తెలంగాణలో 208 కరోనా కేసులు: ఇద్దరు మృతి

కరోనా కేసులు తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా తగ్గుతున్నాయి. ఏపీలో హెచ్చు తగ్గులు ఉండగా.. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం తగ్గుముఖం పడుతున్నాయి. తెలంగాణలో కరోనా మహమ్మారి గతంలో కంటే ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది. ఒకప్పుడు వేలాదిగా నమోదయ్యే కేసులు ప్రస్తుతం మరింత తగ్గాయి. 200 వరకు వస్తున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 45,415 కరోనా పరీక్షలు నిర్వహించారు. 208 పాజిటివ్ కేసులు వచ్చాయి. కరోనాతో ఇద్దరు చనిపోయారు. దీంతో చనిపోయిన వారి సంఖ్య 3940కి చేరింది. ఒక్కరోజులో 201 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3929 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ఇటు వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే. వైరస్‌ను జయించేందుకు రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే అందరికీ సెకండ్ డోసు ఇస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలో చాలా మంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది. దీంతోపాటు బూస్టర్ డోసు వేసుకోవాలని నిపుణులు సూచన చేస్తున్నారు. దీనిపై ప్రకటన రాలేదు.

208 people infected corona in telangana

ఇటు డేల్టా వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. డేల్టా ప్లస్ వేరియంట్ మరింత ప్రమాదకరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దీంతో కరోనా కోసం మరింత పకడ్బందీగా ఉండాల్సిందే. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు డిసెంబర్ వరకు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. జనవరి నుంచి ఏప్రిల్ వరకు థర్డ్ వేవ్ ఇంపాక్ట్ ఉంటుందని హెచ్చరిస్తున్నారు. దానిని దాటేస్తే గానీ.. పరిస్థితి ఏంటో చెప్పలేమని ఒకవిధంగా వార్నింగ్ ఇస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+