Bigg Boss Telugu 4: ఈ సారి కూడా మోనాల్ సేఫ్... మరి ఎవరు ఎలిమినేట్ అయ్యారు..?
బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో ఎన్నో ట్విస్టులు మలుపులతో కొనసాగుతోంది. ఈ సారి ఎలిమినేషన్ ఉంటుందా లేదా అనే విషయంపై కూడా జోరుగా చర్చ జరుగుతుండగానే మరో న్యూస్ లీక్ అయ్యింది. ఈ సారి ఎలిమినేషన్ జరిగిందని ఇప్పటికే ఒక ఇంటి సభ్యులు బయటకు వచ్చేసినట్లు సమాచారం.

ఈ సారి కూడా మోనాల్ సేఫ్
బిగ్‌బాస్ తెలుగు రియాల్టీషో గ్రాండ్‌గా కొనసాగుతోంది. ఇక ఈ వారం హోస్ట్ నాగార్జున షూటింగ్ కారణంగా దూరమయ్యారు. దీంతో అక్కినేని వారి కోడలు సమంతా ఈ వీకెండ్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. సమంతా హోస్ట్‌గా వ్యవహరిస్తున్నందున ఎలిమినేషన్ ఉండకపోవచ్చనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. కానీ ఈ వార్తలకు చెక్ పెడుతూ ఎలిమినేషన్ జరిగిపోయిందని సమాచారం. అయితే కచ్చితంగా మోనాల్ ఈసారి ఎలిమినేట్ అయి ఉంటుందని అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఈ ఉత్తరాది భామను బిగ్‌బాస్ మరో సారి సేఫ్ చేశారు.

దివికి గుడ్‌బై
బిగ్‌బాస్ షో ఏడవ వారం ఎలిమినేషన్‌లో భాగంగా ఈ సారి మోనాల్ మళ్లీ సేవ్ అయ్యింది. డేంజర్ జోన్లో దివి మోనాల్ ఉండగా... అనూహ్యంగా దివిని బిగ్‌బాస్ ఎలిమినేట్ చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఆమె ఇంటి నుంచి బయటకు వచ్చినట్లు ఆమె అధికారిక ఇన్స్‌టాగ్రామ్‌లో కూడా పోస్టింగులు కనిపిస్తున్నాయి. మోనాల్ మళ్లీ సేవ్ కావడంపై పలువురిలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఆ అమ్మాయి ప్రతివారం ఎలిమినేషన్‌కు నామినేట్ అవుతుండగా ఆమెను మాత్రం ఎందకు సేఫ్ చేస్తున్నారని నెటిజెన్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఎలిమినేషన్ ప్రక్రియపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Recommended Video

మోనాల్‌ను ఎందుకు సేవ్ చేస్తున్నారు..?
ఇక మోనాల్‌ను సేవ్ చేస్తే షో రక్తి కట్టదని బిగ్‌బాస్ షో నిర్వాహకులు భావిస్తున్నారు. అందుకే మోనాల్‌ను మళ్లీ ఇంటిలోనే ఉంచినట్లు సమాచారం. ఇక ఆటలో పూర్తి సత్తా చాటుతున్నవారు, జెన్యూనిటీతో టాస్క్‌ను పెర్ఫార్మ్ చేస్తున్నవారని మాత్రమే బిగ్‌బాస్ హౌజ్ నుంచి ఎలిమినేట్ చేస్తున్నారని నెటిజెన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మెహబూబ్ మరియు మోనాల్‌ను బిగ్‌బాస్ నిర్వాహకులే కాపాడుతున్నారని నెటిజెన్లు సోషల్ మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు.
-
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
జనసేన ఎమ్మెల్యేకు ఈసీ షాక్.. బయటపడ్డ 'మిరాకిల్' అక్రమాలు! -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
విజయసాయిరెడ్డి ఇంట్లోనే ఉంటున్న రఘురామకృష్ణంరాజు ? -
సతీమణికి విజయ్ స్పెషల్ విషెస్: ఆ క్యాప్షన్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? -
పెట్రోల్ కష్టాలు.. వారానికి 2 రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం -
పసిడి ధరల్లో బిగ్ బ్లాస్ట్.. ఈ వారంలో -
సామాన్యులకు బిగ్ షాక్.. గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు.. అర్ధరాత్రి నుంచి అమలు -
భారత్ లో బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ లు ఇవే.. ఒక్కసారి విజిట్ చేస్తే.. మళ్లీ మళ్లీ వెళ్తారు..












Click it and Unblock the Notifications