Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మరో రెండురోజులు గ్రేటర్‌లో జోరువాన, సిబ్బంది అలర్ట్.. ఏపీలో మహిళను కాపాడిన స్థానికులు..

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్రరూపం దాల్చింది. దీంతో రాబోయే రెండు రోజులు తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని చోట్ల భారీ, మరికొన్ని చోట్ల అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. వర్షాలకు సంబంధించి జీహెచ్ఎంసీ ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. మరో రెండు రోజులపాటు గ్రేటర్ పరిధిలో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అందులో తెలిపింది.

అలర్ట్.. అలర్ట్...

అలర్ట్.. అలర్ట్...


లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ డిజాస్టర్ అండ్ ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ సూచించారు. అలాగే అనవసరంగా ప్రజలు బయటకు రావద్దని సూచించారు. వర్షాలకు సంబంధించి ఎంతటి విపత్తు వచ్చిన ఎదుర్కోవడానికి జీహెచ్ఎంసీ సిద్ధంగా ఉందని తెలిపారు. 90కి పైగా మాన్సూన్, డిజాస్టర్ బృందాలను అందుబాటులో ఉన్నాయని ఆయన వివరించారు.

ప్రజలు ఖాళీ

ప్రజలు ఖాళీ

వర్షాల నేపథ్యంలో పాత ఇళ్లలోని ప్రజలను ఖాళీ చేయిస్తున్నామని చెప్పారు. కొన్నింటినీ కూల్చివేస్తున్నామని కూడా ఆయన వివరించారు. గ్రేటర్ పరిధిలో పాత ఇళ్లలో ఉన్న ప్రజలను ఖాళీ చేయించాలని పురపాలక శాఖా మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. ఆ మేరకు అధికారులు చర్యలు చేపట్టారు. గత మూడు రోజుల నుంచి హైదరాబాద్‌లో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తోన్న సంగతి తెలిసిందే. భారీ వర్షంతో నగర రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. చిన్న వర్షానికే నగరంలోని రహదారులు నిండుకుండలా కనిపిస్తోన్న సంగతి తెలిసిందే.

వర్ష బీభత్సం


ఇటు తెలంగాణ వ్యాప్తంగా కూడా వర్షాలు కొనసాగుతున్నాయి. జిల్లాల్లో వర్షం కురవడంతో పంటకు తీవ్ర నష్టం వాటిల్లితోంది. మొక్కజోన్న, వరి పంటకు తీవ్ర నష్టం జరుగుతోందని రైతులు వాపోతున్నారు. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తోన్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు నష్టం జరుగుతోందని వాపోతున్నారు.

మహిళను కాపాడి


వర్షాల వల్ల చిన్న చిన్న బ్రిడ్జీపై వరదనీరు పారుతోంది. దీంతో అటువైపు వెళ్లినవారు చిక్కుకుంటున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి ఘటన జరిగింది. కృష్ణా జిల్లా సున్నంపాడు వద్ద ఓ మహిళ దాటేందుకు ప్రయత్నించింది. కానీ అప్రమత్తమయిన స్థానికులు.. తాడుకట్టి ఆమె దగ్గరకు వెళ్లారు. వరదనీరు రావడంతో ఆమె భయపడిపోగా.. స్ధానికులు కాపాడారు. ఈ వీడియోను కొందరు ట్వీట్టర్‌లో పోస్ట్ చేశారు. సాయం చేసిన వారిని ప్రశంసిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+