ఐజీగా నటిస్తూ మహిళకు బెదిరింపులు: హైదరాబాద్ వ్యక్తిని అరెస్ట్ చేసిన రాజస్థాన్ పోలీసులు
హైదరాబాద్: నగరానికి చెందిన ఓ వ్యక్తిని రాజస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. రాజస్థాన్‌లోని అజ్మీర్ రేంజ్ ఐజీ రూపిందర్ సింగ్ పేరిట వాట్సాప్‌లో సందేశాలు పంపి.. బెదిరింపులకు పాల్పడుతున్నాడన్న ఫిర్యాదు మేరకు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.
ఈ కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లో నివసించే ఓ వ్యక్తి.. అజ్మీర్ రేంజ్ ఐటీ పేరిట తన చెల్లికి వాట్సాప్‌లో అసభ్యకర, బెదిరింపు సందేశాలు పెడుతున్నారంటూ మార్చి 20న రాజస్థాన్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు హైదరాబాద్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించి అరెస్ట్ చేశారు.

బాధితుడు చెప్పిన వివరాల మేరకు నిందితుడిపై ఐపీసీ 419, 66డీ ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. బాధితుల ఫోన్‌కు వచ్చిన నిందితుడి సెల్‌ఫోన్ నెంబర్ ఆధారంగా హైదరాబాద్‌లోని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే వ్యక్తిగా గుర్తించారు. హైదరాబాద్ పోలీసుల సహకారంతో శనివారం నిందితుడిని అరెస్ట్ చేసి తరలించినట్లు రాజస్థాన్ పోలీసులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications