నవీన్ హత్య తర్వాత నిందితుడి షాకింగ్ ఫోన్‌కాల్‌ వైరల్; హరిహర కృష్ణ తండ్రి ఏమన్నారంటే!!

నవీన్ హత్య తర్వాత నిందితుడి షాకింగ్ ఫోన్‌కాల్‌ వైరల్ అవుతుంది. నిందితుడు హరిహర కృష్ణ తండ్రి హత్య విషయంలో ఒక్కడే చేసి ఉండడని సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన క్రైమ్ లవ్ స్టోరీలో మరో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. నవీన్ హత్య తర్వాత హరిహరకృష్ణ స్నేహితులతో మాట్లాడిన ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అత్యంత దారుణంగా నవీన్ హతమార్చి, జుగుప్సాకరంగా నవీన్ శరీర భాగాలను కత్తితో కోసి, గుండెను బయటకు తీసి, పొట్ట చీల్చి పేగులను బయటకు తీసి, తల, మొండెం వేరుచేసి, వేళ్ళు కట్ చేసి సైకోల ప్రవర్తించిన హరి హర కృష్ణ నవీన్ హత్య తర్వాత వేసిన డ్రామా అందరిని షాక్ కు గురిచేస్తుంది.

హత్య తర్వాత హరిహర కృష్ణ ఆడియో వైరల్

హత్య తర్వాత హరిహర కృష్ణ ఆడియో వైరల్

నవీన్ ని హతమార్చిన తర్వాత హరిహర కృష్ణ స్నేహితులకు ఫోన్ చేసి నవీన్ ఎక్కడున్నాడో తెలియట్లేదు అన్న... వాళ్ళ ఇంట్లో వాళ్ళు నాకు ఫోన్ చేసి ఏడుస్తున్నారు. నా దగ్గరికి వచ్చి వెళ్ళిపోయాడు. నీకేమైనా నవీన్ గురించి తెలిస్తే చెప్పన్నా అంటూ.. ఏమీ తెలియని అమాయకుడిలాగా మాట్లాడిన ఆడియో ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. తనకేమీ తెలియనట్టు బాగా నటించిన అతను, నవీన్ కు డ్రగ్స్, గంజాయి, ఆల్కహాల్ అలవాట్లు ఉన్నాయని చెప్పుకొచ్చాడు.

 అమాయకుడిలా హరిహర కృష్ణ డ్రామా

అమాయకుడిలా హరిహర కృష్ణ డ్రామా


ఇక ఫోన్లో అవతల మాట్లాడిన వ్యక్తి నవీన్ తన ప్రియురాలి కోసమే వచ్చినట్టున్నాడు. ఇప్పుడు కనిపించకపోవడం ఏంటి? మిస్సింగ్ కేస్ పెడదామా అని అనేసరికి ఇప్పుడే అలా ఏం వద్దు అన్నా అంటూ మెల్లగా జారుకున్నాడు. కేవలం ఒక అమ్మాయి ప్రేమ కోసం క్రూరంగా స్నేహితుడైన నవీన్ ని చంపి, ఆపై అత్యంత జుగుప్సాకరమైన రీతిలో సైకోలా ప్రవర్తించిన హరి హరకృష్ణ ఏమీ తెలియని అమాయకుడిలా నటించిన తీరు ఆ ఆడియో విన్నవారందరిని విస్మయానికి గురిచేస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రయాంగిల్ లవ్ స్టోరీ లో ఊహించని విలన్ హరి హరకృష్ణ ఆడియో వైరల్ గా మారింది.

 మద్యం మత్తులో హత్య జరిగి ఉంటుంది.. ఇందులో ఇంకా ఎవరైనా ఉన్నారేమో: నిందితుడి తండ్రి

మద్యం మత్తులో హత్య జరిగి ఉంటుంది.. ఇందులో ఇంకా ఎవరైనా ఉన్నారేమో: నిందితుడి తండ్రి


ఇదిలా ఉంటే నవీన్ హత్య మద్యం మత్తులో జరిగి ఉంటుందని, ఈ హత్య తన కొడుకు ఒక్కడే చేసి ఉండడని, దీని వెనక మరికొందరి హస్తం ఉండి ఉంటుందని హరిహర కృష్ణ తండ్రి చెబుతున్నారు. తన కొడుకు కొందరితో కలిసి రూమ్ తీసుకుని ఉంటున్నాడని, వారెవరో తెలుసుకుని వారిని కూడా విచారించాలని హరిహర కృష్ణ తండ్రి అంటున్నారు. నవీన్ హరిహర కృష్ణల స్నేహితురాలిని కూడా విచారిస్తే విషయాలు బయటకు వస్తాయని అంటున్నాడు. అంతేకాదు తన కొడుకు హరిహర కృష్ణ బాగా చదివేవాడని, పదో తరగతిలో స్కూల్ ఫస్ట్ వచ్చాడని, ఎప్పుడు ఎవరిపైన చెయ్యి కూడా చేసుకోలేదని అలాంటి వాడిని సైకో అంటే ఎలా నమ్మాలి అంటూ ప్రశ్నించారు.

నవీన్ కుటుంబానికి క్షమాపణలు చెప్పిన హరిహర కృష్ణ తండ్రి

నవీన్ కుటుంబానికి క్షమాపణలు చెప్పిన హరిహర కృష్ణ తండ్రి


30 ఏళ్లుగా ఆర్ఎంపీ గా పని చేస్తున్న తనకు ఒక సైకో ఎలా ప్రవర్తిస్తాడో అవగాహన ఉందని అలాంటి లక్షణాలు ఇవి తన కొడుకులో లేవన్నారు. నవీన్ తల్లిదండ్రుల బాధ తాను అర్థం చేసుకోగలనని పేర్కొన్న ఆయన ఆ కుటుంబానికి క్షమాపణలు చెప్పారు. హత్య విషయం తెలిసిన తర్వాత పోలీసులకు లొంగిపోవాలని తానే తన కొడుకు హరిహర కృష్ణకు చెప్పానని పేర్కొన్న ఆయన హరి హరకృష్ణకు ఏ శిక్ష వేయాలన్నది న్యాయస్థానాలే నిర్ణయిస్తాయంటూ వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+