బిడ్డ పుట్టిందని "తలాక్".. ఫోన్‌లోనే చెప్పిన "ప్రిన్సిపల్"
హైదరాబాద్ : ఆడపిల్ల అంటే అంత అలుసెందుకో. బాబైనా, పాపైనా కంటికి రెప్పలా కాపాడుకోవాల్సింది పోయి లింగవివక్షతో బజారున పడుతున్నారు కొందరు. విద్యావంతులు కూడా అదే జాబితాలో చేరి పరువు పొగొట్టుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని పాతబస్తీలో వెలుగు చూసిన ఘటన విస్మయానికి గురిచేస్తోంది.
టోలీచౌక్ ప్రాంతానికి చెందిన ముజామిల్.. స్థానికంగా ప్రైవేట్ స్కూల్ లో ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నారు. 2017 సంవత్సరం జనవరిలో వివాహం చేసుకున్నారు. అయితే మూడు నెలల కిందట ఆయన భార్య ఆడపిల్లకు జన్మనిచ్చింది. అప్పటివరకు బాగానే ఉన్న ముజామిల్ లో సడెన్ గా మార్పు వచ్చింది. పాపకు జన్మనిచ్చావంటూ భార్యను వేధిస్తూ వచ్చాడు.

అదలావుంటే పుట్టింట్లో ఉన్న భార్యకు గత నెల 28న ఫోన్ చేశారు ముజామిల్. ఆమె కాల్ రిసీవ్ చేసుకున్న మరుక్షణమే.. తలాక్ తలాక్ తలాక్ అంటూ ఫోన్ పెట్టేశారు.
దీంతో తల్లిదండ్రులకు విషయం వివరించింది ఆ యువతి. కుటుంబ సభ్యులతో కలిసి అదే రోజు సీసీఎస్ లో ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు జరుగుతోంది. దాదాపు 3 వారాల తర్వాత ఈ ఘటన వెలుగుచూడటం గమనార్హం.












Click it and Unblock the Notifications