కిలేడీ లిస్ట్ పెద్దదే.. స్కూళ్లతోపాటు డెంటల్ క్లినిక్స్, స్పా కూడా... బండారం బయటపడిందిలా..
చిన్నారుల ఫోటోలు తీసుకొని న్యూడ్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన లేడీ కిలేడీ బండారం బయటపడింది. ఫాతిమా నేహా అనే కిలేడీ.. స్కూళ్లే కాదు డెంటల్ క్లినిక్స్, సెలూన్లను కూడా వదలకుండా బెదిరించింది. ఈమె అరాచకాలపై స్కూల్ ప్రిన్సిపల్ ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. పిల్లల ఫోటోలే కాదు పేరెంట్స్ ఫోటోలు కూడా మార్పింగ్ చేసిందనే కఠోర నిజం పోలీసుల విచారణలో తేలింది. ఫాతిమా నేహాను మూడురోజుల కస్టడీకి ఇవ్వాలని సీసీఎస్ పోలీసులు మెజిస్ట్రేట్‌ను కోరారు.

255 స్కూళ్లు, సెల్లూన్లు కూడా ..
ఒకటి కాదు రెండు కాదు 255 స్కూళ్లు. ఆయా పాఠశాలలో చిన్నారుల ఫోటోలను తీసుకుంది. ఇంటర్నెట్‌లో లాగిన్ అయి ఫోటోలు తీసుకోవడం విశేషం. వారి ఫోటోలతో పాటు పేరెంట్స్ చిత్రాలు కూడా తీసింది. వారి ఫోటోలను కూడా ఫాతిమా మార్ఫింగ్ చేసిందనే నిజం బయటపడింది. డెంటల్ క్లినిక్స్ సంబంధించిన ఫోటోలు, రెండు స్పా సెలూన్లకు సంబంధించిన చిత్రాలను కూడా సేకరించింది. ఇలా అన్ని ఫోటోలు తీసుకున్నాక తన పనిని నేహా ఫాతిమా ప్రారంభించింది.

ఫోటోల్ అప్‌లోడ్ చేసి ఫోన్
ఫోటోలు అప్‌లోడ్ చేసి ఆయా పాఠశాలకు కిలేడీ ఫాతిమా ఫోన్ చేసింది. ఫోటోలు చూసి స్కూల్ మేనేజ్‌మెంట్ షాక్ తింది. ఇంతలో ఆ స్కూల్‌కు ట్రింగ్ మని ఫోన్ మోగింది. తాను సైబర్ సెక్యూరిటీ నుంచి మాట్లాడుతున్నా అంటూ చెప్పింది. విద్యార్థినుల ఫోటోల విషయం అడిగి తెలివిగా వ్యవహరించింది. ఆమె గురించి తెలియక గుట్టుగా నమ్మారు. ఫోటోలు తీసేస్తానని చెపితే కొందరు నమ్మారు. కానీ తాజాగా 4 స్కూళ్లు, డెంటల్ క్లినిక్స్, స్పా సెలూన్లను ఫాతిమా బ్లాక్ మెయిల్ చేసింది.

బయట పడిందిలా
ఫాతిమా మాటలపై స్కూల్ ప్రిన్సిపల్‌కు అనుమానం వచ్చింది. ఏం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసిన పోలీసులు .. దర్యాప్తులో కీలక విషయాలు బయటపడ్డాయి. ఫాతిమా నేహా బండారం బట్టబయలైపోయింది. విచారణలో కీలక విషయాలు వెలుగుచూశాయి. ఫాతిమాను 3 రోజలు కస్టడీకి ఇవ్వాలని సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు మేజిస్ట్రేట్‌ను కోరారు.

ఇవే ఆ స్కూళ్లు..
ఫాతిమా బెదిరించిన స్కూళ్ల వివరాలు బయటకొచ్చాయి. వాటి వివరాలను పోలీసులు మీడియాకు వివరించారు. అందులో బబుల్స్ జీ, ఫెర్రీ ప్లే స్కూల్, లిటిల్ డాఫోర్జిల్, షార్ప్ కిడ్స్, పీపుల్స్ ప్లే లిటిల్ సోల్జర్స్, లిటిల్ జీనియస్, బ్లూ బాక్స్, రైసింగ్ స్కూల్, రైజింగ్ శాప్, ఫస్ట్ స్టెప్, సింగ్ వ్యాలీ, లిటిల్ పాదర్ స్కూళ్లు ఉన్నాయి. డెంటల్ క్లినిక్, లూయిస్ స్పాను కూడా ఫాతిమా నేహా బెదిరింపులకు గురిచేసింది.
-
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు..! -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications