Akkineni Nagarjuna: అక్కినేని నాగార్జునకు నోటీసులు..
హీరో అక్కినేని నాగార్జునకు నోటీసులు అందాయి. గోవాలో నాగార్జున చేపట్టిన నిర్మాణ పనులు చేపట్టారు. అయితే ఈ పనులు ఆపేయాలంటూ స్థానిక అధికారులు పనులు నోటీసులు జారీ చేశారు. అశ్వెవాడ గ్రామ పరిధిలో సర్వే నెంబర్ 211/2Bలో అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారన్న కారణంతో గోవా పంచాయతీరాజ్ చట్టం 1994 కింద ఆ గ్రామ అధికారులు నోటీసులు పంపించారు.

బిగ్ బాస్ సీజన్-6
వెంటనే పనులు నిలిపివేయకుంటే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామ పరిధిలో నిర్మాణ పనులకు అధికారుల నుంచి సరైన అనుమతి తీసుకోలేదని పంచాయతీ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా నాగార్జున ఇటీవలే ముగిసిన తెలుగు బిగ్ బాస్ సీజన్-6 లో హోస్ట్ గా చేశారు.

ది ఘోస్ట్
నాగ్ చివరిసారిగా రణబీర్ కపూర్, అలియా భట్ నటించిన బ్రహ్మాస్త్రలో నటించారు. సోనాల్ చౌహాన్‌తో కలిసి యాక్షన్-థ్రిల్లర్ డ్రామా 'ది ఘోస్ట్'లో నటించారు. అక్టోబరు 5న విడుదలైన ది ఘోస్ట్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. కాగా నాగార్జున సినిమాలే కాకుండా బిజినెస్ కూడా చేస్తుంటారు.

ఎన్ కన్వెన్షన్
నాగర్జునకు ఎన్ కన్వెన్షన్, ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ ఉన్నాయి. నాగార్జున పెద్ద కొడుకు అక్కినేని చైతన్య కూడా హోటల్ బిజినెస్ చేస్తున్నారు. ఓన్ క్లౌడ్ కిచెన్ బ్రాండ్ షోయును ప్రారంభించారు. ఈ మధ్యే ఈ హోటలకు సంబంధించి దగ్గుబాటి వెంకటేష్ కూతురు అశ్రిత, బావ నాగ చైతన్యతో కలిసి ఓ యూట్యూబ్ వీడియో చేశారు. ప్రస్తుతం వీడియో వైరల్ అవుతోంది.













Click it and Unblock the Notifications