Hyderabad: రంజాన్ సీజన్లో రికార్డు సృష్టించిన బిర్యానీ, హలీమ్ ఆర్డర్లు
హైదరాబాద్: రంజాన్ వచ్చిందంటే చాలు నగరంలో హలీం సందడి మొదలవుతుంది. నగర ప్రజలే గాక, తెలుగు రాష్ట్రాలు, ఇతర దేశాలకు కూడా ఆర్డర్లు వెళుతుంటాయి. ఇక హైదరాబాద్ నగరంలో బిర్యానీ ఆర్డర్ల గురించి చెప్పక్కర్లేదు. ఈ రంజాన్ సీజన్లో బిర్యానీల ఆర్డర్లు కూడా భారీగా పెరుగుతాయి. ఈ ఏడాది కూడా హలీం, బిర్యానీల ఆర్డర్లు లక్షల్లో జరగడం గమనార్హం. గత ఏడాదిని మంచి విక్రయాలు జరిగాయి.
గత ఏడాదితో పోల్చితే బిర్యానీ ఆర్డర్లు 20 శాతం పెరిగాయి. ఇక హలీం ఆర్డర్లు కూడా ఈ ఏడాది భారీగా పెరిగాయి. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న హలీం ప్రియులు పెద్ద మొత్తంలోనే లాగించేశారు. రంజాన్ నెలలో ఫుడ్ ఆర్డర్స్‌పై స్విగ్గీ విడుదల చేసిన డేటా చూస్తూ షాకవ్వాల్సిందే. కేవలం ఈ ఒక్క నెలలోనే 10 లక్షల బిర్యానీ ఆర్డర్లు బుక్ కావడం గమనార్హం. ఇక హలీం విషయానికొస్తే.. 4 లక్షల హలీం ఆర్డర్లు వచ్చాయి.

హైదరాబాద్ నగరం, శివార్లలోని మొత్తం 350 రెస్టారెంట్ల నుంచి 50 శాతం ఆర్డర్స్ రాగా.. ఇందులో పిస్తా హౌస్ హలీం టాప్ పొజిషన్‌లో ఉంది. ఇక బిర్యానీ ఆర్డర్స్ లో ప్యారడైజ్, మెహఫిల్ ఫేవరేట్‌గా నిలిచింది. హలీంలో చాలా రకాలు ఉన్నా.. మటన్ హలీం వాటా అత్యధికంగా 77 శాతంగా ఉంది.
ఆ తర్వాత చికెన్ హలీంను ఫేవరేట్‌గా ఆర్డర్ చేశారు హైదరాబాద్ సిటీజనులు.
మాల్పువా, ఫిర్నీ, రబ్డీ వంటివి పండుగల ప్రత్యేక డెజర్ట్‌ల ఆర్డర్‌లలో 20 శాతం పెరుగుదల కనిపించింది. రంజాన్ నెలలో డ్రైఫ్రూట్స్, ఫ్రూట్ సలాడ్స్ సైతం భారీగా ఆర్డర్స్ వచ్చాయని.. మెజార్టీ మాత్రం హలీం, బిర్యానీ నిలిచిందని స్విగ్గీ వెల్లడించింది. 2023, మార్చి 23 నుంచి ఏప్రిల్ 18వ తేదీ వరకు వచ్చిన ఆర్డర్ల డేటా ఇది. ఇంకా మరో ఐదు రోజులు ఉండటంతో హలీం, బిర్యానీల ఆర్డలు మరింతగా పెరిగే అవకాశం లేకపోలేదు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్












Click it and Unblock the Notifications