Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కాకరేపుతోన్న కోటా కామెంట్స్: అనసూయపై వ్యాఖ్యలు, ధీటుగా స్పందించిన యాంకర్

ఇటీవల కామెంట్లు ఎక్కువ అవుతున్నాయి. కొందరు తమ స్థాయి మరచిపోయి మరీ నోరు పారేసుకుంటున్నారు. ఎదుటివారు ఫీలవుతారు.. వారి మనసు బాధ పడుతుందని ఆలోచించడం లేదు. ముఖ్యంగా ఫేమస్ ఫీమెల్ యాక్టర్స్‌పై కామెంట్స్ కాస్త దుమారం రేపుతున్నాయి. ఇవాళ సీనియర్ నటుడు కోటా శ్రీనివాస రావు నోరు జారారు. నటి అనసూయ గురించి బోల్డ్ కామెంట్స్ చేశారు.

కోట కామెంట్స్

కోట కామెంట్స్


కోట శ్రీనివాసరావు ఇటీవల ఓ యూట్యూబ్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనసూయపై కామెంట్స్ చేశారు. అనసూయ మంచి నటి అని, అందంగానే ఉంటుందని అభిప్రాయ పడ్డారు. అనసూయ డ్రెస్సింగ్ తనకు నచ్చదని పేర్కొన్నారు. అందంగా ఉండే అనసూయ అలాంటి దుస్తులు వేసుకోవాల్సిన అవసరం లేదని కోట కామెంట్ చేశారు. ఆయన వ్యాఖ్యలపై అనసూయ రియాక్ట్ అయ్యారు.

అనసూయ రియాక్షన్

అనసూయ రియాక్షన్

అనసూయ కూడా సోషల్ మీడియాలో తీవ్రంగా స్పందించారు. తన దుస్తులు, వేషధారణపై వ్యాఖ్యలు తీవ్రంగా బాధించాయని తెలిపారు. ఎంతో అనుభవం ఉన్న ఆ నటుడు మరీ ఇంత దిగజారీ కామెంట్ చేయడం విచారకరమని పేర్కొన్నారు. ఎలాంటి దుస్తులు ధరించాలనే విషయం తన వ్యక్తిగత విషయం అని, ఒక్కోసారి వృత్తిపరంగా విభిన్న ఆహార్యంలో కనిపించాల్సి ఉంటుందని అనసూయ వివరించారు. దాంతోపాటు సోషల్ మీడియాలో వేరొకరి వేషధారణ, దుస్తులపై పనికిరాని చెత్తను ప్రముఖంగా ప్రచారం చేస్తుండడం బాధాకరమని అభిప్రాయపడ్డారు. అప్పట్లో సోషల్ మీడియా ఉండుంటే ఈ నటుడి తాగుబోతు తనాన్ని, ఇతర విపరీత ధోరణులను ప్రశ్నించి ఉండేదా? అని నిలదీశారు.

మరీ వారి సంగతేంటీ..?

మరీ వారి సంగతేంటీ..?

పెళ్లై, పిల్లలు కూడా ఉండి, వెండితెరపై చొక్కా లేకుండా బాడీ చూపిస్తూ హీరోయిన్లతో రొమాన్స్ చేసే స్టార్లను ఎందుకు ప్రశ్నించరని అనసూయ ప్రశ్నించారు. తనలాగా పెళ్లయి, ఇద్దరు బిడ్డల తల్లి అయి ఉండి ఇప్పటికీ చిత్ర పరిశ్రమలో పనిచేస్తూ, వృత్తిపరంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న వారు, అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడించేవారు మీకు నచ్చడం లేదా? అని అడిగారు. మీ పని మీరు చేసుకోండి... ఇతరులపై అభిప్రాయాలు వెల్లడించడం మానుకోవాలని అనసూయ కామెంట్ చేశారు.

Recommended Video

    CLP Leader Bhatti Vikramarka Comments On Telangana Assembly
    ఏం జరుగునో

    ఏం జరుగునో

    సో కోటా కామెంట్స్ అగ్గి రాజేశాయి. దానికి అనసూయ కూడా అలానే రియాక్ట్ అయ్యారు. కాస్త బాధతోనే సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ వివాదం ఇప్పటితో సమసిపోతుందో లేదంటే మరింత దుమారం రేపుతుందో చూడాలీ మరీ.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+