కరోనా అప్‌డేట్ : తెలంగాణలో కొత్తగా 267 కేసులు... దేశంలో కొత్తగా 13,823 కేసులు

తెలంగాణలో కొత్తగా 267 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మరో ఇద్దరు కరోనాతో మృతి చెందారు. మరో 1006 కేసుల రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. ఈమేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బుధవారం (జనవరి 20) హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,92,395కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 1583కి చేరింది. ప్రస్తుతం 3919 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి. 2270 మంది పేషెంట్లు హోమ్ ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.గడిచిన 24 గంటల్లో 351 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 2,86,891కి చేరింది.

267 new coronavirus cases and two deaths reported in telangana

గడిచిన 24గంటల్లో మొత్తం 27,471 శాంపిల్స్‌ను పరీక్షించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకూ నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 75,42,537కి చేరింది. ఒక మిలియన్ జనాభాకు సగటున 2,02,647 కరోనా టెస్టులు చేస్తున్నట్లు బులెటిన్‌లో వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో మరణాల రేటు 1.4శాతం ఉండగా... తెలంగాణలో 0.54శాతం ఉన్నట్లు తెలిపారు. జాతీయ స్థాయిలో రికవరీ రేటు 96.7శాతం ఉండగా తెలంగాణలో 98.11 శాతం ఉన్నట్లు తెలిపారు. తాజాగా అత్యధికంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 55 కేసులు మోదయ్యాయి.

ఇక దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 13,823 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,05,95,660కు చేరింది.మరో 162 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,52,718కు పెరిగింది. గడిచిన 24గంటల్లో మొత్తం 16,988 మంది కరోనా నుంచి కోలుకున్నారు.దీంతో ఇప్పటివరకూ కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 1,02,45,741కి చేరింది. ప్రస్తుతం 1,97,201 మంది ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లో చికిత్స పొందుతున్నారు. గడిచిన 24గంటల్లో 7,64,120 కరోనా టెస్టులు చేయగా... ఇప్పటివరకూ చేసిన మొత్తం టెస్టుల సంఖ్య 18,85,66,947కి చేరింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+