సస్పెన్షన్ దుమారం.. కావాలనే వచ్చారు, ఎత్తివేయాలి.. హరీశ్ రావు వర్సెస్ బండి సంజయ్
తెలంగాణ పద్దును విత్త మంత్రి హరీశ్ రావు ప్రవేశపెట్టారు. అయితే తొలి రోజునే బీజేపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు సస్పెన్షన్‌కు గురయ్యారు. బడ్జెట్ సమావేశాలు సంప్రదాయం ప్రకారం గవర్నర్ ప్రసంగంతో మొదలవుతాయని చెప్పిన బీజేపీ ఎమ్మెల్యేలు.. కేసీఆర్ సర్కారు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని కామెంట్ చేశారు. గవర్నర్ ప్రసంగం లేకుండా సభనెలా ప్రారంభిస్తారని ప్రశ్నిస్తూ సభలో ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. వెల్‌లోకి దూసుకువచ్చిన ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు రాజా సింగ్, రఘునందన్ రావు, ఈటల రాజేందర్‌ను స్పీకర్ బడ్జెట్ సమావేశాల నుంచి సస్సెండ్ చేశారు. బడ్జెట్ ప్రసంగం తర్వాత ఆర్థిక మంత్రి హరీశ్ రావు బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై స్పందించారు.
Recommended Video

అందుకే వచ్చారట..
బీజేపీ ఎమ్మెల్యేలు సభ నుంచి సస్పెండ్ కావాలనే లక్ష్యంతోనే సభకు వచ్చారని కామెంట్ చేశారు. వెల్‌లోకి దూసుకువచ్చిన 12 మంది రాజ్యసభ సభ్యులను చైర్మన్ సభ నుంచి సస్పెండ్ చేసిన విషయాన్ని హరీశ్ రావు ప్రస్తావించారు. ఢిల్లీకి ఓ న్యాయం, తెలంగాణకు ఓ న్యాయమా? అంటూ ప్రశ్నించారు. అసలు వెల్‌లోకి ఏ పార్టీ సభ్యుడు వచ్చినా సస్పెన్షన్ వేటు తప్పదని గత సమావేశాల సందర్భంగానే అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు చెప్పామని తెలిపారు. వెల్‌లోకి వెళితే ఎలాగూ తమను సస్పెండ్ చేస్తారనే ఉద్దేశ్యంతో బీజేపీ ఎమ్మెల్యేలు వ్యవహరించారని తెలిపారు.

సరికాదు..
ఇటు ఇదే అంశంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. వెల్‌లోకి దూసుకువచ్చిన ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు రాజా సింగ్, రఘునందన్ రావు, ఈటల రాజేందర్‌ను స్పీకర్ బడ్జెట్ సమావేశాల నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై ఇప్పుడు తెలంగాణలో వేడి రాజుకుంది. బీజేపీ నేతలు కావాలనే సస్పెన్షన్ వేటు పడేలా వ్యవహరించారని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఆరోపించారు.

కుట్ర
బీజేపీ తెలంగాణ చీఫ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తమ పార్టీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై ఘాటుగా స్పందించారు. బీజేపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలపై విధించిన సస్పెన్షన్‌ను తక్షణమే ఎత్తేయాలని డిమాండ్ చేశారు. అధికార టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరించి బీజేపీ ఎమ్మెల్యేలను ప్రీప్లాన్డ్‌గా సస్పెండ్ చేసిందని ఆరోపించారు. సభ ప్రారంభమైన రెండు నిమిషాలకే బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడమంటే.. ఆ కుట్ర టీఆర్ఎస్ పన్నిన కుట్ర కాదా? అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications