200 డిజైన్లు.. 10 రంగుల్లో... ఈ సారి ముందుగానే బతుకమ్మ చీరల ఆర్డర్

బతుకమ్మ పండగ కోసం తెలంగాణ ప్రభుత్వం ఆడ పడుచులకు చీరలను అందిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే బతుకమ్మ కోసం ఇప్పటినుంచే చీరలను ప్రభుత్వం ఆర్డర్ చేసింది. నాణ్యమైన చీరలు, రంగులు, డిజైన్ల ఎంపిక చేశారు. దసరా సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఇచ్చే చీరల విషయంలో ఇప్పటి నుంచే దృష్టి సారించింది. ఈ సారి ప్రత్యేకంగా చీరలను ఇవ్వాలని భావిస్తోంది.

సిరిసిల్ల నేతన్నలకు ఈ ఏడాది ముందుగా బతుకమ్మ చీరల ఆర్డర్లు అందుకోనున్నారు. బతుకమ్మ పండుగను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు కోటి చీరలను పంపిణీ చేయనుంది. దీనికి సంబంధించిన ఉత్పత్తి ప్రణాళికను ఖరారు చేసింది. ఈ సారి బతుకమ్మ చీరలను 200 డిజైన్లలో, 10 రంగుల్లో తయారు చేయాలని నిర్ణయించింది. ఆ మేరకు చీరలు ఉత్పత్తి చేయాలంటూ మరమగ్గాల యజమానులకు ప్రభుత్వం ఆర్డర్లు ఇచ్చింది.

200 designs and 10 coloures in batukamma sarry. telangana government ordered.

వచ్చే ఆగస్టు నాటికి ఉత్పత్తి లక్ష్యాన్ని పూర్తి చేయాలని నిర్దేశించింది. గతంలో ఉన్న బంగారు వర్ణం నూలు స్థానంలో ఈ సారి రంగుల నూలుతో డిజైన్లను రూపొందించారు. సిరిసిల్ల పరిశ్రమలోని 271 మ్యాక్స్‌, ఎస్‌ఎస్‌ఐ యూనిట్ల యజమానులు వస్త్రోత్పత్తి ఆర్డర్లు తీసుకుంటున్నారు. అధికారులు ఈ ఏడాది సిరిసిల్లకు 4.48 కోట్ల మీటర్లు, కరీంనగర్‌లోని గర్షకుర్తికి 14 లక్షలు, హనుమకొండకు 6.31 లక్షలు, వరంగల్‌కు 93 వేలు, మండేపల్లి టెక్స్‌టైల్‌ పార్కుకు 24 లక్షల మీటర్ల వస్త్రం ఉత్పత్తికి ఆర్డర్లు కేటాయించారు.

రాష్ట్రంలో ఈ ఏడాది బతుకమ్మ చీరల కోసం 5 కోట్ల మీటర్ల వస్త్రం అవసరమని అంచనా వేశారు. మరో పది రోజుల్లో ఉత్పత్తి ప్రారంభం కానుంది. ఈ ఏడాది బతుకమ్మ ఉత్సవాల కంటే ముందే చీరలను పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎప్పుడూ పండగ సమయంలో ఇవ్వడం.. రద్దీ రద్దీ ఉండటం తెలిసిందే. ఈ సారి కనీసం వారం నుంచి పది రోజుల ముందు ఇవ్వాలని ప్రభుత్వం అనుకుంటుంది. ఆ మేరకు కసరత్తు చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+