Hyderabad: అనురాధ హత్య కేసులో ట్విస్ట్.. సహజీనం చేసి రూ.17 లక్షలు, కిలో బంగారం..
కొద్ది రోజుల క్రితం మూసీ నదిలో మనిషి తలకాయ దొరికిన కేసులో నిందితుడు చంద్రమోహన్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మొదటగా మలక్ పేటకు చెందిన మృతురాలు అనురాధ నిందితుడు చంద్రమోహన్ కు అప్పు ఇచ్చిందని.. తిరిగి డబ్బులు అడగడంతో హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. కానీ ఈ కేసులో కొత్త మలుపు తిరిగింది. ఈ కేసును రాచకొండ పోలీసులకు బదిలీ చేయగా.. పోలీసులు నిందితుడిని విచారించారు. చంద్రమోహన్ రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు కీలక విషయాలు బయటపేట్టారు.
చంద్రమోహన్ తండ్రికి అనురాధ పనిచేసే ఆస్పత్రిలో ఆపరేషన్ జరిగింది. అప్పుడే చంద్రమోహన్ కు అనురాధ పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రమేగా మారింది. దీంతో చంద్రమోహన్, అనురాధ 15 ఏళ్లుగా సహజీవనం చేస్తున్నారు. కొద్ది సంవత్సరాల క్రితం చంద్రమోహన్ తన ఇంట్లో గ్రౌండ్ ఫ్లోర్ కు అనురాధు తీసుకొచ్చాడు. రూమ్ అద్దెకిస్తున్నట్లు కుటుంబ సభ్యులకు తెలిపారు. ఆ తర్వాత కూడా అనురాధతో సహజీవనం కొనసాగించాడు. కొద్ది రోజులుగా అనురాధ, చంద్రమోహన్ మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో పలుమార్లు గొడవ పడ్డారు.

ఈ క్రమంలోనే అనురాధ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. వివాహం కోసం మాట్రిమోనీలో ప్రకటనలు కూడా ఇచ్చింది. ఆ తర్వాత తాను పెళ్లి చేసుకుంటున్నట్లు.. తన డబ్బు, నగలు ఇచ్చేయాలని అనురాధ చంద్రమోహన్ కోరింది. అనురాధ చంద్రమోహన్ కు రూ.17 లక్షల నగదు, 2 కిలోలపైగా బంగారం ఇచ్చింది. ఇవన్ని తిరిగి ఇవ్వాలని అనురాధ డిమాండ్ చేయడంతో ఏం చేయాలో చంద్రమోహన్ కు తెలియలేదు. డబ్బు, నగలు ఇచ్చే బదులు ప్రాణం తీస్తే ఓ పని అయిపోతుందని చంద్రమోహన్ భావించాడుు.
ఓ రోజు అనురాధ వద్దకు వెళ్లాడు. ఆమెతో మాటామాట కలిపాడు. వెంట తెచ్చుకున్న కత్తి 15తిపోట్లు పొడిచి హత్య చేశాడు. ఓక మృతదేహాన్ని ఇంట్లోనే పెట్టాడు. అనురాధ పక్క రూమ్ వారు ఊరు వెళ్లగానే మృతదేహాన్ని ముక్కలు చేశాడు. వాటిని అనురాధ ఇంట్లో ఫ్రిజ్ లోనే పెట్టాడు. 5 రోజుల తర్వాత తలను తీసుకెళ్లి మూసీ నదిలో పడేశాడు.
చంద్ర మోహన్ హత్య చేసిన యూట్యూబ్ లో చూసు బాడీని ముక్కలుగా కట్ చేశాడు. వాసన రాకుండా కెమికల్స్ కూడా స్ప్రే చేశాడు. హత్య అనంతరం అనురాధ ఫోన్ తో చార్ ధామ్ యాత్రకు వెళ్తున్నట్లు మెసేజ్ లు పెట్టాడు. అనురాధ కూతురితో కూడా చాటింగ్ చేశాడు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications