Hyderabad: లండన్‍లో విహారయాత్రకు వెళ్లి హైదరాబాద్ యువతి మృతి..
ఇంగ్లాండ్ లో తెలంగాణకు చెందిన యువతి మృతి చెందింది. హైదరాబాద్ కు చెందిన యువతి పై చదువులకు లండన్ వెళ్లి అక్కడే కన్నుమూశారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరుకు చెందిన కొమ్మారెడ్డి శశిధర్ రెడ్డి, జ్యోతి దంపతులు హైదరాబాద్ వచ్చిఐఎస్‌సదన్ డివిజన్ లక్ష్మీనగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరికి కూతరు తేజస్వి ఉన్నారు. ఆమె హైదరాబాద్ లోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో సీఎస్ఈ బిటెక్ పూర్తి చేశారు.
పై చదువుల కోసం లండన్ లోని క్రాన్ ఫీల్డ్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యారు. గత సంవత్సరం సెప్టెంబర్ లో ఆమె లండన్ వెళ్లారు. అయితే ఏప్రిల్ 11న ఆమె తన స్నేహితులతో కలిసి బ్రైటని బీచ్ కు వెళ్లారు. అక్కడ ఫ్రెడ్స్ కలిసి ఎంజాయ్ చేశారు. నీటిలోకి తిగడంతో భారీ అలలకు సముద్రంలోకి కొట్టుకెళ్లారు. వెంటనే అలర్ట్ అయిన స్నేహితులు ఎమర్జెన్సీ రెస్పాన్స్ బృందానికి సమాచారం ఇచ్చారు.
వెంటనే అక్కడి చేరుకున్న ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం తేజస్వి కోసం గాలింపు చేపట్టారు. కొన్ని గంటల తర్వాత సముద్రంలో తేజస్వి మృతదేహాన్ని గుర్తించిన ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం మృతదేహాన్ని ససెక్స్ కౌంటీ ఆస్పత్రికి తరలించారు. తేజస్వి స్నేహితులు ఆమె చనిపోయిన విషయాన్ని హైదరాబాద్ లోని తల్లిదండ్రులకు తెలిపారు.ఉన్న ఒక్కగానొక్క బిడ్డ మృతి చెందడంతో తేజస్వి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. కాగా ఆమె మృతదేహాన్ని హైదరాబాద్‌కు తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. తేజస్వి బంధువులు ఈ విషయమై మంత్రి కేటీఆర్ కు ట్వీట్ చేశారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బుధవారం మృతురాలి తల్లిదండ్రులతో ఫోన్ లో మాట్లాడారు. శుక్రవారం సాయంత్ర వరకు తేజస్వి మృతదేహం హైదరాబాద్ చేరుకుంటుందని సమాచారం అందించారు. తేజస్వి చనిపోవడానికి ముందు తన తల్లిదండ్రులతో వీడియోకాల్‌లో మాట్లాడినట్లు బంధువులు తెలిపారు. ఆరేడు నెలల్లో గ్రాడ్యుయేషన్ కూడా ఉండటంతోసెర్మనీకి వెళ్లడానికి తల్లిదండ్రులు ఏర్పాట్లు చేసుకున్నారని తెలిపారు.
మరో ఘటనలో కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామ పరిధిలోని గుడ్డెలుగులపల్లి కి చెందిన నాగసముద్రం శ్రీనివాస్ అనే వ్యక్తి దుబాయిలో ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. నాగ సముద్రం శ్రీనివాస్ కొన్ని సంవత్సరాల నుంచి దుబాయికి వెళ్లి అక్కడి ఒక కంపెనీలో పనిచేస్తున్నాడు. మూడు రోజుల క్రితం రోడ్డు దాటుతుండగా ప్రమాదానికి గురై తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిసింది. శ్రీనివాస్ కు భార్య, కుమారుడు ఉన్నాడు.












Click it and Unblock the Notifications