Hyderabad: పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌వేపై రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి..

హైదరాబాద్‌లోని పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌వేపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. వారు గూగుల్ మ్యాప్ లో లోకేషన్ వెతికే క్రమంలో రోడ్డు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. చనిపోయిన పోచారంలోని ప్రముఖ ఐటీ సంస్థలో పనిచేస్తున్న ఎంహెచ్‌ఎన్‌వీఎస్‌ చరణ్‌ గా గుర్తించారు. చరణ్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి కొత్త సెక్రటేరియట్, అంబేద్కర్ విగ్రహాన్ని చూడడానికి వచ్చారు.

ట్యాంక్ బండ్ వద్ద కాసేపు గడిపిన తర్వాత కేబుల్ బ్రిడ్జికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే వారికి దారి తెలికయపోవడంతో ఫోన్లలో గూగుల్ మ్యాప్‌లను ఓపెన్ చేశారు. అయితే పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే ఫ్లైఓవర్ పైకి ద్విచక్రవాహనాలు అనుమతించరని తెలియని చరణ్ గూగుల్ మ్యాప్ ప్రకారం ఎక్స్ ప్రెస్ వే ఎక్కాడు. ఎక్స్‌ప్రెస్‌వేలో రెండు మూడు కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత, ముగ్గురూ తప్పు దిశలో వెళ్తున్నారని గ్రహించారు. పిల్లర్ నంబర్ 82 వద్ద ఉన్న ర్యాంప్‌పై నుంచి కిందకు దిగేందుకు చరణ్ బైక్‌ను తిప్పాడు. అయితే బైక్‌ను ఓ కారు ఢీకొట్టింది.

 Hyderabad

చరణ్‌కు తీవ్రగాయాలు కావడంతో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మరో ఇద్దరు స్నేహితులకు స్వల్ప గాయాలయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాకు చెందిన చరణ్ హైదరాబాద్ శివార్లలోని పోచారంలోని ప్రముఖ ఐటీ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. అతను తన స్నేహితులతో కలిసి సమీపంలోని టౌన్‌షిప్‌లో ఉంటున్నాడు. వారాంతంలో, తొమ్మిది మంది స్నేహితులు మూడు మోటర్‌బైక్‌లపై నగరానికి వచ్చారు.

హైదరాబాద్ శివార్లలోని శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి మెరుగైన కనెక్టివిటీని అందించడానికి 11.6 కి.మీ పొడవైన PVNR ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించబడింది. ఈ మార్గంలో ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాలు, భారీ వాహనాలను అనుమతి లేదు. కానీ వారు గూగుల్ మ్యాప్ సాయంతో ఎక్స్ ప్రెస్ వే పైకి ఎక్కారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+