Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Wife: భార్య గొంతు చీల్చి చంపి ఆత్మహత్య చేసుకున్న భర్త, 10 రోజుల ముందు పాప, డెత్ నోట్ లో స్టోరీ !

లక్నో/సహరాన్ పూర్/ చెన్నై: సంవత్సరం క్రితం వివాహం చేసుకున్న యువకుడు అతని భార్యతో సంతోషంగా కాలం గడుపుతున్నాడు. ఐదు నెలల క్రితం దంపతుల మద్య తేడాలు వచ్చాయి. నిత్యం దంపతుల మద్య గొడవలు ఎక్కువ కావడంతో పెద్దలు సర్దిచెబుతూ వచ్చారు. 10 రోజుల క్రితం భార్య పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ పుట్టిన తరువాత దంపతుల మద్య రామాయణాలు ఇంకా ఎక్కువ అయ్యాయి. ఇంట్లో ఉన్న అమ్మను అతని మామ ఇంటికి పంపించిన భర్త అతని భార్యతో గొడవ పెట్టుకున్నాడు. మాటామాటా పెరిగిపోవడంతో పచ్చి బాలింత అయిన భార్యను పట్టుకుని చితకబాదేశాడు. తరువాత పదునైన కత్తి తీసుకున్న భర్త అతని భార్య గొంతు చీల్చి దారుణంగా హత్య చేశాడు. భార్య ప్రాణం పోయిందని నిర్దారించుకున్న భర్త ఓ డెత్ నోట్ రాసి పెట్టి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన భార్యను చంపేసి నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని భర్త డెత్ నోట్ రాసిపెట్టాడు. తల్లి హత్యకు గురై తండ్రి ఆత్మహత్య చేసుకోవడంతో 10 రోజుల పసికందు అనాథ అయ్యింది.

Illegal affair: బలిసిన ఆంటీతో భర్త ఎంజాయ్, వడ్డీవ్యాపారి హత్యకు భార్య స్కెచ్, కాలేజ్ స్టూడెంట్ !

 సంవత్సరం క్రితం పెళ్లి

సంవత్సరం క్రితం పెళ్లి

ఉత్తరప్రదేశ్ లోని సహరాన్ పూర్ జిల్లాలోని దేవబంద్ ప్రాంతంలో ధరంపూర్ ఏరియాలో దిలీప్ కుమార్ (25) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. దిలీప్ కుమార్ తండ్రి కొన్ని సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మరణించాడు. తల్లి, బంధులు చూసిన ప్రతిభ (20) అనే యువతితో సంవత్సరం క్రితం దిలీప్ కుమార్ వివాహం జరిగింది.

 దంపతుల హ్యాపీలైఫ్

దంపతుల హ్యాపీలైఫ్

భార్య ప్రతిభతో కలిసి దిలీప్ కుమార్ సంతోషంగానే జీవితం సాగించాడు. దిలీప్ కుమార్ తల్లి కూడా అతనితోనే కలిసి ఉంటోంది. ప్రతిభ గర్బవతి కావడంతో దిలీప్ కుమార్ తో పాటు అతని తల్లి, బంధువులు చాలా సంతోషపడ్డారు. ఐదు నెలల క్రితం నుంచి దిలీప్ కుమార్, ప్రతిభ దంపతుల మద్య తేడాలు వచ్చాయి.

 10 నెలల క్రితం పండంటి బిడ్డ

10 నెలల క్రితం పండంటి బిడ్డ

నిత్యం దిలీప్ కుమార్, ప్రతిభ దంపతుల మద్య గొడవలు ఎక్కువ కావడం పెద్దలు సర్దిచెబుతూ వచ్చారు. 10 రోజుల క్రితం దిలీప్ కుమార్ భార్య ప్రతిభ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. పాప పుట్టిందని ప్రతిభ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉన్నారు. బిడ్డ పుట్టిన తరువాత దిలీప్ కుమార్, ప్రతిభ దంపతుల మద్య రామాయణాలు ఇంకా ఎక్కువ అయ్యాయి.

 అమ్మను మామ ఇంటికి పంపించి భార్యను చంపేశాడు

అమ్మను మామ ఇంటికి పంపించి భార్యను చంపేశాడు

గురువారం సాయంత్రం ఇంట్లో ఉన్న అమ్మను దిలీప్ కుమార్ అతని మామ ఇంటికి పంపించాడు. తరువాత దిలీప్ కుమార్ భార్య ప్రతిభతో గొడవ పెట్టుకున్నాడు. మాటామాటా పెరిగిపోవడంతో పచ్చి బాలింత అయిన భార్య ప్రతిభను పట్టుకుని చితకబాదేశాడు. తరువాత పదునైన కత్తి తీసుకున్న దిలీప్ కుమార్ అతని భార్య ప్రతిభను పట్టుకుని మంచం మీద వేసి ఆమె గొంతు చీల్చి దారుణంగా హత్య చేశాడు.

 ఉరి వేసుకున్న భర్త

ఉరి వేసుకున్న భర్త

భార్య ప్రతిభ ప్రాణం పోయిందని నిర్దారించుకున్న భర్త దిలీప్ కుమార్ ఓ డెత్ నోట్ రాసి పెట్టి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సమస్యల కారణంగా తన భార్య ప్రతిభ పంచాయితీలు ఎక్కువ అయ్యాయని, ఆమె పోరు తట్టుకోలేక చంపేసి నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని దిలీప్ కుమార్ డెత్ నోట్ రాసిపెట్టాడు.

 పక్కింటి వాళ్లకు అనుమానం వచ్చి ?

పక్కింటి వాళ్లకు అనుమానం వచ్చి ?

దిలీప్ కుమార్, ప్రతిభ ఉదయం నుంచి రాత్రి వరకు బయటకు రాకపోవడంతో పక్కింటిలో నివాసం ఉంటున్న వారి బంధువులకు అనుమానం వచ్చి కిటికీలో చూశారు. మంచం మీద ప్రతిభ రక్తపుమడుగులో పడిఉండటం, ఫ్యాన్ కు దిలీప్ కుమార్ వేలాడుతూ శవమై కనిపించడంతో హడలిపోయిన బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

 డెత్ నోట్ వివరాలు ?

డెత్ నోట్ వివరాలు ?

తల్లి హత్యకు గురై తండ్రి ఆత్మహత్య చేసుకోవడంతో 10 రోజుల పసికందు అనాథ అయ్యింది. కుటుంబ కలహాలకారణంగా భార్య ప్రతిభను దారుణంగా హత్య చేసిన దిలీప్ కుమార్ తరువాత అతని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు అంటున్నారు. అయితే డెత్ నోట్ లో దిలీప్ కుమార్ రాసిన పూర్తి సమాచారం చెప్పడానికి పోలీసులు నిరాకరించరాని స్థానిక హిందీ మీడియా అంటోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+