Amit Shah: చేవెళ్లలో అమిత్ షా పర్యటన.. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షాలు..
వికారాబాద్ జిల్లా చేవెళ్లలోని కేవీఆర్ గ్రౌండ్‌లో జరిగే బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా(Amit Shah) పాల్గొన్నారు. ఈ బహిరంగ సభ కారణంగా హైదరాబాద్ శివారు ప్రాంథాల్లో ట్రాఫిక్ పోలీసులు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు.
హైదరాబాద్ నుంచి చేవెళ్ల, వికారాబాద్ వైపు వచ్చే భారీ వాహనాలను టిప్పుకాన్ వంతెన వద్ద నార్సింగి-శంకరపల్లి-పర్వేద ఎక్స్‌రోడ్డు-ఆలూరు-వికారాబాద్ వైపు మళ్లిస్తారు. హైదరాబాద్ నుంచి మొయినాబాద్, చేవెళ్ల, వికారాబాద్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను రోటరీ-1 టీఎస్‌పీఏ వద్ద సర్వీస్ రోడ్డు-నార్సింగి-జన్వాడ-శంకర్‌పల్లి-పర్వేద ఎక్స్ రోడ్డు-వికారాబాద్ వైపు మళ్లిస్తారు.

శంషాబాద్, రాజేంద్రనగర్ నుండి ORR ఎగ్జిట్ నెం: 18లో వికారాబాద్ వైపు వచ్చే ట్రాఫిక్ ఎగ్జిట్ నెం: 1 సర్వీస్ రోడ్ - మూవీ టవర్ కొత్త రోడ్ -CBIT T జంక్షన్ - శంకర్‌పల్లి - పర్వేద ఎక్స్ రోడ్ - ఆలూర్ - వికారాబాద్‌గా మళ్లించనున్నారు.
శంషాబాద్, రాజేంద్రనగర్ నుండి ORR ఎగ్జిట్ నెం: 18 మీదుగా చేవెళ్ల వైపు వచ్చే భారీ వాహనాలు ఎగ్జిట్ నెం: 1 సర్వీస్ రోడ్ - మూవీ టవర్ కొత్త రోడ్డు - సిబిఐటి టి జంక్షన్ - శంకర్‌పల్లి - యెంకీపల్లి ఎక్స్ రోడ్ - చేవెళ్ల మీదుగా మళ్లిస్తారు.
టీఎస్‌పీఏ నుంచి చేవెళ్ల, వికారాబాద్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను హిమాయత్‌నగర్ ఎక్స్ రోడ్డు- ప్రగతి రిసార్ట్స్- యెంకేపల్లి ఎక్స్ రోడ్డు- ఆలూర్ ఎక్స్ రోడ్డు- వికారాబాద్ వైపు మళ్లిస్తారు. టీఎస్‌పీఏ నుంచి చేవెళ్ల, వికారాబాద్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను హిమాయత్‌నగర్ ఎక్స్ రోడ్డు- ప్రగతి రిసార్ట్స్- యెంకేపల్లి ఎక్స్ రోడ్డు- చేవెళ్ల వైపు మళ్లిస్తారు. టీఎస్‌పీఏ నుంచి మొయినాబాద్, చేవెళ్ల, వికారాబాద్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను హిమాయత్‌నగర్ ఎక్స్‌రోడ్-ప్రగతి రిసార్ట్స్-యెంకేపల్లి ఎక్స్ రోడ్-శంకరపల్లి వైపు మళ్లిస్తారు.
వికారాబాద్ నుంచి మొయినాబాద్, హైదరాబాద్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను ఆలూర్ ఎక్స్ రోడ్డు వద్ద ఆలూరు - పర్వేద ఎక్స్ రోడ్డు - శంకర్‌పల్లి - నార్సింగి - హైదరాబాద్ వైపు మళ్లిస్తారు. వికారాబాద్ నుంచి షాబాద్, షాద్‌నగర్ వైపు వచ్చే ట్రాఫిక్ బస్తీపూర్ ఎక్స్ రోడ్డు వద్ద పమెన - పమెన ఎక్స్ రోడ్డు - నాగర్‌గూడ ఎక్స్ రోడ్డు - షాబాద్ వైపు మళ్లిస్తారు.
షాబాద్ నుంచి వికారాబాద్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను పమెన ఎక్స్ రోడ్ వద్ద పమెన - బస్తేపూర్ - NH 163 - వికారాబాద్ వైపు మళ్లిస్తారు. మొయినాబాద్ నుంచ వికారాబాద్ వైపు వచ్చే ట్రాఫిక్ షాబాద్ ఎక్స్ రోడ్ - పమెన ఎక్స్ రోడ్ వద్ద పమెన - బస్తేపూర్ - ఎన్ హెచ్ 163 - వికారాబాద్ వైపు మళ్లించనున్నారు.ప్రయాణికులు తమకు సహకరించాలనిపోలీసులు కోరారు.
-
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
హైదరాబాద్ లో దంచికొడుతున్న భారీ వర్షం.. -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!!












Click it and Unblock the Notifications