గుడ్ న్యూస్.. జూన్ సెకండ్ వీక్ నుంచి స్పూత్నిక్ వీ.. ఇక్కడ అందుబాటులో..

కరోనా వైరస్ నివారణ, నిర్మూలన టీకాల వల్లే సాధ్యం. మన దేశంలో కోవాక్సిన్, కోవిషిల్ట్ వ్యాక్సిన్లు అందజేస్తున్నారు. అయితే వాటి కొరత కాస్త ఇబ్బందిగా మారింది. దేశంలో స్పూత్నిక్ వీ వ్యాక్సిన్ కూడా రానుంది. దీనికి సంబంధించి ఓ ప్రకటన వెలువడింది. జూన్ రెండో వారం నుంచి అపోలో ఆస్పత్రిలో టీకాలు అందుబాటులో ఉంటాయని తెలిసింది.

దేశంలో గల అపోలో ఆసుపత్రుల్లో 'స్పుత్నిక్ వి' వ్యాక్సినేషన్ జూన్ రెండో వారం నుంచి ప్రారంభం కానుంది. అపోలో ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్‌పర్సన్ శోభనా కామినేని ప్రకటనలో తెలిపారు. దేశంలో గల 80 ప్రాంతాల్లో ఇంతవరకూ తమ గ్రూపు 10 లక్షల వ్యాక్సిన్ డోసులు ఇచ్చినట్టు చెప్పారు. ప్రాధాన్యతా క్రమంలో ఫ్రంట్ లైన్ వర్కర్లు, హై రిస్క్ పాపులేషన్, కార్పొరేట్ ఉద్యోగులకు వ్యాక్సినేషన్ ఇచ్చామన్నారు.

apollo hospitals to roll out sputnik v

ఇమ్యునేజేషన్ ప్రోగ్రాంను వేగవంతం చేస్తున్నామని, జూన్‌లో వారానికి మిలియన్ డోసులు, జూలైలో దానికి రెట్టింపు ఇవ్వనున్నట్టు చెప్పారు. ఈ ఏడాది సెప్టెంబర్ చివరి నాటికి 20 మిలియన్ డోసులు పూర్తి చేస్తామని చెప్పారు. ప్రైవేటురంగంలో అతిపెద్ద వ్యాక్సినేటర్‌గా అపోలో గ్రూప్ ఉంది. కరోనాపై పోరాటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తమ సపోర్ట్ కొనసాగుతుందని శోభనా కామినేని తెలిపారు.

Recommended Video

    Niti Aayog On Covid Vaccination Drive పారదర్శక పద్ధతిలోనే రాష్ట్రాలకు వ్యాక్సిన్ డోసులు!

    తమకు సపోర్ట్‌గా నిలుస్తున్న కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు, కొవిషీల్డ్, కొవాగ్జిన్ తయారీదారులకు కృతజ్ఞతలని ఆమె చెప్పారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ వేయించుకుంటేనే అంతా సురక్షితంగా ఉంటారని ఆమె సూచించారు. వ్యాక్సిన్‌కు కూడా కాస్త లిమిట్ ఉండనుంది. ఆరు నెలల వరకు అదీ పనిచేస్తుందని విశ్వసనీయంగా తెలిసింది. కానీ దీనిని ఎవరూ ధృవీకరించలేదు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+