అనుకున్నదంతా అయింది.. ప్రేమపక్షులకు పెళ్లిళ్లు చేసిన భజరంగ్ దళ్ (వీడియో)
హైదరాబాద్ : అనుకున్నదంతా అయింది. ప్రేమికుల రోజున పెళ్లిళ్లు జరిగిపోయాయి. ప్రేమ పేరుతో స్వేచ్ఛగా విహరించిన ప్రేమ జంటలకు పెళ్లిళ్లు చేసింది భజరంగ్ దళ్. ఇదేదో ఫ్రీ ఆఫర్ కాదు. ప్రేమికుల రోజును వ్యతిరేకించే భజరంగ్ దళ్ కార్యకర్తలు.. ప్రేమ పక్షులకు వివాహాలు జరిపించారు. పార్కుల్లో జంటలుగా కనిపించిన ప్రేమికులను నిలదీసి పెళ్లిళ్లు జరిపించారు.
ప్రేమికుల రోజు సందర్భంగా ప్రేమ జంటలతో పార్కులు కిటకిటలాడుతుంటాయి. దీంతో వాలెంటైన్స్ డే ను వ్యతిరేకించే భజరంగ్ దళ్ కార్యకర్తలు.. పార్కుల్లో కనిపించే జంటలను అడ్డుకున్నారు. నిజమైన ప్రేమికులైతే ఇలా పార్కుల వెంబడి తిరగడమేంటని ప్రశ్నించారు. మీది నిజమైన ప్రేమే ఐతే పెళ్లి చేసుకోండంటూ సూచించారు.
ఆ క్రమంలో మేడ్చల్ జిల్లా కండ్లకోయ ఆక్సిజన్ పార్కులో భజరంగ్ దళ్ కార్యకర్తలకు తారసపడ్డ ప్రేమజంటకు పెళ్లి జరిపించారు. ఆ వివాహ తంతును వీడియో తీయడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల భజరంగ్ దళ్ కార్యకర్తలు ప్రేమపక్షులకు పెళ్లిళ్లు చేసినట్లు తెలుస్తోంది.













Click it and Unblock the Notifications