Bigg Boss బ్యూటీ దివికి హాట్ ఆఫర్... ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతున్న వార్త ఇదే..!
హైదరాబాదు: అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో ఫైనల్ స్టేజెస్‌కు చేరుకుంటోంది. ఇప్పటికే 9 వారాలు ముగిసి 10వ వారంలోకి షో ఎంటర్ అయ్యింది. ఇక కంటెస్టెంట్లు కూడా ప్రతి వారం ఎలిమినేట్ అవుతున్నారు. ఎలిమినేషన్ ప్రక్రియపై కాస్త అనుమానాలు ఉన్నప్పటికీ షో పై మాత్రం క్రేజ్ తగ్గకుండా రక్తికట్టించేలా నిర్వాహకులు ప్లాన్ చేసి సక్సెస్ అవుతున్నారు. ఇక బిగ్‌బాస్ షో నుంచి రెండు వారాల క్రితం గ్లామ్ డాల్ దివి ఎలిమినేట్ అయ్యింది. దివి ఎలిమినేట్ అవడంతో ఆమె ఫ్యాన్స్ ఒక్కింత షాక్‌కు గురయ్యారు. అయితేనేం దివి అభిమానులు తిరిగి ఆమెను స్క్రీన్‌పై చూసే గుడ్ న్యూస్ ఒకటి బయటకొచ్చింది.

దివి ఎలిమినేషన్ పై అసంతృప్తి
దివి వద్యా... అప్పటి వరకు పెద్దగా తెలుగు రాష్ట్రాలకు పరిచయం లేని పేరు. ఒక్కసారిగా బిగ్‌బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టడంతో ఈ బ్యూటీకి ఏకంగా లక్షల్లో ఫ్యాన్స్ తయారయ్యారు. దివి స్మైల్‌కే సగం మంది కుర్రకారు అలా పడిపోయారంతే. ఇక బిగ్‌బాస్ హౌజ్‌లో దివి కూడా చాలా చక్కగా ఇచ్చిన టాస్కులను పెర్ఫార్మ్ చేసింది. ఎక్కడా కాంట్రవర్శీలకు తావివ్వకుండా తనపని తాను చేసుకుపోయింది. దివి గేమ్‌ను కూడా చాలా తెలివిగా ఆడింది. అంతేకాదు ఇంటి సభ్యులతో కూడా తన ప్రవర్తన చాలా బాగున్నిందనే మంచి ఒపీనియన్‌ను ప్రేక్షకుల దగ్గర నుంచి సంపాదించుకుంది. అయితే దివి ఒక్కసారిగా ఎలిమినేట్ కావడంతో తెలుగు రాష్ట్రాల ప్రజలే కాదు విదేశాల్లో ఉండి షోను ఫాలో అవుతున్న తెలుగు ప్రజలు కూడా ఎలిమినేషన్‌ను ఒప్పుకోలేకపోయారు.

సినిమాల్లో చిన్న క్యారెక్టర్లతో...
దివి బయటకు వచ్చిన తర్వాత హౌజ్ గురించి చెబుతూ ఒకానొక సందర్భంలో భావోద్వేగానికి గురైంది. అంతేకాదు తనకు అవినాష్ అంటే నచ్చడని నిర్మొహమాటంగా చెప్పేసింది. ఒకరు ఎదుగుతుంటే ప్రోత్సహించడం పోయి వారిని వెనక్కు లాగేయాలన్నట్లుగా అవినాష్ వ్యవహరించేవాడని చెప్పి బాంబు పేల్చింది. ఇదంతా పక్కన పెడితే సినిమాల్లో చిన్న చిన్న కారెక్టర్లు చేసిన దివి... ఒక్కసారిగా బిగ్‌బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టగానే సెలబ్రిటీ అయిపోయింది. ఇక దివి ఎలిమినేషన్ సమయంలో సమంతా హోస్ట్‌గా వ్యవహరించారు. అయితే ఆ రోజు అతిథిగా వచ్చిన హీరో కార్తికేయ తనకు సినిమాలో అవకాశం ఇస్తానని హామీ ఇచ్చారు కూడా.

వెబ్ సిరీస్ సైన్ చేసిన దివి
ఇప్పుడు దివి సెలబ్రిటీ స్టేటస్ అనుభవిస్తుండటంతో నెటిజెన్లు ఆమె గురించి మరింతగా ఇంటర్నెట్‌పై సెర్చ్ చేస్తున్నారు. ఇక దర్శక నిర్మాతల నుంచి కూడా ఈ బ్యూటీకి బాగానే ఆఫర్లు వస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే దివి తన కెరీర్‌ను బిల్డ్ చేసుకునే పనిలో ఉంది. తాజాగా దివి రెండు వెబ్ సిరీస్‌లకు సైన్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఓ సినిమా చేసేందుకు కూడా అంగీకారం తెలిపినట్లు ఫిలింనగర్‌లో వార్త చక్కర్లు కొడుతోంది. ఇక బుల్లి తెరపై తనకంటూ ఓ క్రేజ్‌ను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ అంతా తనకు అనుకూలంగా సాగితే... వెండితెరను కూడా షేక్ చేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతానికి దివి ఇంటిపట్టునే ఉంటూ సెలబ్రిటీ స్టేటస్‌ను ఎంజాయ్ చేస్తోంది.
మొత్తానికి ఇప్పటి వరకు జరిగిన బిగ్‌బాస్ షోల్లో పాల్గొన్న కంటెస్టెంట్లు సినిమాల్లో పెద్ద అవకాశాలు రాకపోగా స్టార్ డమ్ కూడా అనుభవించలేకపోయారు. అయితే దివి అదృష్టం ఎలాగుందో వేచి చూడాల్సిందే..!












Click it and Unblock the Notifications