్మోన్లు, భావోద్వేగాలు, శరీర ఉష్ణోగ్రతను కాపాడుతుందని చెబుతున్నారు. చెప్పులు లేకుండా నడవటం మీ శరీర సహజ కదలికలకు సహాయపడుతుంది. చెప్పులు లేకుండా నడవటం ప్రకృతితో మమేకం అవ్వటానికి సహాయపడుతుంది. ఒకటేసారి కఠినమైన నేలపై చెప్పులు లేకుండా నడవటం ఈజీ కాదు. కాబట్టి మొదట మెత్తని గడ్డిపై నడవటానికి ప్రయత్నించాలి.
ఆ తర్వాత నడవాలి అనుకున్న నేలను కాస్త చదునుగా ఉండేలా చూసుకుని నడక మొదలు పెట్టాలి. ప్రతీరోజు చెప్పులు లేకుండా నడవటానికి గంట సమయం కేటాయించాలి, ఆపై ఆ సమయాన్ని పెంచుకుంటూ పోవాలి. చెప్పులతో నడిచే కంటే చెప్పులు లేకుండా రోజూ కాసేపు నడిస్తే మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి పాదరక్షలు లేకుండా నడిస్తే ఆరోగ్యానికి రక్ష అన్న విషయం గుర్తు పెట్టుకోవాలి.












Click it and Unblock the Notifications