హైదరాబాదీలకు అలర్ట్: 11న ఈ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా బంద్

హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో నవంబర్ 11న తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని సంబంధిత అధికారులు తెలిపారు. మరమ్మతుల దృష్ట్యా సోమవారం ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు నీటి సరఫరా ఉండబోదని అధికారులు చెప్పారు.

హైదరాబాద్ నగరంలోని ఆర్సీపురం,అశోక్ నగర్, జ్యోతినగర్, లింగంపల్లి, గంగారం, మదీనగూడ, మియాపూర్, బీరంగూడ, అమీన్‌‌పూర్, ఎర్రగడ్డ, కేపీహెచ్‌బీ, మూసాపేట, చందానగర్, జగద్గిరిగుట్ట తదితర ప్రాంతాల్లో సోమవారం నీటి సరఫరా ఉండబోదని.. ఈ ప్రాంతాల్లోని ప్రజలు సహకరించాలని అధికారులు కోరారు.

Alert for Hyderabadis Drinking water supply will be shut in these areas on 11th

సిటీలో అక్రమ నిర్మాణాలపై విరుచుకుపడిన హైడ్రా

హైదరాబాద్ నగరంలోని అక్రమ నిర్మాణాపై మరోసారి హైడ్రా విరుచుకుపడింది. ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణల కూల్చివేతలపై కొద్ది రోజులుగా నిశ్శబ్దంగా ఉన్న హైడ్రా.. తాజాగా, శనివారం ఫిల్మ్ నగర్ రోడ్డు నెం.12లో బుల్డోజర్లతో విరుచుకుపడింది. అక్కడి ప్రముఖ విగ్రహాల సమీపంలోని నిర్మాణాన్ని నేలమట్టం చేసింది. రెండు జేసీబీల సహాయంతో హైడ్రా సిబ్బంది షెడ్డును కూల్చివేశారు.

ఫిల్మ్ నగర్ హౌజింగ్ సొసైటీ రోడ్డును ఆక్రమించి ఫిల్మ్ నగర్ మహిళా మండలి పేరుతో నిర్మాణం చేపట్టి కార్యకలాపాలు నిర్వహిస్తోందని స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదును పరిశీలించిన హైడ్రా డిప్యూటీ సిటీ ప్లానర్.. మూడు రోజుల కిందట ఫిల్మ్ నగర్ హౌజింగ్ సొసైటీకి నోటీసులు జారీ చేశారు.

అనధికారికంగా నిర్మించిన ఫిల్మ్ నగర్ మహిళా మండలి భవనాన్ని 24 గంటల్లో తొలగించాలని ఆదేశించారు. అయితే, ఫిల్మ్ నగర్ హౌజింగ్ సొసైటీ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో అనధికారిక నిర్మాణాన్ని కూల్చివేశామని హైడ్రా అధికారులు తెలిపారు. ఆ ప్రదేశంలో ఉన్న విగ్రహాల జోలికి వెళ్లలేదని చెప్పారు.

అయితే హైడ్రా కూల్చివేతపై ఫిల్మ్ నగర్ హౌజింగ్ సొసైటీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తమ సొసైటీకి చెందిన 290 గజాల్లో మహిళా మండలి భవనంతో పాటు విగ్రహాలు పెట్టడానికి కేటాయించామని, తాము ఎలాంటి రోడ్డును ఆక్రమించలేదని సొసైటీ కార్యదర్శి ఖాజా సూర్యనారాయణ తెలిపారు. తమ స్థలంలోని నిర్మాణాన్ని హైడ్రా అన్యాయంగా కూల్చివేసిందని వాపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+