కేటీఆర్ సీఎం కావాలి.. ఏపీ నుంచి బైక్ యాత్ర.. అమెరికాలో స్ట్రీట్ ఫుడ్ టేస్ట్ చేసిన ఐటీమంత్రి
ఒక్కొక్కరిదీ ఒక్కొ అభిమానం.. స్టార్, పొలిటికల్ లీడర్స్, క్రికెటర్స్, స్పోర్ట్స్ పర్సన్స్‌కు ఫ్యాన్స్ ఉంటారు. ఆయా రంగాల్లో వారు రాణించాలని కోరుకుంటారు. అయితే తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కూడా సామరస్యంగానే ఉంటున్నాయి. నీటి వాటా కోసం జల జగడం జరిగినా.. తర్వాత సద్దుమణిగిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణ డైనమిక్ మంత్రి కేటీఆర్‌కు పొరుగు రాష్ట్రంలో అభిమాని ఉన్నారు. ఫ్యాన్ అంటే మాములు కాదు.. కేటీఆర్ సీఎం కావాలని బైక్ యాత్ర కూడా చేపట్టారు.
మంత్రి కేటీఆర్ సీఎం కావాలని గుంటూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తి బైక్ యాత్రకు శ్రీకారం చుట్టారు. సొంతూరు నుంచి యాదాద్రి వరకు బైక్ ర్యాలీ చేపట్టారు. మాచర్లకు చెందిన బాలరాజు గౌడ్‌కు కేటీఆర్ అంటే ఇష్టమట. తన అభిమాన నేత సీఎం కావాలని కోరుతూ బాలరాజు గౌడ్ బైక్‌పై యాత్రగా యాదాద్రికి బయలుదేరారు. యాత్ర గురించి తాను తమ స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లానని తెలిపారు. యాత్రకు ఎమ్మెల్యే కూడా పర్మిషన్ ఇచ్చారని చెప్పారు. కేటీఆర్ సీఎం కావాలని యాదాద్రిలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రం ఏదైతేనేం.. కేటీఆర్ అంటే తనకు అభిమానం అని, అతను సీఎం కావాలని కోరుకోవడంలో తప్పేముందని బాలరాజు గౌడ్ అంటున్నారు.

మరోవైపు మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనలో బిజీగా ఉన్నారు. న్యూయార్క్‌లో కోలాహలం, సందడి నడుమ గతకాలపు మధుర జ్ఞాపకాలను కొన్ని గుర్తుచేసుకున్నారు. ఈ మేరకు ఫోటోలను షేర్ చేశారు. ఫైజర్ ఫార్మా కంపెనీ ప్రతినిధులతో సమావేశం తర్వాత న్యూయార్క్ వీధుల్లో తిరిగారు. లెక్సింగ్ టన్ అవెన్యూ స్ట్రీట్-34లో ఓ ఫుడ్ స్టాల్ చూసి అక్కడ ఆగారు. చికెన్, రైస్, వేడి వేడి సాస్‌తో హాయిగా ఫుడ్ తీసుకున్నారు. ఇది ఎంతో బాగుంది... మీరు కూడా తినండి అని కేటీఆర్ ట్వీట్ కూడా చేశారు. సో మిగతా వారు కూడా టేస్ట్ చేయండి. దేశం కానీ దేశంలో.. మన ఫుడ్ రుచి చూడండి.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications