హైదరాబాద్‌లో బోర్డ్ తిప్పేసిన సాఫ్ట్‌వేర్ కంపెనీ: 700 మంది ఉద్యోగులపై లక్షల్లో అప్పులు
హైదరాబాద్: నగరంలోని ఓ సాఫ్ట్‌వేర్ బోర్డు తిప్పేయడంతో అందులో పనిచేస్తున్న వందలాది మంది ఉద్యోగుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. గత కొంత కాలంగా అనేక కంపెనీలు తమ సంస్థలోని ఉద్యోగులను తొలగిస్తున్న క్రమంలో.. ఏకంగా సాఫ్ట్‌వేర్ కంపెనీ ఎత్తేయడంతో ఉద్యోగులు రోడ్డున పడ్డారు. హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి ప్రాంతంలో ఇన్సోఫి అనే సాఫ్ట్‌వేర్ కంపెనీ రాత్రికి రాత్రే బోర్డ్ తిప్పేయడం నగరంలో సంచలనంగా మారింది.
ఇన్సోఫి కంపెనీ కార్యాలయం ముందు మంగళవారం భారీ ఎత్తున ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. 20 నెలలుగా జీతాలు కూడా చెల్లించలేదని.. ఇప్పుడు ఏకంగా కంపెనీ ఎత్తేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులను టెర్మినెట్ చేస్తూ కంపెనీ ఈమెయిల్స్ పంపిందని.. అయితే 650 మంది పేరున ఒక్కొక్కరిపై నాలుగు లక్షల రూపాయలు, 50 మంది ఉద్యోగుల పేరుతో ఒక్కొక్కరిపై 10 లక్షల రూపాయలు కంపెనీ లోన్ తీసుకుందని.. ఇప్పుడు తాము వాటిని ఎలా చెల్లించాలని ఆందోళన చెందుతున్నారు.

ప్రముఖ కంపెనీగా కొనసాగిన ఇన్సోఫి ఒక్కసారిగా దాదాపు కంపెనీలోని ఉద్యోగులందరినీ తొలగించడం హైటెక్ సిటీలో కలకలం రేపింది. ఇప్పటికే పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తుండగా.. ఇన్సోఫి ఇలా చేయడం చర్చనీయాంశంగా మారింది. కంపెనీ ఎత్తేయడంతో 700 మంది ఉద్యోగులు రోడ్డున పడటంతో మిగితా ఐటీ కంపెనీలో ఉద్యోగులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications