సిగరెట్, మద్యం సేవించడంలో మనోళ్లే తోపులు
Recommended Video

హైదరాబాద్ : మందుతో పాటు పొగకు అలవాటుపడుతున్నవారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. అమ్మకాల విషయంలో ఈ రెండింటికి ఉన్న ప్రాధాన్యత చెప్పనవసరం లేదు. నిత్యవసరాల వస్తువుల చిట్టాలో ఈ రెండు కూడా చేరిపోయాయంటే అతిశయోక్తి కాదేమో.
మద్యం, ధూమపానం సేవించడంలో మనోళ్లు ముందు వరుసలో నిలిచారు. ఈ రెండు అతిగా తీసుకునేవారిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముందున్నాయి. జాతీయ పోషకాహార సంస్థ సర్వే ప్రకారం పొగ తాగడం ఎక్కువ శాతమున్నవారీగా ఏపీ, తెలంగాణ ఐదో స్థానంలో నిలిస్తే.. మద్యం విషయంలో రెండో స్థానం ఆక్రమించాయి.

ఎటుచూసినా మనోళ్లే తోప్స్
జాతీయ పోషకాహార సంస్థ (National Institution of Nutrition - NIN) నిర్వహించిన సర్వేలో విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూశాయి. ఆహారపు అలవాట్లలో భారీగా మార్పులు రావడమే గాకుండా మద్యం తాగడం, పొగ సేవించడం తదితర అవలక్షణాలకు చాలామంది బానిసలవుతున్నారు. ఈ రెండింటిని కొంతమంది ఫ్యాషన్ గా మొదలుపెట్టి రానురాను కట్టడి చేయలేనంతగా వాటికి దాసులైపోతున్నారు. ఎన్ఐఎన్ తాజా సర్వే ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో మద్యం, పొగ సేవించేవారి సంఖ్య వీపరీతంగా పెరిగిపోయింది. మద్యం సేవించేవారి శాతం చూసినట్లయితే 2వ స్థానం.. పొగతాగేవారి విషయంలో 5వ స్థానం ఆక్రమించాయి.

అక్కడ స్మోకింగ్ తక్కువే..!
పొగ తాగేవారిలో 40.6 శాతంతో పశ్చిమ బెంగాల్ 1వ స్థానంలో నిలిచింది. తమిళనాడుకు 2వ స్థానం, కర్ణాటకకు 3వ స్థానం, న్యూఢిల్లీకి 4వ స్థానం లభించగా.. తెలుగు రాష్ట్రాలు 5వ స్థానంలో నిలిచాయి. ఇక స్మోకింగ్ తక్కువ నమోదైన రాష్ట్రాల్లో 3.9 శాతంతో చివరన నిలిచింది బీహార్.
మద్యం విషయంలో కేంద్రపాలిత ప్రాంతం అండమాన్ నికోబార్ టాప్ లో ఉంది. 51.3 శాతంతో 1వ స్థానం సొంతం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 37.4 శాతంతో 2వ స్థానం, 16.9 శాతంతో రాజస్థాన్ 3వ స్థానం, 12.4 శాతంతో గుజరాత్ 4వ స్థానం దక్కించుకున్నాయి.

మద్యం ఎక్కువైతే అనారోగ్యమే..!
మద్యం ఎక్కువయితే డేంజరే అంటున్నారు ఎన్ఐఎన్ నిపుణులు. మందు అధికంగా తాగితే.. కొవ్వు, రక్తపోటు, షుగర్, ఊబకాయం లాంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. అయితే మద్యానికి, ధూమపానానికి లింక్ ఉంటుంది. అది తీసుకుని ఇది తీసుకునేవాళ్లు చాలామంది ఉంటారు. మద్యం సేవించే సమయంలో పొగ తాగడం కొందరికి అలవాటుగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లోని పట్టణాల్లో స్మోకింగ్ అలవాటున్నవారు 30 శాతం మంది మద్యం తీసుకున్నట్లు తేల్చింది ఎన్ఐఎన్ సర్వే.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications