Garlic Paste: వామ్మో.. ఆ అల్లం, వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా వాడారా.. !

కాదేదీ కవితకు అనర్హం అన్నట్లుగా.. కాదేదీ కల్తీకి అనర్హం అన్నట్లుగా మారింది. కేటుగాళ్లు ప్రతీదీ కల్తీ చేస్తున్నారు. కొద్ది రోజులు క్రితం టీ పౌడర్(చాపత్త) కల్తి చేసిన విషయం తెలిసిందే. అక్టోబర్ 8న టాస్క్ ఫోర్స్ బృందం హైదరాబాద్‌లోని ఫతేనగర్‌లోని కోణార్క్ టీ పౌడర్ షాపులో సోదాలు చేసింది. భారీ ఎత్తున కల్తీ టీ పౌడర్ ను గుర్తించింది. అంతేకాదు కల్తీ టీ పౌడర్ ను హైదరాబాద్‌లోని వివిధ టీ స్టాల్స్‌కు ప్యాక్ చేసి పంపిణీ చేసినట్లు తేల్చింది. టీ పౌడర్ లో కొబ్బరి చిప్పల పొడి, పలు కృత్రిమ రంగలు కలిపి కల్తీ చేస్తున్నారు.

తాజాగా కల్తీ వెల్లుల్లి పేస్ట్ ను అధికారులు పట్టుకున్నారు. అక్టోబర్ 24న కమిషనర్ టాస్క్ ఫోర్స్ (సౌత్ వెస్ట్ జోన్) లంగర్ హౌజ్ పోలీసుల సహకారంతో హీనా బ్రాండ్ పేరుతో కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్‌లను విక్రయిస్తున్న ఇమ్రాన్ సలీమ్ అరెస్ట్ చేశారు. ఆసిఫ్‌నగర్‌లోని జెబాబాగ్‌లోని సలీమ్ నివాసంలో సుమారు రూ.4,45,380 విలువైన 835 కిలోల కల్తీ ఉత్పత్తిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

800 kg of adulterated ginger and garlic paste was seized in Hyderabad

సలీమ్ తక్కువ నాణ్యత గల అల్లం, వెల్లుల్లిని సిట్రిక్ యాసిడ్‌తో కలపడం ద్వారా పేస్ట్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. కెమికల్స్ వాడి సువాసనను పెంచినట్లు తెలిపారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ, కిరానా స్టోర్‌లు, హోటల్లు, రెస్టారెంట్‌లకు విక్రయించినట్లు గుర్తించారు. అలాగే ఉత్పత్తిపై గడువు తేదీలు, బ్యాచ్ నంబర్‌లు లేవని అధికారులు తెలిపారు. దీంతో నిందితుడు సలీమ్ పై పలు కేసులు నమోదు చేశారు.

కల్తీ వస్తువుల విక్రయించినందుకు సెక్షన్ 274, హానికరమైన పదార్థాలతో తయారు చేసినందకు సెక్షన్ 275, మోసపూరిత తప్పుడు సమాచారం ఇచ్చినందుకు సెక్షన్ 125తోపాటు లేబులింగ్ లో అక్రమాలకు పాల్పడినందుకు సెక్షన్ 318(4) కింద కేసు నమోదు చేశారు. కాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ బయట కొనుగోలు చేయడం కంటే ఇంట్లోనే తయారు చేసుకోవడం మంచిదని చెబుతున్నారు. ఏది కొనుగోలు చేసిన బ్రాండ్ చూసి కొనాలని సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+