పసిడి ప్రియులకు షాకిస్తూ మళ్ళీ పెరిగిన బంగారం ధరలు; నేడు తెలుగురాష్ట్రాల్లో ధరలిలా!!
అక్షయ తృతీయ రోజు నుండి కాస్త తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు మళ్లీ పెరిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి పెరుగుతున్న బంగారం ధరలు ఒడిదుడుకులకు లోనవుతున్నా పెరుగుతున్న పరిస్థితే ఎక్కువగా ఉంది. ప్రస్తుతం 60వేలకు పైగా కొనసాగుతున్న బంగారం ధరలు 70వేల రూపాయలకు చేరుకుంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. సామాన్య, మధ్యతరగతి ప్రజలు బంగారాన్ని కొనుగోలు చేయలేని పరిస్థితి ప్రస్తుతం పెరుగుతున్న బంగారం ధరలతో కనిపిస్తుంది.
ఇక ఈ రోజు బంగారం ధర విషయానికి వస్తే దేశీయంగా 10గ్రాముల 22క్యారెట్ల బంగారం మీద రెండు వందల రూపాయలు, 10గ్రాముల 24క్యారెట్ల బంగారం మీద రెండు వందల ఇరవై రూపాయల మేర బంగారం ధర పెరిగింది. హైదరాబాదులో బంగారం ధర విషయానికి వస్తే పది గ్రాములు 22క్యారెట్ల బంగారం ధర నేడు 55,810రూపాయలు కాగా, 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 60,930రూపాయల వద్ద ట్రేడవుతోంది.

దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 22క్యారెట్ల బంగారం ధర 56 వేల రూపాయలుగా ప్రస్తుతం పెడుతుంటే 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర 61,080 రూపాయలుగా ప్రస్తుతం కొనసాగుతుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10గ్రాముల 22క్యారెట్ల బంగారం ధర 55,850 రూపాయలుగా విక్రయించబడుతుంటే, 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర 60,930 రూపాయలుగా ప్రస్తుతం ట్రేడవుతోంది.
బెంగళూర్ లో 10గ్రాముల 22క్యారెట్ల బంగారం ధర 55,900 రూపాయలుగా ప్రస్తుతం ట్రేడ్ అవుతుంటే 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర 60,980 రూపాయలుగా ప్రస్తుతం కొనసాగుతుంది. ఇక ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు,చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురం, కాకినాడ, రాజమండ్రిలలో 10గ్రాముల 22క్యారెట్ల బంగారం ధర 55,850రూపాయలుగా ప్రస్తుతం ట్రేడ్ అవుతుంటే, 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర 60,930 రూపాయలుగా ప్రస్తుతం కొనసాగుతుంది.
దేశంలోనే అత్యధికంగా బంగారం ధరలు ఉండే తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై, కోయంబత్తూర్, సేలం , మధురై, ఈరోడ్, తిరుపూరు, తిరునవ్వేలి, తిరుచ్చి ఈ నెలలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 56,300 రూపాయలు గా ప్రస్తుతం ట్రేడ్ అవుతుంటే, 24 క్యారెట్ల బంగారం ధర 61,420 రూపాయలుగా ప్రస్తుతం కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications