Bigg Boss Telugu: మోనాల్ ఎప్పటికీ నా ఇంటి కోడలు కాలేదు..ఎందుకంటే: అఖిల్ తల్లి

హైదరాబాద్ : బిగ్‌బాస్ షో రసవత్తరంగా సాగుతోంది. కంటెస్టెంట్లు ఎవరి గేమ్ పై వారు ఫోకస్ చేసినట్లు కనిపిస్తోంది. ఇక హౌజ్‌లో ఇప్పటి వరకు మోనాల్ అఖిల్ సార్థక్‌ల మధ్య లవ్ ట్రాక్ నడిచింది. అయితే కొద్ది రోజుల క్రితమే ఓ టాస్కు సందర్భంగా వీరిద్దరూ సెపరేట్ అయ్యారు. అయితే బిగ్‌బాస్ షో తర్వాత మోనాల్ అఖిల్ పెళ్లి చేసుకుంటారనే వార్తలు కూడా సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చాయి. అయితే వీరిద్దరి పెళ్లిపై ఓ క్లారిటీ వచ్చింది.

మోనాల్‌ను సేవ్ చేస్తున్నారు..?

మోనాల్‌ను సేవ్ చేస్తున్నారు..?


బిగ్‌బాస్ తెలుగు రియాల్టీ షోలో స్ట్రాంగ్ కంటెస్టెంట్లుగా మోనాల్-అఖిల్‌లు కొనసాగుతున్నారు. వీరిద్దరూ పలుమార్లు డేంజర్ జోన్లోకి వచ్చినా ఎప్పటికప్పుడు సేఫ్ అవుతూ వస్తున్నారు. అయితే మోనాల్‌ను ప్రతి సారీ సేవ్ చేయడంపై నెటిజెన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్వాహకులు మోనాల్‌ను కావాలనే సేవ్ చేస్తూ టీఆర్‌పీ రేటింగ్స్‌ను పెంచేందుకు ప్రేక్షకులను మోసం చేస్తున్నారని నెటిజెన్లు సోషల్ మీడియా వేదికగా చర్చ పెట్టారు. ఇక మోనాల్‌ కోసం ఇంటిలోని ఇతర కంటెస్టెంట్లను బయటకు పంపడాన్ని ప్రేక్షకులు తప్పుబడుతున్నారు.

 వీరి మధ్య ఎలాంటి ప్రేమ వ్యవహారం లేదు

వీరి మధ్య ఎలాంటి ప్రేమ వ్యవహారం లేదు

బిగ్‌బాస్ హౌజ్‌లో మోనాల్ అఖిల్ మధ్య ప్రేమ చిగురించిందనేది చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఇంట్లో వీరు ప్రవర్తిస్తున్న తీరును చూసి చాలామంది ఒక అంచనాకు వచ్చేశారు. కానీ వీరిద్దరి మధ్య ప్రేమ లేదని వారు హౌజ్‌లో కేవలం స్నేహితులుగానే ఉన్నారని అఖిల్ తల్లి ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. అంతేకాదు అఖిల్ మోనాల్‌లు పెళ్లి చేసుకుంటారా అన్న ప్రశ్నకు కూడా ఆమె క్లారిటీ ఇచ్చారు. అసలు పెళ్లి ఎలా జరుగుతుందని అనుకుంటున్నారంటూ ప్రశ్నించారు. బిగ్‌బాస్ హౌజ్‌లోకి వెళ్లే ముందు ప్రేమలో పడటాలు ఉండవని తమకు అఖిల్ మాటిచ్చాడని అతని తల్లి చెప్పుకొచ్చింది

 వయసులో మోనాల్ అఖిల్‌ కంటే పెద్దది

వయసులో మోనాల్ అఖిల్‌ కంటే పెద్దది

ఇక ఉత్తరాది అమ్మాయి మోనాల్‌తో అఖిల్ చాలా క్లోజ్‌గా మూవ్ కావడం ఫ్రెండ్షిప్‌లో భాగమే అని దాన్ని భూతద్దంలో పెట్టి చూడాల్సిన పనిలేదని అఖిల్ తల్లి క్లారిటీ ఇచ్చింది. ఇక అఖిల్‌ మోనాల్ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లో జరగబోదని తేల్చేశారు. అఖిల్ వయస్సు 25 ఏళ్లు అని మోనాల్ వయస్సు 30 ఏళ్లు అని చెబుతూ మోనాల్ ఏజ్‌ను రివీల్ చేసేశారు. తన కొడుకు కంటే వయసులో పెద్దదైన అమ్మాయితో ఎలా పెళ్లి చేస్తామని అఖిల్ తల్లి ప్రశ్నించారు. అఖిల్ బిగ్‌బాస్ నుంచి బయటకు రాగానే తన మనసులో ఏముందో తెలుసుకుని అతని ఆలోచన ప్రకారమే వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు అతని తల్లి చెప్పారు.

 మోనాల్ ఇంటి కోడలుగా రాదు

మోనాల్ ఇంటి కోడలుగా రాదు


అఖిల్‌ది ఫ్రెండ్స్ కోసం ప్రాణం ఇచ్చే మనస్తత్వమని చెప్పిన తల్లి మోనాల్‌ను కూడా స్నేహం కోణంలోనే చూస్తున్నాడు తప్పితే మరోలా కాదని తేల్చేశారు. సోషల్ మీడియాలో చాలా చర్చ జరగడమే కాదని రచ్చ కూడా జరుగుతుందని దాన్ని పట్టించుకోబోమని స్పష్టం చేశారు. మోనాల్ అయితే కోడలుగా రాదని క్లారిటీ ఇచ్చేశారు అఖిల్ తల్లి. తల్లిదండ్రులుగా తాము షోను ఎంజాయ్ చేస్తున్నామని మిగతా విషయాలను పట్టించుకోవడం లేదని అఖిల్ తల్లి ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+