20 ఏళ్ల జైలు.. ఉరిశిక్ష.. జూబ్లీహిల్స్ రేప్ కేసు నిందితుల శిక్షపై సీపీ సీవీ ఆనంద్
జూబ్లీహిల్స్ రేప్ కేసు ఘటన దుమారం రేపుతోంది. గ్యాంగ్ రేప్‌నకు సంబంధించి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పూర్తి వివరాలు వెల్లడించారు. వారికి ఏ శిక్ష పడనుందో వివరించారు. బెంగళూరుకు చెందిన ఓ మైనర్ బాలుడు హైదరాబాద్‌లో తన మిత్రులకు ఓ పార్టీ ఇవ్వాలనుకున్నాడని వివరించారు. హైదరాబాద్‌లోని తన మిత్రులను అడిగి ఆమ్నేషియా పబ్‌లో పార్టీ ఏర్పాటు చేయాలని అనుకున్నాడట. ఒక్కొక్కరికి రూ.1,200 కట్టాలని పబ్ కోరితే... బేరమాడిన బాలురు ఒక్కొక్కరికి రూ.900 చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. మిత్రులకు సర్క్యులేట్ చేసుకుని ఒక్కొక్కరి వద్ద రూ.1,200 వసూలు చేశారు.
పార్టీలో ఆమెతో తొలి ముద్దాయిగా ఉన్న సాదుద్దీన్ మాలిక్ మాట కలిపాడు. ఇతను ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడు.. అంతకన్నా ముందు నిందితుడిగా ఉన్న మరో మైనర్ కూడా ఆమెతో మాట కలిపాడు. వారిద్దరూ బాధితురాలిని లైంగికంగా వేధించారు. తన స్నేహితురాలితో కలిసి బాధితురాలు బయటకు వెళ్లింది. పబ్‌లో సాదుద్దీన్‌తో కలిసి ఐదుగురు మైనర్లు ప్లాన్ వేసుకున్నారు. బయటకు వెళ్లిన బాధితురాలిని ఇద్దరు నిందితులు తమ బెంజ్ కారులో ఎక్కించుకుని బంజారా హిల్స్‌లోని ఓ బేకరీకి వెళ్లారు. వారిని అనుసరించి ఇన్నోవా కారులో మరో నలుగురు వెళ్లారు.

బేకరీ నుంచి బయటకు వచ్చాక ఆరుగురు నిందితులు బాధితురాలిని ఇన్నోవాలో ఎక్కించుకుని జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడి వెనుక నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతానికి వెళ్లారు. కారులో వెళుతుండగానే ఆమెపై నిందితులు రేప్ చేశారట. అనుకున్న ప్రాంతానికి చేరుకున్నాక బాధితురాలిపై ఆరుగురు నిందితులు వరుసగా అత్యాచారం చేశారు. వీడియోలు తీసుకున్నారట. వీడియోలను ఒకరితో మరొకరు షేర్ చేసుకున్నారు. అత్యాచారం తర్వాత బాధితురాలిని ఆమ్నేషియా పబ్ వద్దే వదిలివెళ్లారు. ఆ తర్వాత బాధితురాలు తన తండ్రిని పిలిపించుకుని ఇంటికెళ్లిపోయింది.
గ్యాంగ్ రేప్ సెక్షన్లు నమోదు చేసిన నేపథ్యంలో నిందితులకు మూడు రకాల శిక్షలు పడే అవకాశముందని కమిషనర్ చెప్పారు. 20 ఏళ్ల జైలు శిక్ష, లేదంటే జీవించి ఉన్నంత కాలం పాటు జైలు శిక్ష, లేదంటే ఉరి శిక్ష పడే అవకాశం ఉందని చెప్పారు. అత్యాచారానికి పాల్పడని నిందితుడికి కనిష్ఠంగా ఐదేళ్లు, గరిష్ఠంగా ఏడేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలిపారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications