IPL 2023 : ఈసారి ఐపీఎల్లో అంపైర్లకూ కాసుల పంట ! ఒక్కొక్కరికీ ఎంతో తెలుసా ?
ప్రతీ ఏటా నిర్వహించే ఐపీఎల్ లో భాగంగా ఈ సీజన్లోనూ ఆటగాళ్లతో పాటు అంపైర్లకు ఇచ్చే వేతనాలు భారీగా పెరగబోతున్నాయి.
ముంబై : ఐపీఎల్ 2023 ఆరంభానికి సర్వం సిద్ధమవుతోంది. మరోసారి మండే ఎండల్లో అభిమానుల్ని అలరించేందుకు క్రికెటర్లు సిద్ధమవుతున్నారు. అలాగే వీరికి లభించే పారితోషకాల మొత్తం కూడా భారీగా పెరిగింది. దీంతో పాటు ఈ సీజన్లో అంపైర్లకు ఇచ్చే వేతనాలు, భత్యాల మొత్తం కూడా భారీగా పెరిగింది.
ప్రతీ ఐపీఎల్ లో ఆటగాళ్ల పాత్ర ఎంత విలువైనదో అంపైర్ల పాత్ర కూడా అంతే కీలకం. అందుకే క్రికెటర్లతో పాటు అంపైర్లు పోషిస్తున్న పాత్ర మేరకు వాళ్లకు ఇచ్చే వేతనాలు, భత్యాలు కూడా భారీగా పెరుగుతున్నాయి. ప్రతీ సీజన్ లోనూ ఈ మొత్తాలు పెరుగుతుండగా.. ఈసారి కూడా పెంచాలని ఐపీఎల్ యాజమాన్యం నిర్ణయించింది. గత సీజన్లో ఉన్న మొత్తాల కంటే ఈసారి మరింత ఎక్కువగా వేతనాలు ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో పాటు స్పాన్సర్ షిప్ ల ద్వారా వారు పొందే ఆదాయం దీనికి అదనం.

IPL అంపైర్‌లలో రెండు గ్రేడ్లలో ఎలైట్ ప్యానెల్, డెవలప్‌మెంట్ అంపైర్లు ఉంటారు. ఎలైట్ ప్యానల్ అంపైర్లు ఐపీఎల్ లో అత్యంత ఉన్నత స్థాయి మ్యాచ్‌లను నిర్వహించడానికి బాధ్యత వహించే టాప్-ర్యాంక్ అధికారులుగా పరిగణిస్తుంటారు. మరోవైపు కొత్త వారు, ఎక్కువ అనుభవం లేని వారిని డెవలప్ మెంట్ అంపైర్లుగా నియమిస్తారు. వీరికి భవిష్యత్తులో అలైట్ ప్యానెల్ అంపైర్లుగా మారేందుకు శిక్షణగా ఇది ఉపయోగపడుతుంది.
రెండు గ్రేడ్లలో అంపైర్ల వేతనాలను ఓసారి గమనిస్తే.. ఎలైట్ ప్యానెల్ అంపైర్ల ప్రాథమిక వేతనం లక్షా 98వేలుగా ఈసారి నిర్ణయించారు. గత సీజన్ లో వీరికి లక్షా 75 వేల రూపాయలు బేసిక్ వేతనంగా ఇచ్చారు. ఈసారి ఇది 23 వేల రూపాయలు పెరిగింది. దీంతో పాటు ఎలైట్ ప్యానెల్ అంపైర్లు వారు నిర్వహించే ప్రతి మ్యాచ్‌కి రోజువారీ భత్యం రూ.12,500 అందుకుంటారు. ఇందులో వారి ప్రయాణ, వసతి ఖర్చులు కూడా ఉంటాయి. ఎలైట్ ప్యానెల్ అంపైర్లు IPL అన్ని మ్యాచ్‌లలో
అంపైరింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తే వారు రూ.40 లక్షల వరకూ సంపాదించుకునేందుకు వీలుంటుంది.
అలాగే ఈ ఐపీఎల్ సీజన్లో డెవలప్‌మెంట్ అంపైర్లకు బేసిక్ పేగా రూ.59,000 ఇవ్వనున్నారు. గత సీజన్లో డెవలప్ మెంట్ అంపైర్లకు రూ.40వేలు మాత్రమే ఇచ్చారు. దీంతో పోల్చుకుంటే ఈసారి ఏకంగా రూ.19 వేల రూపాయలు బేసిక్ పే రూపంలోనే పెరిగింది. డెవలప్‌మెంట్ అంపైర్లు ఐపీఎల్ లో ప్రతి మ్యాచ్‌లో విధులు నిర్వర్తించే అవకాశం రాదు కాబట్టి వారికి రోజువారీ భత్యం ఇవ్వరు. అయినప్పటికీ వారు తమ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి, భవిష్యత్తులో ప్రమోషన్‌ల కోసం వారిని సిద్ధం చేయడానికి ఎలైట్ ప్యానెల్ అంపైర్ల నుండి శిక్షణ, మార్గదర్శకత్వం లభిస్తుంది.












Click it and Unblock the Notifications